apartheid
-
వర్ణ వివక్షపై పోరాడిన నేలలో లింగ వివక్ష..!
వర్ణవివక్షపై పోరాడిన దక్షిణాఫ్రికా నేలపై.. లింగ వివక్ష ఇంకా వేళ్లూనుకుని ఉంది. శ్వేతజాతి పాలన అంతమైన 30 ఏళ్ల తరువాత కూడా మహిళలకు సర్వ హక్కులు రాలేదు. జాతి రక్షణ కోసం చేసిన భూ చట్టం నల్లజాతి మహిళలకు మాత్రం అభద్రతను మిగులుస్తోంది. భర్త చనిపోయిన భార్యలు, తండ్రిని కోల్పోయిన పిల్లలు తమ సొంత ఇంటినుంచే గెంటివేతకు గురవుతున్నారు. నిరాశ్రయులుగా మారుతున్నారు. దక్షిణాఫ్రికా పట్టణాల్లోని టౌన్‌షిప్‌లలో లక్షలాది నల్లజాతి కుటుంబాలు ఇదే అభద్రతలో జీవిస్తున్నాయి. శాశ్వతమైన వివక్ష.. జొహన్నెస్‌బర్గ్‌లోని 74 ఏళ్ల వృద్ధురాలు జొహనా మోత్లమ్మ. 1977లో ఆమెకు 27 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుంది. సొవెటోలో ఒక చిన్న ఇంటికి మారారు. 1991లో విడాకులు తీసుకునే వరకు ఇక్కడి టౌన్íÙప్లోని ఇంట్లో నివసించారు. 2000 సంవత్సరంలో ఆమె మాజీ భర్త ఆ ఇంటిని రిజిస్టర్ చేసినప్పుడు, పూర్తి యాజమాన్యం అతనికే వెళ్లింది. మూడేళ్ళ తర్వాత అతను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇంటి యాజమాన్య హక్కుల గురించి అతడిని ఆమె ఎప్పుడూ అడగలేదు. 2013లో అతను చనిపోయిన తర్వాత అంతా మారిపోయింది. అతని రెండో భార్య ఆ ఇంటిని అమ్మేసింది. ఎందుకంటే ఇంటిలో మోత్లమ్మకు 50 శాతం హక్కున్నా... అప్‌గ్రేడ్ అయిన చట్టం విడాకుల తరువాత ఆమెకు ఆస్తి హక్కును అనుమతించలేదు. ఆస్తికి ఆమె కూడా యజమానిగా భర్త రికార్డుల్లో పేర్కొనలేదు. దీంతో ఇంటి అమ్మకాన్ని ఆమె ఆపలేకపోయింది. అప్‌గ్రేడింగ్ చట్టం మహిళల పట్ల వివక్షను శాశ్వతం చేసింది. కోర్టుల చుట్టూ తిరిగి, విసిగి.. 39 తొమ్మిదేళ్ల లెబో బలోయి కూడా దశాబ్దం కిందట తన ఇంటిని కోల్పోయింది. సోవెటోలో ప్రభుత్వం జారీ చేసిన రెండు పడక గదుల ఇల్లు ఆమె తండ్రి పేరు మీద రిజిస్టర్ అయి ఉంది. ఆ తరువాత తనకు, తన తల్లికి ఆ ఇంటి వారసత్వం వస్తుందని బలోయి ఆశించింది. అందుకే ఆమె, ఆమె భర్త పాల్ కలిసి ఇంటిని పునరుద్ధరించారు. ఇంటికి మరో రెండు గదులు అదనంగా కట్టారు. 2009లో ఆమె తల్లి చనిపోయిన తరువాత ఆ ఇంటిపై హక్కు తన సవతి తల్లి కూతురుకు వెళ్లిపోయింది. చట్టబద్ధంగా ఆ ఆస్తి ఎవరికి దక్కుతుందనే దానిపై స్పష్టత లేదు. కోర్టుకు తిరిగి తిరిగి విసిగిపోయిన ఆమె.. తన సవతి సోదరితో పోరాడటానికి బదులుగా విడిచిపెట్టాలని నిర్ణయించుకుంది. ఇప్పుడు 20 కిలోమీటర్ల (12 మైళ్ళు) దూరంలోని జొహన్నెస్‌బర్గ్ శివారు మెలి్వల్లేలో నివసిస్తోంది.మోత్లమ్మ, బలోయిలే కాదు.. సొవెటోలో లక్షలాది మంది ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇంటి గురించి కుటుంబ సభ్యులు గొడవపడానికి ఈ వ్యవస్థ కారణమైందని వారు వాపోతున్నారు. 1994లో ప్రభుత్వం భూమి హక్కుల పునరుద్ధరణ చట్టం–1994 ప్రవేశపెట్టింది. 1991 యొక్క భూ కాలపరిమితి హక్కుల చట్టంలోని నల్లజాతి దీర్ఘకాలిక లీజుదారుల ఆస్తి హక్కులను అప్ గ్రేడ్ చేసింది. చివరికి వారి ఇళ్లను సొంతం చేసుకోవడానికి అనుమతించింది. కానీ ఇందులో ఒక చిక్కుముడి ఉంది. చట్ట నిబంధనల ప్రకారం, కుటుంబ పెద్దగా పరిగణించబడే వ్యక్తి మాత్రమే ఆస్తిపై హక్కును కలిగి ఉంటాడు. అతను బతికున్న కాలంలో విల్లు రాస్తే ఆ జాబితాలో ఉన్నవారికి చెందుతుంది. పితృస్వామ్య సంప్రదాయ వారసత్వ నిబంధనల్లో పాతుకుపోయిన ఈ కొత్త చట్టం భార్యలు, సోదరీమణులు, తల్లులు, కూతుళ్లను వారసత్వానికి దూరం చేస్తోంది. సవరణలకు సుప్రీం ఆదేశం... ఇది మహిళలను చట్టానికి దూరంగా ఉంచడమేనని 2018లో దక్షిణాఫ్రికా సుప్రీంకోర్టు పేర్కొంది. టౌన్íÙప్లో మహిళల భూ హక్కులకు సంబంధించిన ప్రత్యేక కేసుపై తీర్పు సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. లింగ, ఆస్తి వారసత్వానికి సంబంధించిన అప్ గ్రేడింగ్ చట్టంలోని సెక్షన్ 2(1) రాజ్యాంగపరంగా చెల్లదని కూడా సుప్రీంకోర్టు ప్రకటించింది. ఇది మహిళల హక్కుల ఉల్లంఘన అని పేర్కొంటూ చట్టానికి సవరణలు చేయాలని ఆదేశించింది. ప్రాపర్టీ పర్మిట్ లేదా టైటిల్ డీడ్‌లో పేర్లు లేకపోయినా బాధిత మహిళలు లేదా ఇప్పటికే ఒక ఇంట్లో నివసిస్తున్న వ్యక్తులు అందుకు సంబంధించిన డాక్యుమెంట్లు సమరి్పస్తే హక్కులు వర్తింపజేయాలని సుప్రీంకోర్టు పార్లమెంటును ఆదేశించింది. ఫలితంగా ఈ ఏడాది మేలో దక్షిణాఫ్రికా సార్వత్రిక ఎన్నికలకు ముందు, ప్రభుత్వం భూమి హక్కుల సవరణ చట్టం–2021ను గెజిట్ చేసింది. ఇది ఎన్నికలు ముగిసిన వారం తర్వాత అమల్లోకి వచి్చంది. దీంతో ఇళ్లు కోల్పోయిన ప్రజలు ఇప్పటికీ న్యాయం కోసం ఎదురుచూస్తున్నారు. ‘’నాట్ ఫర్ సేల్’... దీంతో ఇళ్ల సమస్యలతో సతమతమవుతున్న ప్రజలతో జొహన్నెస్‌బర్గ్‌లోని స్వచ్ఛంద సంస్థలు కిటకిటలాడుతున్నాయి. ఈ వివాదాలు సర్వసాధారణమయ్యాయని, మహిళలు కోర్టు ల్లో దీర్ఘకాలికంగా పోరాడుతున్నారని విట్‌వాటర్స్ ర్యాండ్ విశ్వవిద్యాలయంలోని స్కూల్ ఆఫ్ హ్యూమన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ డీన్ బుసిసివే ఎన్కాలా డ్లామిని చెప్పారు. ఇలాంటి చట్టం ఒకటుందని, జీవితకాలం వారు నివసించిన ఇంటిపై హక్కు లేదని... సడన్‌గా ఇల్లు ఖాళీ చేయాల్సి వచి్చనప్పుడే మహిళలకు తెలుస్తోందని హక్కుల సంఘాలు వాపోతున్నాయి. ఈ చట్టం వల్ల మహిళలు, పిల్లలు తమ జీవితకాల భద్రతను కోల్పోయే ప్రమాదం ఉందని, నిరాశ్రయులయ్యే ప్రమాదం ఉందని ‘ఎ జెండర్డ్ అనాలిసిస్ ఆఫ్ ఫ్యామిలీ హోమ్స్ ఇన్ సౌత్ ఆఫ్రికా’ అధ్యయనం వెల్లడించింది. పట్టాల సమస్యల కారణంగా ‘నాట్ ఫర్ సేల్’ అని రాసిన ఇళ్లు సోవెటోలో అనేకం కనిపిస్తాయి. ’మాకు మా చిన్ననాటి ఇల్లు కావాలి’ చర్చలతో ప్రభుత్వం, కోర్టులు చేస్తున్న జాప్యానికి ఇళ్లు కోల్పోయిన కుటుంబాలు అసహనానికి గురవుతున్నాయి. తమ ఇంటిపై యాజమాన్యం విషయాన్ని వీలైనంత త్వరగా పరిష్కరించాలని మోత్లమ్మ కొడుకు మైమానే కోర్టును కోరుతున్నాడు. ‘మా నాన్నకు అన్ని అనుమతులు ఇచ్చి, మా అమ్మను మినహాయించిన ఈ వ్యవస్థ సరైంది కాదు’ అంటున్నాడు. ఇద్దరికీ సమానహక్కులుంటే ఈ సమస్య ఉండేది కాదని, తమ చిన్ననాటి ఇంటిని తిరిగి పొందాలనుకుంటున్నామని చెబుతున్నాడు. -
వర్ణ వివక్షపై ‘కరోనా’ పెంచిన విద్వేషం
కంటికి కనిపించని సూక్ష్మక్రిమి విద్వేషాగ్నిని రగిల్చింది కరోనా వైరస్ పరోక్షంగానూ నిండు ప్రాణాలను తీసేస్తోంది ఎవరో జ్వాలని రగిలిస్తే, మరెవరో బలైపోతున్నారు అసలే నల్లజాతీయులన్న వివక్ష, దానికి తోడు వైరస్ నింపిన విద్వేషం వెరసి అగ్రరాజ్యంలో ఆసియన్లపై దాడులు పెరిగిపోతున్నాయ్... ఆసియన్ల పట్ల అక్కసుతో రగిలిపోతున్న అమెరికన్లు నిన్నగాక మొన్న అట్లాంటాలోని ఆసియన్ మసాజ్ పార్లర్లను లక్ష్యంగా చేసుకొని ఎనిమిది మందిని పిట్టల్లా కాల్చిపారేశారు. థాయ్‌లాండ్ నుంచి వచ్చిన శరణార్థిని నడిరోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లి ప్రాణాలు తీశారు. ఒక ఫిలిప్పీన్ వ్యక్తిపై కత్తులతో దాడి చేస్తే , మరో చైనా మహిళకి నిప్పంటించి తగులబెట్టారు. ఇండియానాలో నాలుగు రోజుల కిందట ఓ అగంతకుడు జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది మరణించగా... అందులో నలుగురు సిక్కులు ఉన్నారు. ఇది జాతి వివక్ష దాడా? కాదా? అనేది దర్యాప్తులో తేలనుంది. ఈ మధ్య కాలంలో అమెరికాలో ఎక్కడ చూసినా ఇలాంటి దారుణాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కరోనా వైరస్ బయటపడ్డపుడు అమెరికా అధ్యక్షుడిగా ఉన్న డొనాల్డ్ ట్రంప్ దానిని చైనా వైరస్ అంటూ పదే పదే ప్రస్తావించడంతో ఆసియన్లు అంటేనే అమెరికన్లు మండిపడుతున్నారు. మొదట్నుంచి ఆసియన్లపై జాతి వివక్ష, చులకన భావం ఉండేవి. కరోనా అగ్రరాజ్యాన్ని అతలాకుతలం చేశాక విద్వేషం రెట్టింపైంది. ఆసియన్ అమెరికన్ అయిన కమలా హ్యారిస్ ఉపాధ్యక్షురాలి పదవిని అందుకున్నప్పటికీ ఈ విద్వేషపూరిత దాడులు ఆగడం లేదు. కమలా హ్యారిస్‌ను చంపుతామని బెదిరించినందుకు ఫ్లోరిడాకు చెందిన ఓ 39 ఏళ్ల నర్సును గత శనివారం అరెస్టు చేశారు కూడా. జాతి వివక్ష దాడులకి వ్యతిరేకంగా పోరాడుతున్న స్టాప్ ఏఏపీఐ హేట్ న్యాయవాద సంస్థ గణాంకాల ప్రకారం గత ఏడాది మార్చి నుంచి ఈ ఏడాది మార్చి వరకు అమెరికా వ్యాప్తంగా ఆసియన్లను లక్ష్యంగా చేసుకొని 3,800 దాడుల ఘటనలు జరిగాయి. కరోనా విజృంభణ తర్వాత ఈ దాడుల ఘటనల్ని ఆ సంస్థ ఇంటర్నెట్ టూల్ సాయంతో సేకరించింది. వైరస్ వెలుగులోకి వచ్చాక ఆసియన్లపై దాడులు 150% పెరిగిపోయాయి. కాలిఫోర్నియాలో పెరిగిన దారుణాలు అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో అత్యధికంగా ఆసియన్ అమెరికన్లు నివసిస్తారు. తాజా అంచనాల ప్రకారం ఆ రాష్ట్రంలో 60 లక్షల మందికి పైగా ఆసియన్లు ఉన్నారు. రాష్ట్ర జనాభాలో 15 శాతానికి పైగా ఆసియన్లే. కరోనా వైరస్ వ్యాప్తి చెందక ముందు, తర్వాత దాడుల్ని పరిశీలిస్తే కాలిఫోర్నియాలోని ఆరెంజ్ కౌంటీలో ఏకంగా 1,200% పెరిగిపోయాయని ఆసియన్ ఫసిఫిక్ పాలసీ ప్లానింగ్ కౌన్సిల్ తన నివేదికలో వెల్లడించింది. గత ఏడాది మార్చి-మే మధ్య 34 కౌంటీలలో 800కి పైగా కరోనా వైరస్‌కి సంబంధించిన దాడులే జరిగాయి. నేడు సెనేట్‌లో బిల్లుపై ఓటింగ్ అట్లాంటాలో కాల్పుల తర్వాత ఆ రాష్ట్రంలో పర్యటించిన అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌లు ఈ తరహా ఘటనల్ని ఇకపై జరగనివ్వబోమని ఆసియన్ కమ్యూనిటీకి హామీ ఇచ్చారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు స్థానిక ప్రభుత్వాలకు మరిన్ని అధికారాలు కట్టబెడుతూ ఒక బిల్లుని రూపొందించారు. బుధవారం ఆ బిల్లుపై సెనేట్‌లో ఓటింగ్ జరగనుంది. ఆసియన్లపై వివక్షాపూరిత భాషని వాడడం, హింసించడం, భౌతిక దాడులకు దిగడం వంటివాటికి అడ్డుకట్ట వేసేలా ఈ బిల్లులో అంశాలను పొందుపరిచారు. ప్రధానంగా స్థానిక యంత్రాంగం మరింత బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుంది. అయితే చెరి సమానమైన బలం ఉన్న సెనేట్‌లో రిపబ్లికన్ పార్టీ ఎంతవరకు కలిసివస్తుందోనన్న అనుమానాలున్నాయి. అందుకే సెనేట్ మెజారిటీ లీడర్ చక్ చమర్ ఈ బిల్లుని ఎవరైనా వ్యతిరేకిస్తే అంతకన్నా సిగ్గు చేటు ఉండదని వ్యాఖ్యానించారు. తప్పకుండా బిల్లు పాస్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. చైనా నుంచి ప్రపంచ దేశాలకు వ్యాప్తి చెంది అల్లకల్లోలం సృష్టిస్తున్న కరోనా వైరస్ అమెరికాలో ఆసియన్లకి కొత్త సమస్యలు తెచ్చి పెడుతోంది. ఈ వైరస్‌కి ఆసియా దేశాలే కారణమని భావిస్తున్న అమెరికన్లు వారు కనిపిస్తే చాలు అకారణంగా ఆవేశానికి లోనవుతున్నారు, దాడులకు దిగుతున్నారు. ఒక ఆసియన్ అమెరికన్ మహిళ కమలా హ్యారిస్ ఉపాధ్యక్షురాలు అయినప్పటికీ ఈ నేరాలు ఘోరాలు మరింత పెరిగాయే తప్ప తగ్గలేదు. బైడెన్ సర్కార్ తెస్తున్న బిల్లులో వీటికి ఏమేరకు అడ్డుకట్ట పడుతుందో చూడాలి. -
‘నల్లగా ఉండటం నా తప్పా...'
‘నల్లగా ఉండటం నా తప్పా అంటూ..’ రంగు పట్ల ఉన్న వివక్ష గురించి ఒక పాటలా తనలాంటి వారి వేదనను సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తుంది ఐషు. నవ్వుతూ తన అభిప్రాయాన్ని తెలుపుతున్న ఐషు లాక్డౌన్ టైమ్ నుంచి తను చేస్తున్న డ్యాన్స్ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేస్తోంది. ఎనర్జిటిక్ డ్యాన్సింగ్ గర్ల్‌గా పేరుతెచ్చుకున్న ఐషు నలుపు–తెలుపు గురించి వాదించాల్సి వస్తోంది. తెల్లగా అవడానికి రకరకాల సూచనలు చేస్తున్నవారి సంఖ్య కొన్నాళ్లుగా పెరుగడమే అందుకు కారణం. ఇన్‌స్టాగ్రామ్‌లో ఐషు ఫొటోలు చూసి చాలామంది తెల్లగా అవడానికి రకరకాల సూచనలు చేస్తున్నారు. దీంతో ‘నల్లగా ఉన్నంత మాత్రానా అందం తగ్గదు. తెల్లగా ఉండకపోవడం నా తప్పు కాదు. నా చర్మం రంగు, తీసుకోవాల్సిన శ్రద్ధ గురించి మీ అభిప్రాయాలను నేను అడగడం లేదు. నలుపు అందమైనది. సూర్యకాంతితో అది మరింత మెరుస్తుంది. కలర్ కోసం బ్లీచింగ్ క్రీమ్స్ వాడమంటూ మీరు అసహ్యకరమైన సూచనలు చేయద్దు..’ అంటూ పాట ద్వారా సున్నితంగా తెలియజేసింది ఐషు. అంతేకాదు ‘ఫ్రెండ్స్... ఈ వీడియో నా కోసం చేయడంలేదు. నాలాంటి వారికి ఇది సహాయంగా ఉంటుందనే నా ఆలోచన. నేను చాలా సంవత్సరాలు ఈ సమస్యపై పోరాడాను. చిన్నప్పుడు నల్లగా ఉన్నానని అందరూ ఆటపట్టించేవారు. ఆ కారణంగా చాలా పిరికిదానిలా ఉండేదాన్ని. ఎవ్వరితోనూ కలిసేదాన్ని కాదు. దీని వల్ల నేను నా అందమైన బాల్యాన్ని కోల్పోయాను. నన్ను ఫెయిర్ క్రీములు వాడమని సలహా ఇచ్చేవారు. పసుపు ముద్ద పూసుకోమనేవారు. కొన్నాళ్లు ఎవరేం చెప్పినా అవన్నీ చేశాను. కానీ, ఓ దశలో నా మీద నేనే విశ్వాసాన్ని పెంచుకున్నాను. View this post on Instagram A post shared by Aishu (@aishuadd) జనాల మాటలు పట్టించుకోవడం మానేశాను. డ్యాన్స్ అంటే పిచ్చిగా ప్రేమించే నేను అక్కడ నుంచి రకరకాల యాక్టివిటీస్ పెంచుకున్నాను. నేటికీ వర్ణవివక్ష ఎదుర్కొంటున్న నాలాంటి అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. ఈ వివక్ష మూలం మన సమాజంలో బాగా లోతుగా ఉంది. దీనికి వ్యతిరేకంగా నల్లగా ఉన్నవారు తమ గళాన్ని పెంచాల్సిన అవసరం ఉంది’ అంటూ తన పోస్టు ద్వారా నలుపు రంగు అమ్మాయిలకు తమ విశ్వాసాన్ని కాపాడుకోవాలనే సలహా ఇస్తుంది ఐషు. ఈ అమ్మాయి మాటలకు సోషల్ మీడియాలో చాలా మంది మద్దతుగా నిలిచారు. ఆమె ఆలోచననూ ప్రశంసిస్తున్నారు. -
వర్ణవివక్షకు తావులేదు
కాన్సస్ ఘటనను ఖండించిన భారతీయ–అమెరికన్లు ► ఘటన విద్వేషపూరితమే: కాంగ్రెస్ సభ్యుడు అమీ బెరా ► మరో కూచిభొట్ల చనిపోకముందే మేల్కొందామన్న బార్ అసోసియేషన్ వాషింగ్టన్ : అమెరికాలోని కాన్సస్‌లో బుధవారం రాత్రి భారత ఇంజనీర్లపై జరిగిన కాల్పుల ఘటనను భారత–అమెరికన్ సమాజం ముక్తకంఠంతో ఖండించింది. అమెరికాలో వర్ణవివక్ష, విదేశీయులంటే భయం వంటి వాటికి తావులేదని.. భారత అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు అమీ బెరా తెలిపారు. ‘కాన్సస్ దుర్ఘటనకు సంబంధించి విచారణ సంస్థలు విచారణ జరిపి వాస్తవాలను వెల్లడిస్తాయని భావిస్తున్నాను. అమెరికాలో విదేశీయులంటే భయం, వర్ణవివక్షలకు చోటులేదు. ఇప్పటివరకు వెల్లడైన వివరాల ప్రకారం.. విద్వేషపూరితంగానే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఇది అమెరికన్లందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది’ అని అమీ బెరా వెల్లడించారు. వలసవాదుల దేశంగా ఉన్న అమెరికాలో.. వ్యక్తుల రంగు, వారి రూపురేఖల ఆధారంగా దాడి చేయటం అమానుషమని ఆయన అన్నారు. మృతుడు శ్రీనివాస్ కూచిభొట్ల కుటుంబానికి అండగా నిలబడతామని అమీ బేరా తెలిపారు. మూడుసార్లు కాలిఫోర్నియా నుంచి కాంగ్రెస్‌కు ఎన్నికైన అమీ బెరా.. భారతీయ అమెరికన్లపై అమెరికా కాంగ్రెస్ కమిటీకి ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. విద్వేషపు తూటా! నోర్మూసుకుని కూర్చోవద్దు: సాబా కాన్సస్ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరగాలని బాధితులకు, వారి కుటుంబాలకు న్యాయం జరగాలని దక్షిణాసియా బార్ అసోసియేషన్ (ఎస్ఏబీఏ–సాబా) డిమాండ్ చేసింది. అమెరికాలో మైనారిటీల హక్కులను కాపాడే బాధ్యత ప్రభుత్వమే తీసుకుని పక్కాగా అమలుచేయాలని ఓ ప్రకటనలో కోరింది. ‘ఈ ఘటనపై మనం నోర్మూసుకుని కూర్చోవద్దు. ఎవరినీ క్షమించొద్దు. నిరాశ చెందొద్దు. మన దేశం (అమెరికా)లో వేళ్లూనుకుపోయిన విద్వేషం, విడగొట్టి చూసే ఆలోచనలను కూకటివేళ్లతో పెకిలించివేయాలి. మరో కూచిభొట్ల శ్రీనివాస్ తన ప్రాణాన్ని కోల్పోకముందే మేల్కొనాలి’ అని పేర్కొంది. కాన్సస్ ఘటన దురదృష్టకరమని.. ఈ కేసులో పూర్తిస్థాయి విచారణ జరుగుతోందని కాన్సస్, మిస్సోరీ రాష్ట్రాల గవర్నర్లు చెప్పారు. ట్రంప్‌తో భారత రాయబారి భేటీ అమెరికాలోని భారత రాయబారి నవతేజ్ సర్నా వైట్‌హౌస్‌లోని ఓవల్ ఆఫీసులో అధ్యక్షుడు ట్రంప్‌తో భేటీ అయ్యారు. ట్రంప్ అధికారంలోకి వచ్చాక సర్నా ఆయనను కలుసుకోవడం ఇదే తొలిసారి. అమెరికాలో భారతీయులు సహా పలువురు విదేశీయులపై విద్వేష దాడులు జరుగుతున్న నేపథ్యంలో సర్నా భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. -
ఎస్... నేనంటే నేనే!
సాక్షి క్రీడావిభాగం సెరెనా విలియమ్స్ తొలి గ్రాండ్‌స్లామ్ విజయానికి, 23వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌కు మధ్యలో 6349 రోజుల వ్యవధి ఉంది. ఇన్ని రోజుల్లో ప్రపంచం చాలా మారిపోయింది. కానీ కొత్త మిలీనియంకు అటువైపు, ఇటువైపు ప్రతినిధిగా ఇప్పటికీ సెరెనా జైత్రయాత్ర మాత్రం ఇంకా కొనసాగుతోంది. 18 ఏళ్ల ప్రాయంలో ప్రపంచాన్ని గెలిచిన రోజు నుంచి మరో 18 ఏళ్ల తర్వాత కొత్త చరిత్రను సృష్టించే రోజు వరకు ఆమె చేసిన ప్రయాణం అసమానం. సాధించిన ప్రతీ ఘనత ఒక అద్భుతం. ఆమె ఆటలో పవర్ ఉంది. మాటల్లో పంచ్ ఉంది. అన్ని రకాల ఆటుపోట్లను తట్టుకొని నిలిచిన తర్వాత ప్రపంచాన్నే ఎదిరించిన ధిక్కారం కూడా సెరెనాలో కనిపిస్తుంది. జాతీయ నంబర్‌వన్‌గా ఉన్నా పదేళ్ల వయసులోనే వర్ణ వివక్ష కారణంగా టోర్నమెంట్ల నుంచి తప్పుకోవాల్సి వచ్చిన పరిస్థితుల నుంచి ప్రపంచ నంబర్‌వన్‌గా ఎదగడం వరకు కసిగా ఆమె ఆటతోనే అందరికీ సమాధానమిచ్చింది. 14 ఏళ్ల వయసులోనే ప్రొఫెషనల్‌గా మారిన సెరెనా, 35 ఏళ్ల వయసు దాటిన తర్వాత కూడా టెన్నిస్ ప్రపంచాన్ని శాసించగలగడం ఆమెను ‘ఆల్‌టైమ్ గ్రేట్’గా నిలబెట్టాయి. తాజా విజయంతో మహిళల టెన్నిస్‌లో ఎవరు గొప్ప అనే చర్చకు ఆమె ఫుల్స్టాప్ పెట్టేసింది. శ్వేత జాతీయులకంటే ఎక్కువగా గుర్తింపు దక్కాలంటే తాము అన్ని విధాలా ఎక్కువగా కష్టపడాలని, 150 శాతం ప్రదర్శన ఇస్తే గానీ వారితో సమంగా నిలవలేమనే బలమైన అభిప్రాయం నల్లజాతి అమెరికన్లలో ఉంది. గతంలోనూ పలువురు శ్వేత జాతీయేతరులు ఆటల్లో అగ్రగామిగా నిలిచినా సెరెనా ప్రస్థానం భిన్నం. ఇతర క్రీడలతో పోలిస్తే తెల్ల జాతీయుల ప్రభావం చాలా చాలా ఎక్కువగా ఉన్న టెన్నిస్‌లో ఆమె రారాణిగా ఎదగడం సెరెనాను మరింత స్పెషల్‌గా మార్చేశాయి. దోపిడీ దొంగలకు నిలయమైన కాంప్టన్ ప్రాంతంలో సెరెనా పెరిగింది. ఆమెతో పాటు సోదరి వీనస్‌ను అగ్రశ్రేణి క్రీడాకారిణులుగా తీర్చిదిద్దడంలో తండ్రి రిచర్డ్స్ విలియమ్స్ ఎన్నో కష్టనష్టాలకోర్చారు. సాధారణ కౌలు రైతు అయిన విలియమ్స్, టెన్నిస్ అకాడమీల వద్దకు వెళ్లి ప్రాక్టీస్ కోసం పాత బంతులు తనకు అమ్మమని అడిగిన రోజులు కూడా ఉన్నాయి! ఆరంభంలో కొద్ది రోజులు బయట శిక్షణ ఇప్పించినా, తనకున్న పరిజ్ఞానం, పుస్తకాల ద్వారా నేర్చుకున్న సమాచారంతో అతనే వారికి పూర్తి స్థాయి కోచ్‌గా మారిపోయాడు. ప్రతికూల పరిస్థితులు ఎదురైనా పోరాటం ఆపకపోవడం, నల్ల జాతికి సంబంధించిన వ్యాఖ్యల విషయంలో మాటకు మాట జవాబివ్వడంలో సెరెనా ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. ఒకప్పుడు తనను, వీనస్‌ను ‘అన్నదమ్ములు’ అంటూ సంబోధించినవారిని హెచ్చరించడం, వింబుల్డన్‌లో ఆట పట్టిస్తున్న ప్రేక్షకులపై ‘నన్ను రెచ్చగొట్టొద్దు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేయడం, లైన్ ఉమెన్ను ‘గొంతు కోస్తా’ అంటూ బెదిరించడం సెరెనాకే చెల్లింది. ఫైనల్ మ్యాచ్‌లో ఆడేది అక్కతోనే అయినా పాయింట్ పోగొట్టుకున్నప్పుడు ఆగ్రహంతో రాకెట్ విరిచేసి ఉద్వేగం ప్రదర్శించడం చూస్తే ఆమె విషయంలో విజయం విలువేమిటో అర్థమవుతుంది. వరల్డ్ నంబర్‌వన్ క్రీడాకారిణిగా సెరెనా ఏమిటో ప్రపంచం మొత్తానికి తెలుసు. కానీ కోర్టు బయట కూడా ‘నలుపు’ గురించి తక్కువ చేసి మాట్లాడటం సెరెనాకు నచ్చదు. అది ఫ్యాషన్ విషయంలోనైనా సరే! అందానికి రంగుతో పని లేదంటూ తన పేరులో అక్షరాలను వెనక్కి రాస్తూ ANERE పేరుతో డిజైనర్ దుస్తుల, హెయిర్టెక్ పేరుతో సౌందర్య సాధనాల వ్యాపారంలోకి అడుగు పెట్టి చూపించింది. 23 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్, 4 ఒలింపిక్ స్వర్ణాలు, 309 వారాల పాటు వరల్డ్ నంబర్‌వన్ (సశేషం), కోట్లాది డాలర్ల ఆదాయం... వీనస్ విజయ విహారం ఇంకా ముగిసిపోలేదు. మరిన్ని విజయాలు, మరెన్నో ఘనతలు ఆమె కోసం ఎదురు చూస్తున్నాయి. ఇప్పుడు మాత్రం ఆమె జగజ్జేత స్థాయిని అనుభవిస్తూ శిఖరాన నిలిచిం ది. ‘బతకడం, ప్రేమించడం, గెలవడం కోసం పది సూత్రాలు’ అనేది సోదరి వీనస్‌తో కలిసి సెరెనా రాసిన పుస్తకం పేరు. దానికి తగినట్లుగానే ఎలా బతకాలో, ఆటను ఎంతగా ప్రేమిం చాలో, ఏ రకంగా గెలవాలో చేసి చూపించిన సెరెనాకు హ్యాట్సాఫ్.