
స్మార్ట్ స్నాక్‌గా బాదం..
లండన్ : ఉదయాన్నే అల్పాహారం తీసుకోవడం వీలుకాని సందర్భాల్లో బాదం పప్పు తింటే మేలని తాజా అథ్యయనం స్పష్టం చేసింది. టిఫిన్ తీసుకోకుండా ఉదయానే బాదం ఆహారంగా తీసుకున్న విద్యార్ధుల బ్లడ్ షుగర్ స్ధాయిలు మెరుగ్గా ఉన్నాయని పరిశోధన వెల్లడించింది. వర్సిటీ విద్యార్ధులపై తొలిసారిగా చేపట్టిన ఈ అథ్యయనం బ్రేక్‌ఫాస్ట్ తీసుకోని వారు బాదంను స్నాక్‌గా తీసుకుంటే మెరుగైన ఫలితాలుంటాయని వెల్లడించిందని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన డాక్టర్ రుడీ ఓర్టిజ్ చెప్పారు.
బాదంలో ఆరోగ్యకర కొవ్వులు, ప్రొటీన్, విటమిన్ ఈ, మెగ్నీషియం ఉంటాయని గత పరిశోధనల్లో వెల్లడైంది. బాదంతో బీపీ, కొలెస్ర్టాల్ నియంత్రణలో ఉండటమే కాకుండా, ఇవి ఆకలిని తగ్గించి బరువు పెరిగేందుకూ ఉపకరిస్తాయి. ఆరోగ్యకర పోషకాలతో కూడిన బాదం అన్ని వయసుల వారికి స్మార్ట్ స్నాక్‌గా అథ్యయనం సూచించింది. తాజా అథ్యయన వివరాలు జర్నల్ న్యూట్రియంట్స్‌లో ప్రచురితమయ్యాయి.