జిగర్ ఠండా అనేది మదురై ప్రాంతంలో అందరినీ ఆకర్షిస్తున్న పానీయం. జిగర్ అంటే గుండె, ఠండా అంటే చల్లగా అని అర్థం. అంటే ఈ పానీయం తాగడం వల్ల గుండె చల్లగా ఉంటుంది అని అర్థం.
కావలసినవి
ఐస్‌క్రీమ్ కోసం; పాలు – 2 కప్పులు; కార్న్‌ఫ్లోర్ – 3 టేబుల్ స్పూన్లు; పంచదార – అర కప్పు; తాజా క్రీమ్ – రెండ కప్పులు; తియ్యటి పాలకోవా – 200 గ్రా.; వెనిలా ఎసెన్స్ – 2 టీ స్పూన్లు; చిక్కటి తియ్యటి పాల కోసం; పాలు – 2 కప్పులు ; తియ్య కోవా – 250 గ్రా.
జిగర్ కోసం: బాదం పిసిన్ – 3 టేబుల్ స్పూన్లు; నన్నారి సిరప్ –తగినంత
తయారీ: ∙ఒక పాత్రలో పాలు పోసి, స్టౌ మీద ఉంచి మరిగించాలి ∙పావు కప్పు చల్లటి పాలలో వెనిలా ఎసెన్స్, కార్న్‌ఫ్లోర్ వేసి బాగా కలిపి పక్కన ఉంచాలి ∙వేరే పాత్రలో పాలు, తియ్య కోవా వేసి బాగా కలిపి పక్కన ఉంచాలి ∙స్టౌ మీద ఉంచిన పాలు మరుగుతుండగా, కార్న్‌ఫ్లోర్ కలిపిన పాలను ఇందులో పోసి, ఉండకట్టకుండా ఉండేందుకు ఆపకుండా కలుపుతుండాలి ∙పాలు బాగా చిక్కబడుతుండగా, కోవా వేసిన పాలు పోసి మరోమారు కలపాలి ∙పంచదార జత చేసి మరోమారు కలిపి బాగా మరిగించి దింపి చల్లారనివ్వాలి ∙చల్లారాక క్రీము జత చేసి మళ్లీ బాగా కలిపి, ఈ మిశ్రమాన్ని ఒక ప్లాస్టిక్ కంటెయినర్‌లోకి తీసుకుని మూత పెట్టి, డీప్ ఫ్రిజ్‌లో గంటసేపు ఉంచాలి ∙బయటకు తీసి పాత్రలోకి తిరగబోసి, బాగా కలిపి మళ్లీ ప్లాస్టిక్ కంటెయినర్‌లో పోసి, మరో గంటసేపు ఫ్రిజ్‌లో పెట్టి తీసి, చెక్క గరిటెతో బాగా కలిపి, వేరే పాత్రలోకి తీసుకోవాలి
∙ఇలా చేయడం వల్ల మెత్తటి ఐస్‌క్రీమ్ తయారవుతుంది ∙ఇలా నాలుగైదుసార్లు, మొత్తం ఆరు గంటలు చేయడంతో మెత్తటి ఐస్‌క్రీమ్ తయారవుతుంది ∙బాదం పిసిన్ (సూపర్ మార్కెట్లో దొరుకుతుంది)ను నీళ్లలో ముందురోజు రాత్రంతా నానబెట్టాలి ∙జిగురులా తయారవుతుంది ∙మరుసటి రోజు ఉదయం వడకట్టి, పైన మిగిలిన పదార్థం తీసి పక్కన ఉంచాలి ∙మరొక పాత్రలో పాలు పోసి మూడు వంతులకు తగ్గేవరకు మరిగించాలి ∙తియ్య కోవా జత చే సి బాగా కలిపి పక్కనుంచాలి ∙ఫ్రిజ్‌లో నుంచి ఐస్‌క్రీమ్, పాలు, బాదం పిసిన్ బయటకు తీయాలి ∙నన్నారి సిరప్‌ను కూడా తీసుకోవాలి ∙ఒకపాత్రలో తగినంత బాదం పిసిన్, కోవా పాలు, నన్నారి సిరప్ వేసి బాగా కలిపి గ్లాసులలో పోయాలి ∙ఐస్‌క్రీమ్ స్కూప్‌తో తీసి పైన వేసి అందించాలి.
జిల్ జిల్ జిగర్‌ఠండా
Published Sat, May 5 2018 12:27 AM | Last Updated on Sat, May 5 2018 12:27 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment