ఈ మధ్యకాలంలో తృణ ధాన్యాలు, నట్స్ , డ్రైఫ్రూట్స్ వినియోగం బాగా పెరిగింది. ఒకపుడు ఖరీదైనవి మనకెందుకులే అని వదిలేసిన సామాన్యులు కూడా వాటిపై అవగాహన పెంచుకుంటున్నారు. పోషకాహారం లేక వ్యాధుల బారినపడే కంటే ముందే జాగ్రత్త పడాలని భావిస్తున్నారు. అలాంటి వాటిలో ఒకటి బాదాం. మరి బాదం పప్పులను ఎలా తీసుకుంటే మంచిది? నానబెట్టి తినడం వల్లే అదనపు ప్రయోజనాలుంటాయా? ఆల్మండ్‌లోని పోషకవిలువలు, ఆరోగ్యకర ప్రయోజనాలు తెలియాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసం..
Health Benefits of Almonds: అద్భుతమైన పోషక విలువలు, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలతో సమృద్ధిగా ఉన్న పప్పు బాదం. బాదం ఒమేగా 3, విటమిన్ ఇ, ప్రొటీన్, పీచుతో నిండి ఉంటుంది. బరువు తగ్గడం నించీ రక్తపోటు అదుపులో ఉంచుకోడం వరకూ, గుండె ఆరోగ్యాన్ని కాపాడడం నించీ కాన్సర్ ముప్పుని తగ్గించడం వరకూ బాదం చేసే మేలు అంతా ఇంతా కాదు. అందుకే సూపర్ ఫుడ్ అని కూడా భావిస్తున్నారు. ఇందులో ఉన్న ప్రొటీన్ ఆకలిని నియంత్రిస్తుంది.దీంతో బరువు తగ్గడం కూడా తేలిక. మెగ్నీషియం వల్ల ఎముకలు బలపడతాయి, ఇంకా మధుమేహం కూడా అదుపులో ఉంటుంది. అంతేకాదు, రక్తపోటు ఉన్నవారికి ఇది చాలా మేలు చేస్తుంది. నానబెట్టిన బాదాం తింటేనే ఎక్కువ ప్రయోజనాలా అంటే మాత్రం అవుననే చెప్పాలి. (మీ గార్డెన్‌లో గులాబీలు విరగ బూయాలంటే?)
ఏదైనా గింజని నానబెట్టి, మొలక వచ్చేలా చేసినపుడు వాటిల్లో కొవ్వు ప్రొటీన్‌గా మారుతుంది. అలాగే బాదం పప్పులు మీద ఉండే తొక్కలో టానిన్ అనే పదార్ధం ఉంటుంది. ఇది పోషకాలను గ్రహించకుండా చేస్తుంది. నాన బెట్టి, పైన తోలు తీసి తినడం వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి. రాత్రి నానబెట్టిన అయిదు లేదా ఆరు బాదం పప్పులను ఉదయాన్నే తింటే మంచిదని ఆహార నిపుణులు చెబుతున్నారు.
నానబెట్టిన బాదంలో ఉండే విటమిన్ కాన్సర్ ముప్పును తగ్గిస్తుంది. నానబెట్టిన బాదంపప్పులో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. అలాగే నానబెట్టిన బాదంనించి లిపేజ్ అనే ఒక ఎంజైమ్ విడుదల అవుతుంది. ఇది అరుగుదలకీ, అనవసరమైన కొవ్వు కరగడానికీ ఉపయోగపడుతుంది. దీంతోపాటు గర్భిణీ స్త్రీలకు అవసరమైన ఫోలిక్ యాసిడ్ నానబెట్టిన బాదంలో సమృద్ధిగా ఉంది. చెడు కొలెస్ట్రాల్‌కి చెక్ చెప్పే బాదం గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. బాదంలో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉంటాయి. వీటిలో ఉండే విటమిన్ ఇ యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేసి ఫ్రీ రాడికల్స్ వల్ల జరిగే నష్టాన్ని తగ్గించి వయసు కనపడనివ్వకుండా చేస్తుంది.
బాదం పప్పులు పోషకాలలోనే కాదు, వంటకాలలో వాడుకోడానికి కూడా పనికొస్తాయి. బాదం ఒమేగా 3, విటమిన్ ఇ లాంటి పోషకాలతో సమృద్ధమైంది. బాదం తిన్నాక నిండుగా అనిపించి తొందరగా ఆకలి వేయదు. పాయసం మీద సన్నని పలుకులుగా చేసి చల్లినా, నూరి కుర్మా లో వాడినా, నానబెట్టి రుబ్బి బాదం పాలు తయారుచేసినా అందరూ ఇష్టపడతారు. బాదంలో అద్భుతమైన పోషక గుణాలు ఉన్నాయి. ఈ లాభాలన్నిటినీ పొందాలంటే వాటిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం అవసరం. ఇలా చేయడం వల్ల ఆరోగ్యకరమైన జీవితం మన సొంతం అవుతుందని డైటీషియన్స్ చెబుతున్నారు.
బాదం టీ ప్రయోజనాలు
బాదం పప్పులు అధిక పోషకాహారాన్ని అందిస్తాయి. వీటిలో యాంటీఆక్సిడెంట్లు, ఉంటాయి. బాదంలో ప్రోటీన్, ఫైబర్, విటమిన్ ఇ, కాల్షియం, జింక్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇది కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని సరిగ్గా ఉంచుతుంది. ఉన్నవారికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. మెగ్నీషియం సరైన మొత్తంలో తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఇది గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బాదంపప్పును అనేక రకాలుగా తినవచ్చు. బాదం టీని కూడా తయారు చేసుకోవచ్చు. ఇది రుచికరమైనది మాత్రమే కాదు చాలా ఆరోగ్యకరమైనది కూడా.
దీర్ఘకాలిక వ్యాధులను నివారించడం, మంటను తగ్గించడం, వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదింపజేయడం వంటి సామర్థ్యాలు బాదం టీ సొంతం. ఫైటోస్టెరాల్స్ లాంటి అనేక యాంటీఆక్సిడెంట్లు, అలాగే విటమిన్ ఇ చర్మంలోని ఫ్రీ రాడికల్స్ ప్రభావాలను తగ్గింస్తుంది. బాదం టీ మూత్రపిండాల ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో సహాయపడుతుంది. ఇది జీవక్రియను వేగవంతం చేయడంలో కూడా సహాయపడుతుంది. యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి రక్షిస్తాయి. ఇది ఆక్సీకరణ ఒత్తిడి, గుండె జబ్బులు, ఆర్థరైటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment