ఆకులు సర్వసాధారణంగా ఆకుపచ్చగా ఉంటాయి. అరుదుగా కొన్ని మొక్కల ఆకులు ఎరుపు, పసుపు, నీలం, ఊదా వంటి రంగుల్లోను, రంగు రంగుల మచ్చల్లోను ఉంటాయి. మసిపూసినంత నల్లని ఆకులు ఉండే మొక్క ఇది. ఈ ఆకులు చిన్నవేమీ కాదు, ఏకంగా ఏనుగు చెవులంత పరిమాణంలో ఉంటాయి.
అత్యంత అరుదైన ఈ మొక్కను ‘బ్లాక్ మేజిక్’ అని పిలుచుకుంటారు. దీని శాస్త్రీయనామం ‘కోలోకాసియా ఎస్కలెంటా’. చేమదుంపల జాతికి చెందిన ఈ మొక్క ఆకులు ముదురు ఊదా, ముదురాకుపచ్చ రంగుల్లో కూడా ఉంటాయి. నల్లని ఆకులు వచ్చేలా జన్యుమార్పిడి చేసి వీటిని ప్రత్యేకంగా పెంచుతున్నారు. వీటిని తోటల్లో అలంకరణ కోసం పెంచుకోవడం యూరోపియన్ దేశాల్లో ఫ్యాషన్‌గా మారింది. ‘హాలోవీన్’ వేడుకల్లో ఈ మొక్కలను అలంకరణ కోసం వాడుతుంటారు.
(చదవండి: మెరిసే పుట్టగొడుగులు..! తింటే.. అంతే..!)
Comments
Please login to add a commentAdd a comment