శ్వేతజాతి పాలన అంతమైన 30 ఏళ్ల తర్వాతా ఇంటి యాజమాన్యం ఇంకా పురుషుల చేతిలోనే
నిరాశ్రయులుగా మిగులుతున్న ఒంటరి మహిళలు, వారి పిల్లలు
మహిళలకు ఇంటిపై హక్కు ఇవ్వని చట్టాలు.. దశాబ్దాలుగా పోరాటం చేస్తున్న మహిళలు
వర్ణవివక్షపై పోరాడిన దక్షిణాఫ్రికా నేలపై.. లింగ వివక్ష ఇంకా వేళ్లూనుకుని ఉంది. శ్వేతజాతి పాలన అంతమైన 30 ఏళ్ల తరువాత కూడా మహిళలకు సర్వ హక్కులు రాలేదు. జాతి రక్షణ కోసం చేసిన భూ చట్టం నల్లజాతి మహిళలకు మాత్రం అభద్రతను మిగులుస్తోంది. భర్త చనిపోయిన భార్యలు, తండ్రిని కోల్పోయిన పిల్లలు తమ సొంత ఇంటినుంచే గెంటివేతకు గురవుతున్నారు. నిరాశ్రయులుగా మారుతున్నారు. దక్షిణాఫ్రికా పట్టణాల్లోని టౌన్‌షిప్‌లలో లక్షలాది నల్లజాతి కుటుంబాలు ఇదే అభద్రతలో జీవిస్తున్నాయి.
శాశ్వతమైన వివక్ష..
జొహన్నెస్‌బర్గ్‌లోని 74 ఏళ్ల వృద్ధురాలు జొహనా మోత్లమ్మ. 1977లో ఆమెకు 27 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుంది. సొవెటోలో ఒక చిన్న ఇంటికి మారారు. 1991లో విడాకులు తీసుకునే వరకు ఇక్కడి టౌన్íÙప్‌లోని ఇంట్లో నివసించారు. 2000 సంవత్సరంలో ఆమె మాజీ భర్త ఆ ఇంటిని రిజిస్టర్ చేసినప్పుడు, పూర్తి యాజమాన్యం అతనికే వెళ్లింది. మూడేళ్ళ తర్వాత అతను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇంటి యాజమాన్య హక్కుల గురించి అతడిని ఆమె ఎప్పుడూ అడగలేదు. 2013లో అతను చనిపోయిన తర్వాత అంతా మారిపోయింది. అతని రెండో భార్య ఆ ఇంటిని అమ్మేసింది. ఎందుకంటే ఇంటిలో మోత్లమ్మకు 50 శాతం హక్కున్నా... అప్‌గ్రేడ్ అయిన చట్టం విడాకుల తరువాత ఆమెకు ఆస్తి హక్కును అనుమతించలేదు. ఆస్తికి ఆమె కూడా యజమానిగా భర్త రికార్డుల్లో పేర్కొనలేదు. దీంతో ఇంటి అమ్మకాన్ని ఆమె ఆపలేకపోయింది. అప్‌గ్రేడింగ్ చట్టం మహిళల పట్ల వివక్షను శాశ్వతం చేసింది.
కోర్టుల చుట్టూ తిరిగి, విసిగి..
39 తొమ్మిదేళ్ల లెబో బలోయి కూడా దశాబ్దం కిందట తన ఇంటిని కోల్పోయింది. సోవెటోలో ప్రభుత్వం జారీ చేసిన రెండు పడక గదుల ఇల్లు ఆమె తండ్రి పేరు మీద రిజిస్టర్ అయి ఉంది. ఆ తరువాత తనకు, తన తల్లికి ఆ ఇంటి వారసత్వం వస్తుందని బలోయి ఆశించింది. అందుకే ఆమె, ఆమె భర్త పాల్ కలిసి ఇంటిని పునరుద్ధరించారు. ఇంటికి మరో రెండు గదులు అదనంగా కట్టారు. 2009లో ఆమె తల్లి చనిపోయిన తరువాత ఆ ఇంటిపై హక్కు తన సవతి తల్లి కూతురుకు వెళ్లిపోయింది. చట్టబద్ధంగా ఆ ఆస్తి ఎవరికి దక్కుతుందనే దానిపై స్పష్టత లేదు. కోర్టుకు తిరిగి తిరిగి విసిగిపోయిన ఆమె.. తన సవతి సోదరితో పోరాడటానికి బదులుగా విడిచిపెట్టాలని నిర్ణయించుకుంది. ఇప్పుడు 20 కిలోమీటర్ల (12 మైళ్ళు) దూరంలోని జొహన్నెస్‌బర్గ్ శివారు మెలి్వల్లేలో నివసిస్తోంది.
మోత్లమ్మ, బలోయిలే కాదు.. సొవెటోలో లక్షలాది మంది ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇంటి గురించి కుటుంబ సభ్యులు గొడవపడానికి ఈ వ్యవస్థ కారణమైందని వారు వాపోతున్నారు. 1994లో ప్రభుత్వం భూమి హక్కుల పునరుద్ధరణ చట్టం–1994 ప్రవేశపెట్టింది. 1991 యొక్క భూ కాలపరిమితి హక్కుల చట్టంలోని నల్లజాతి దీర్ఘకాలిక లీజుదారుల ఆస్తి హక్కులను అప్ గ్రేడ్ చేసింది. చివరికి వారి ఇళ్లను సొంతం చేసుకోవడానికి అనుమతించింది. కానీ ఇందులో ఒక చిక్కుముడి ఉంది. చట్ట నిబంధనల ప్రకారం, కుటుంబ పెద్దగా పరిగణించబడే వ్యక్తి మాత్రమే ఆస్తిపై హక్కును కలిగి ఉంటాడు. అతను బతికున్న కాలంలో విల్లు రాస్తే ఆ జాబితాలో ఉన్నవారికి చెందుతుంది. పితృస్వామ్య సంప్రదాయ వారసత్వ నిబంధనల్లో పాతుకుపోయిన ఈ కొత్త చట్టం భార్యలు, సోదరీమణులు, తల్లులు, కూతుళ్లను వారసత్వానికి దూరం చేస్తోంది.
సవరణలకు సుప్రీం ఆదేశం...
ఇది మహిళలను చట్టానికి దూరంగా ఉంచడమేనని 2018లో దక్షిణాఫ్రికా సుప్రీంకోర్టు పేర్కొంది. టౌన్íÙప్‌లో మహిళల భూ హక్కులకు సంబంధించిన ప్రత్యేక కేసుపై తీర్పు సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. లింగ, ఆస్తి వారసత్వానికి సంబంధించిన అప్ గ్రేడింగ్ చట్టంలోని సెక్షన్ 2(1) రాజ్యాంగపరంగా చెల్లదని కూడా సుప్రీంకోర్టు ప్రకటించింది. ఇది మహిళల హక్కుల ఉల్లంఘన అని పేర్కొంటూ చట్టానికి సవరణలు చేయాలని ఆదేశించింది. ప్రాపర్టీ పర్మిట్ లేదా టైటిల్ డీడ్‌లో పేర్లు లేకపోయినా బాధిత మహిళలు లేదా ఇప్పటికే ఒక ఇంట్లో నివసిస్తున్న వ్యక్తులు అందుకు సంబంధించిన డాక్యుమెంట్లు సమరి్పస్తే హక్కులు వర్తింపజేయాలని సుప్రీంకోర్టు పార్లమెంటును ఆదేశించింది. ఫలితంగా ఈ ఏడాది మేలో దక్షిణాఫ్రికా సార్వత్రిక ఎన్నికలకు ముందు, ప్రభుత్వం భూమి హక్కుల సవరణ చట్టం–2021ను గెజిట్ చేసింది. ఇది ఎన్నికలు ముగిసిన వారం తర్వాత అమల్లోకి వచి్చంది. దీంతో ఇళ్లు కోల్పోయిన ప్రజలు ఇప్పటికీ న్యాయం కోసం ఎదురుచూస్తున్నారు.
‘’నాట్ ఫర్ సేల్’...
దీంతో ఇళ్ల సమస్యలతో సతమతమవుతున్న ప్రజలతో జొహన్నెస్‌బర్గ్‌లోని స్వచ్ఛంద సంస్థలు కిటకిటలాడుతున్నాయి. ఈ వివాదాలు సర్వసాధారణమయ్యాయని, మహిళలు కోర్టు ల్లో దీర్ఘకాలికంగా పోరాడుతున్నారని విట్‌వాటర్స్ ర్యాండ్ విశ్వవిద్యాలయంలోని స్కూల్ ఆఫ్ హ్యూమన్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ డీన్ బుసిసివే ఎన్కాలా డ్లామిని చెప్పారు. ఇలాంటి చట్టం ఒకటుందని, జీవితకాలం వారు నివసించిన ఇంటిపై హక్కు లేదని... సడన్‌గా ఇల్లు ఖాళీ చేయాల్సి వచి్చనప్పుడే మహిళలకు తెలుస్తోందని హక్కుల సంఘాలు వాపోతున్నాయి. ఈ చట్టం వల్ల మహిళలు, పిల్లలు తమ జీవితకాల భద్రతను కోల్పోయే ప్రమాదం ఉందని, నిరాశ్రయులయ్యే ప్రమాదం ఉందని ‘ఎ జెండర్డ్ అనాలిసిస్ ఆఫ్ ఫ్యామిలీ హోమ్స్ ఇన్ సౌత్ ఆఫ్రికా’ అధ్యయనం వెల్లడించింది. పట్టాల సమస్యల కారణంగా ‘నాట్ ఫర్ సేల్’ అని రాసిన ఇళ్లు సోవెటోలో అనేకం కనిపిస్తాయి.
’మాకు మా చిన్ననాటి ఇల్లు కావాలి’
చర్చలతో ప్రభుత్వం, కోర్టులు చేస్తున్న జాప్యానికి ఇళ్లు కోల్పోయిన కుటుంబాలు అసహనానికి గురవుతున్నాయి. తమ ఇంటిపై యాజమాన్యం విషయాన్ని వీలైనంత త్వరగా పరిష్కరించాలని మోత్లమ్మ కొడుకు మైమానే కోర్టును కోరుతున్నాడు. ‘మా నాన్నకు అన్ని అనుమతులు ఇచ్చి, మా అమ్మను మినహాయించిన ఈ వ్యవస్థ సరైంది కాదు’ అంటున్నాడు. ఇద్దరికీ సమానహక్కులుంటే ఈ సమస్య ఉండేది కాదని, తమ చిన్ననాటి ఇంటిని తిరిగి పొందాలనుకుంటున్నామని చెబుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment