మేం నల్లధనాన్ని సర్దుకోలేదు
మేం నల్లధనాన్ని సర్దుకోలేదు
Published Wed, Nov 9 2016 11:57 PM | Last Updated on Mon, Aug 27 2018 8:44 PM
మంత్రి యనమల
అంగర (కపిలేశ్వరపురం) : టీడీపీ, బీజేపీ తమ నల్లధనాన్ని సర్దుకున్నాకా నోట్లు రద్దు నిర్ణయాన్ని ప్రకటించారంటూ కమ్యూనిస్టు పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. మండలంలోని పడమర ఖండ్రిక, అంగర గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో రాష్ట్ర హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఆర్థిక శాఖామంత్రి యనమల రామకృష్ణుడు బుధవారం పాల్గొన్నారు. రూ.500, రూ.వెయ్యి నోట్లు రద్దు చేయడం ద్వారా నల్లధనం వెలికితీయోచ్చని యనమల అన్నారు. పడమర ఖండ్రికలో పంచాయతీ భవనం, అంగరలోని పోలీస్ స్టేషన్ భవనం, వాటర్ ఓవర్ హెడ్ ట్యాంక్‌లను మంత్రులు ప్రారంభించారు. ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, ఎమ్మెల్సీ వీవీవీ చౌదరి, జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, ఎంపీపీ కాదా వెంకట రాంబాబు, జెడ్పీటీసీ జుత్తుక సూర్యావతి, జేసీ సత్యనారాయణ, ఆర్డీఒ సుబ్బారావు, పువ్వల చిట్టిబాబు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, డీఎస్పీ మురళీకృష్ణ, ఎస్‌సై వాసా పెద్దిరాజు పాల్గొన్నారు.
Advertisement
Advertisement