న్యూఢిల్లీ : అమెరికా నుంచి దిగుమతయ్యే కొన్ని వస్తువులపై భారత్ భారీగా సుంకాలు పెంచింది. భారత్ నుంచి దిగుమతయ్యే స్టీల్, అల్యూమినియం ఉత్పత్తులపై ఇటీవల అమెరికా ప్రభుత్వం పన్నులు పెంచిన విషయం తెలిసిందే. ఇందుకు ప్రతిగా భారత్ అమెరికా నుంచి దిగుమతయ్యే బాదం, పప్పుధాన్యాలు, వాల్‌నట్ తదితర 28 వస్తువులపై పన్ను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఆదివారం నుంచే ఈ పెంపు అమల్లోకి వస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. అమెరికాలో తయారయ్యే, అమెరికా నుంచి దిగుమతయ్యే వస్తువులకు ఇది వర్తిస్తుందని తెలిపింది. వాల్‌నట్‌పై 30 శాతం నుంచి 120 శాతానికి, పప్పులపై 30 నుంచి 70 శాతానికి పన్ను పెరగనుంది. ఫలితంగా ఈ 28 వస్తువులపై పన్ను భారం పెరిగి, దేశీయ మార్కెట్‌లో వీటి ధరలు భారీగా పెరగనున్నాయి. ఈ పెంపుతో భారత్‌కు 217 మిలియన్ డాలర్ల ఆదాయం అధికంగా సమకూరనుంది. కాగా, అమెరికా ప్రభుత్వం చర్యతో భారత్‌కు 2.4కోట్ల డాలర్ల మేర నష్టం వాటిల్లింది.
Comments
Please login to add a commentAdd a comment