శారీరకంగా మానసికంగా మంచి ప్రయోజనకారి ఈ బాదంపప్పులు. డ్రై ఫ్రూట్స్‌లో ది బెస్ట్ ఇవి. వీటిలో విటమిన్ ఇ, ప్రోటీన్, ఫైబర్ వంటివి పుష్కలంగా ఉంటాయి. అందువల్ల వీటిని తీసుకుంటే రక్తపోటు స్థాయిలు అదుపులో ఉండటమే గాక మెదడుని ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. గరిష్ట ప్రయోజనాలు పొందాలనుకుంటే మోతాదుకు మించకుండా తీసుకువాల్సిందే. ఆరోగ్య ప్రయోజనాలతో కూడిన అత్యంత పోషకమైన ఆహారాన్ని అధికంగా తీసుకుంటే మాత్రం సమస్యలు ఫేస్ చేయాల్సిందే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అందువల్ల వీటిని రోజుకు ఎన్ని బాదంపప్పులు తీసుకుంటే మంచిది? ఎలా తీసుకోవాలి? తదితర విశేషాలు తీసుకుందాం!.
దుకాణాల్లో సులభంగా కొనుగోలు చేయగలిగేవి ఈ బాదంపప్పులు. అదీగాక మార్కెట్లో బాదం పప్పులు బాదం పాలు, నూనె లేదా పౌడర్ రూపంలో లభిస్తున్నాయి కూడా. ఇవి స్థూల పోషకాలతో పాటు అధిక పోషకాల ప్రోఫైల్‌ను కలిగి ఉన్నాయి. దీనిలో రాగి, మాంగనీస్, విటమిన్ బీ2 లేదా రెబోప్లావిన్‌న్లు ఉంటాయి. ఇది ఆక్సీకరణ ఒత్తిడిని, నరాల వాపును తగ్గిస్తుంది. అయితే దీన్ని ఎంత మోతాదులో తీసుకోవాలనే దానిపై చాలామందికి స్పష్టత లేదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం..అల్పాహారంగా బాధంపప్పు తీసుకోవాలనుకుంటే మాత్రం ఆ రోజు క్యాలరీలను ఖర్చే చేసే దాన్నిబట్టి తీసుకోవాలని సూచిస్తున్నారు. అంటే.. క్యాలరీ నియంత్రింత ఆహారంలో భాగంగా తీసుకుంటేనే దీని ప్రయోజనాలన్నింటిని పొందగలరు.
- ముఖ్యంగా పెద్దలు ప్రతిరోజూ 20 నుంచి 23 బాదంపప్పులు తీసుకుంటే సరిపోతుంది.
- ప్రతీరోజూ 30 నుంచి 35 గ్రాములు బాదం తినడం వల్ల లిపిడ్ ప్రొఫైల్‌ను మెరుగుపరచడమే గాక సెంట్రల్ అడిపోసిటీ లేదా బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించడంలో సహయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
- అధిక బరువు లేదా ఊబకాయం ఉన్నవారు రోజూకి 84 గ్రాముల బాదంపప్పును తక్కువ కేలరీల ఆహారంలో భాగంగా తీసుకుంటే సమర్థవంతంగా బరువు తగ్గినట్లు పరిశోధనలో వెల్లడైందని నిపుణులు చెబుతున్నారు.
- పిల్లల విషయానికి వస్తే..పసిపిల్లలు (1-3 సంవత్సరాలు):రోజూకి 3-4 బాదంపప్పులు తీసుకుంటే మంచిది.
- పెద్ద పిల్లలైతే (వయసు 9-18 ఏళ్లు) రోజుకు ఎనిమిది నుంచి 10 బాదం పప్పులు తీసుకుంటే మంచిది.
- వీటిని ఆహారంగా తీసుకునే ముందు మీ వ్యక్తిగత ఆరోగ్య సమస్యలను పరిగణలోనికి తీసుకుని వైద్యుల సలహ మేరకు తీసుకుంటేనే మంచిది.
అధికంగా తీసుకోవడం వల్ల కలిగే దుష్ప్రభావాలు..
- దాదాపు 100 గ్రాముల బాదంపప్పు మనకు 50 గ్రాముల కొవ్వును అందిస్తుంది. అందులో గణనీయంగా మోనోశాచురేట్ కొవ్వులు కూడా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతాయి. అలా డైలీ తీసుకుంటే మాత్రం కేలరీలు బర్న్ అవ్వక విపరీతంగా బరువు పెరిగే అవకాశం ఉంటుంది.
- అధికంగా తీసుకుంటే శరీరంలో కొవ్వు నిల్వలు ఉండేందుకు దారితీస్తుంది కూడా.
- అధికంగా తీసుకున్నవారికి మలబద్దకం, పొట్ట ఉబ్బరం వంటి సమస్యలు ఎదురవ్వుతాయి.
- బాదంపప్పులో పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. అధిక పీచు పదార్థం కూడా హానికరమే. దీనికి తగ్గటు అధికంగా నీరు తీసుకోకపోతే అజీర్తికి గురయ్యే ప్రమాదం లేకపోలేదు.
- కొన్ని బాదంపప్పులో విటమిన్ ఈ అధికంగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా తీసుకుంటే అతిసారం, బలహీనత, అస్పష్టమైన దృష్టి లోపం వంటి సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది.
- బాదంపప్పులు ఎక్కువ తిన్నవారికి శరీరంలో కాల్షియం ఆక్సలేట్లు ఎక్కువయ్యి మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. బాదంపప్పులో ఆక్సలేట్లు పుష్కలంగా ఉంటాయి. అవి అంత ఈజీగా శరీరంలో శోషించబడవు.
(చదవండి: సూసైడ్ హెడేక్! నరకాన్ని తలిపించేంత భయానక 'తలనొప్పి'! తట్టుకోవడం ఎవరీ తరం కాదు!)
Comments
Please login to add a commentAdd a comment