బ్లాక్మనీపై మాసివ్ గూగ్లీ...సిక్సర్ | Modi acknowledges tweets on black money ‘googly' | Sakshi
Sakshi News home page

బ్లాక్మనీపై మాసివ్ గూగ్లీ...సిక్సర్

Published Wed, Nov 9 2016 1:45 PM | Last Updated on Sat, Aug 25 2018 6:31 PM

బ్లాక్మనీపై మాసివ్ గూగ్లీ...సిక్సర్ - Sakshi

బ్లాక్మనీపై మాసివ్ గూగ్లీ...సిక్సర్

న్యూఢిల్లీ: ‘ఆపరేషన్ బ్లాక్మనీ’ లో భాగంగా దేశంలో రూ.500, రూ.1000 నోట్లను రాత్రికి రాత్రి బ్యాన్  చేస్తున్నట్టు   ప్రకటించిన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ప్రశంసల వర్షం కురుస్తోంది.   వివిధ రంగాల ప్రముఖులు సోషల్ మీడియాలో తమ స్పందనను తెలియచేస్తున్నారు.  ఈ నేపథ్యంలో తన  నిర్ణయాన్ని ఆమోదించిన ప్రతీ ఒక్కరికీ  ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు  తెలిపారు.  దేశంలోని నిజాయితీపరులైన పౌరులకోసం ఈ నిర్ణయం తీసుకున్నామని..బెటర్ ఇండియా సాధించడమే లక్ష్యమన్నారు.  దేశాన్ని అవినీతినుంచి విముక్తురాలిని చేయడంకోసం అందరం భుజం భుజం కలుపుదామని ప్రధాని పిలుపునిచ్చారు. అవినీతి, నల్లధనం , తీవ్రవాదంపై పోరాడటానికి ఇదొక చారిత్రక అడుగు అని   నమో పేర్కొన్నారు.

భారత ప్రధాని నరేంద్ర మోదీ సర్జికల్ స్ట్రైక్స్ పై బాలీవుడ్, టాలీవుడ్, క్రికెట్ ఇలా  అన్ని రంగాల ప్రముఖులు ట్విట్టర్ ద్వారా తమ సంతోషాన్ని వ్యక్తం  చేశారు. ఈ క్రమంలో  భారత  ‍క్రికెట్ మాజీ కెప్టెన్  అనిల్ కుంబ్లే  ఇది మాసివ్ గూగ్లీ ,వెల్డన్  సర్, ‍ ప్రౌడ్ ఆఫ్  యూ సర్ అంటూ ట్వీట్ చేశాడు. అంతేకాదు కుంబ్లేకు తోడు దూస్రా స్పెషలిస్ట్ హర్భజన్ సింగ్ కూడా తనదైన క్రికెట్ భాషలో చెలరేగిపోయాడు.   ప్రధాని బ్రహ్మాండమైన సిక్సర్ కొట్టారంటూ  ట్వీట్ చేశాడు.

ఇదంతా ఒక ఎత్తయితే  వీరందరికి ప్రధాని మెదీ  సమాధానం ఇవ్వడం మరోఎత్తు.  తమ బౌలింగ్ ద్వారా ఎంతో మంది బ్యాట్స్ మెన్లకు షాకిచ్చిన  ప్రముఖ  భారత క్రికెటర్లు స్పందన అంటూ రీట్వీట్ చేశారు.  దీంతోపాటు  టాలీవుడ్  హీరో నాగార్జున, మూవీ సూపర్ స్టార్లు రజనీకాంత్, కమల్ హాసన్, అజయ్ దేవగన్,  రితేశ్ దేశ్ ముఖ్,  సుభాష్ ఘాయ్‌,  సిద్ధార్థ్ మల్హోత్రా తదితరుల  ట్వీట్లను రీట్వీట్ చేయడం విశేషం.

Thank you. All of us have to work shoulder to shoulder and create a prosperous, inclusive and corruption free India. https://t.co/3rurQwFYja

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement