వాషింగ్టన్: భారత ఎగుమతులపై సుంకాల వడ్డింపుతో వాణిజ్య పోరుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కయ్యానికి కాలు దువ్వడాన్ని అమెరికన్ నేతలు తప్పు పడుతున్నారు. ప్రతిగా భారత్ కూడా అమెరికా నుంచి దిగుమతయ్యే బాదంపప్పు తదితర ఉత్పత్తులపై సుంకాలను విధించడంతో స్థానిక రైతుల ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారత్‌తో వాణిజ్య సంబంధాలను ట్రంప్ నాశనం చేశారని కాలిఫోర్నియా సెనేటర్ డయానె ఫెయిన్ స్టెయిన్ విమర్శించారు. ప్రతీకారంగా భారత్ సుంకాలు పెంచడంతో కాలిఫోర్నియా బాదం, వాల్‌నట్ రైతులు నష్టపోవాల్సి వస్తోందన్నారు. దీనితో భారత్‌కు 217 మిలియన్ డాలర్ల మేర అదనపు ఆదాయం లభించనుంది. అమెరికా నుంచి ఏటా 650 మిలియన్ డాలర్ల విలువైన పప్పులు భారత్‌కు దిగుమతవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment