చిన్నచూపు చూస్తే కనువిప్పు తప్పదు!
చిన్నచూపు చూస్తే కనువిప్పు తప్పదు!
Published Tue, Dec 3 2013 12:46 PM | Last Updated on Sat, Sep 2 2017 1:13 AM
శారీరక, మానసిక వైక ల్యాన్ని ఎవరూ కూడా కోరుకోరు. పుట్టుక ద్వారా అవిటితనం కొందర్ని వెంటాడితే, విధి వక్రించడం కారణంగా మరికొందరు ఆ బారిన పడుతారు. ఇందులో ఎవర్ని తప్పు పట్టక్కర్లేదు. భగవంతుడు రాసిన విధి రాత అని తమకు తాము సంతృప్తి పడటమే తప్ప.. విచారించి ప్రయోజనం లేదు అనే ఓ ధైర్యాన్ని కూడగట్టుకుని తనకు ఇష్టాలకు అనుగుణంగా..,సహ జంగా సక్రమించే వ్యక్తిగత నైపుణ్యంతో ఆకట్టుకున్నవారేందరూ మానవ ప్రపంచంలో ఎదురుపడుతుంటారు. వారిని స్పూర్తిగా తీసుకుని కొందరు భారతీయ సినీ ప్రపంచంలో అనుభూతికి లోనయ్యే చిత్రాలను అందిస్తే.. మరికొందరు వైకల్యాన్ని పాయింట్‌గా చేసుకుని అవహేళన చేసిన వారున్నారు.
దృశ్య మాధ్యమంలో సినిమా చాలా శక్తివంతమైంది. ప్రభావవంతమైంది అనడంలో సందేహం అక్కర్లేదు. భారతీయ సినీ ప్రపంచాన్ని కళాత్మకం, వాణిజ్యం హద్దులతో సినిమా ప్రస్తానం సాగుతుండగా.. వాటన్నింటిని చెరిపేసి.. మానసిక, శారీరక వైకల్యంతో బాధపడేవారిలోనూ అద్బుతమైన నైపుణ్యం, ప్రపంచానికి స్పూర్తినిచ్చే అంశాలుంటాయని పసిగట్టిన కొందరు దర్శకులు..తమ చిత్రాలను నిర్మించి ప్రేక్షకులను అబ్బురపరిచారు. కొన్ని కళాత్మకంగా రూపొందింతే, మరికొన్ని వాణిజ్య అంశాలను అధారంగా చేసుకుని హృదయాన్ని తడిమి.. ప్రేక్షకుడ్ని ఓ అద్బుతమైన అనుభూతికి లోను చేశాయి. వాటిలో సిరిసిరిమువ్వ, సిరివెన్నెల, పదహారేళ్ల వయస్సు లాంటి తెలుగు చిత్రాలు ఆక ట్టుకోగా, బాలీవుడ్‌లో తారే జమీన్ పర్, బ్లాక్, బర్ఫీ చిత్రాలు వికలాంగుల్లో కూడా అద్బుతమైన టాలెంట్ ఉంటుందనే భావనను కలిగించాయి. వికలాంగులు సామాన్య మానవుల కంటే తక్కువేమి కాదు అని వారంటే చిన్నచూపు చూసే కొందరికి కనువిప్పును కలిగించాయి.
సినిమా మాధ్యమం ద్వారా ఓ అద్బుతమైన భావనను కలిగించిన చిత్రాలను ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా ఓ సారి నెమరువేసుకుందాం.
సిరిసిరిమువ్వ(1978)
సవతి తల్లి వేధింపులకు గురయ్యే మూగ అమ్మాయి హైమాను శారీరకంగా అవిటివాడైన సాంబయ్య అనే వ్యక్తి చేర దీస్తాడు. హైమా అంటే సాంబయ్యకు అభిమానం, తన చేరదీసి ప్రయోజకురాలిగా చేసిన సాంబయ్యపై హైమకు ప్రేమ. ఇలాంటి కథతో తెరకెక్కిన సిరిసిరిమువ్వ చిత్రానికి అప్పట్లో ప్రేక్షకులు నీరాజనం పట్టారు.
సిరివెన్నెల (1986)
అంధుడైన ఓ ఫ్లూటిస్ట్ హరిప్రసాద్ (సర్వదమన్ బెనర్జీ)కి, మూగ పెయింటర్ సుభాషిణి (సుహాసిని)కు, జ్యోతిర్మయి (మున్ మూన్ సేన్) మధ్య జరిగిన ప్రేమకథను సిరిసిరిమువ్వగా ప్రముఖ దర్శకుడు కే విశ్వనాథ్ తెరెక్కించారు. హరిప్రసాద్ లో ఉన్న టాలెంట్ ను గుర్తించి జ్యోతిర్మయి ప్రోత్సాహానందిస్తుంది. ప్రోత్సాహం ఉంటే రాణిస్తారు అని హరిప్రసాద్ పాత్ర ద్వారా దర్శకుడు తెలియచెప్పాడు. ప్రకృతిని అంధుడైన ఓ సంగీత కారుడు ఎలా ఆస్వాదిస్తాడు. మూగ యువతి ఓ అంధుడికి తన భావాల్ని ఎలా వ్యక్త పరిచిందనే అంశాలతో సృజనాత్మక శైలిలో రూపొందించిన ‘సిరిసిరిమువ్వ’ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా గొప్ప విజయం సాధించింది.
బ్లాక్(2005)
మిచెల్లీ మ్యాక్‌నాలీ(రాణిముఖర్జీ) రెండేళ్ల వయస్సులోనే అనారోగ్యానికి గురవ్వడంతో అంధత్వం, చెవుడు వస్తుంది. తల్లితండ్రుల ప్రేమకు దూరమైన సమయంలో ఉపాధ్యాయుడు దేబరాజ్ సహాయ్ (అమితాబ్) చేర దీస్తాడు. ఉపాధ్యాయుడు అల్జీమర్స్ వ్యాధికి గురవుతాడు. వీరిమధ్య చోటు చేసుకుంటున్న సంఘటనలు ప్రేక్షుకుడిని ఉద్వేగాని గురి చేయడమే కాకుండా.. కంటతడి పెట్టించి.. ఓ అద్భుతమై ఫీలింగ్ గురయ్యేలా చిత్రాన్ని సంజయ్ లీలా భన్సాలీ నిర్మించారు. వైకల్యం అనేది శారీరానికే.. మనసుకు కాదు అనే గొప్ప పాయింట్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
తారే జమీన్ పర్ (2007)
డిస్‌లేక్సియా అనే వ్యాధితో బాధపడుతున్న నంద కిశోర్ అవస్థి (ద ర్శిల్ సఫారీ)ని కన్నవారే ఆదరించ కపోగా, ఇంట్లో సమస్యలు సృష్టిస్తున్నారనే కారణంతో బోర్డింగ్ స్కూల్లో చేర్చుతాడు. మానసికంగా ఎదుగుదల లేకున్నా.. నందకిశోర్ లో మామూలుగా ఉండే పిల్లలకంటే ఎక్కువ నైపుణ్యం, టాలెంట్ ఉందని గ్రహించిన ఉపాధ్యాయుడు రామ్ శంకర్ నిఖంబ్(అమీర్ ఖాన్) పోత్స్రాహాన్ని అందిస్తాడు. టీచర్ ప్రోత్సాహంతో నంద కిశోర్ పాఠశాలలో ఉత్తమ పెయింటర్‌గా ఎంపికవుతాడు.
బర్ఫీ (2012)
బుద్దిమాంద్యంతో బాధపడే జిల్‌మిల్ చటర్జీ(ప్రియాంక చోప్రా), జాన్సన్(రణబీర్ కపూర్) మూగ, చెవిటితో బాధపడే యువకుడు, శృతి ఘోష్(ఇలియానా)కు మధ్య జరిగిన ప్రేమకథగా బర్ఫీ రూపొందింది. వీరిద్దరీ మధ్య జరిగిన కథను ఆకట్టుకునే విధంగా రొమాంటిక్, కామెడీ, డ్రామాలను మేలివించి.. ఓ అందమైన ప్రేమకథగా తెరకెకించారు అనురాగ్ బసు. ప్రేమానురాగాలు పంచితే మానసికంగా సంపూర్ణ వ్యక్తులుగా ఎదుగుతారనేది ఈ చిత్రంలో ప్రధాన అంశం.
పైన తెలిపిన చిత్రాల్లో హైమా, సాంబయ్య, హరిప్రసాద్, సుభాషిణి, నంద కిశోర్, మిచెల్లీ, జిల్‌మిల్, జాన్సన్, దేబ్‌రాజ్ సహాయ్ లాంటి పాత్రలు సమాజంలో మనకు కనిపించడం సహజం. శారీరక, మానసిక వైకల్యంతో బాధపడే వారిలో స్కిల్స్, టాలెంట్‌లు పుష్కలంగా ఉంటాయని దర్శకులు తమ కోణంలో చూపించారు. శారీరక, మానసిక వైకల్యంతో బాధపడే వ్యక్తులకు ప్రోత్సాహం అందించాలనే ఉద్దేశ్యాన్ని అంతర్లీనంగా ప్రేక్షకులకు తెలియ చెబుతూనే సమాజం పట్ల వారి భాద్యతను చెప్పారు దర్శకులు. . సమాజంలో ఎదో ఒక వైకల్యంతో బాధపడేవారిని చేర దీసి పోత్రాహాన్ని అందిస్తే.. వాళ్లు రాణిస్తారు అని మనవంతు ఓ బాధ్యత గా ఫీలవుదాం.
Advertisement
Advertisement