ఆది సాయి కుమార్ హీరోగా జీబీ కృష్ణ దర్శకత్వం లో మహంకాళి మూవీస్ పతాకం పై మహంకాళి దివాకర్ నిర్మిస్తున్న చిత్రం ‘బ్లాక్’.ఈ సినిమాలో ఆది సాయి కుమార్ తొలిసారిగా పోలీస్ డ్రెస్ వేసుకున్నాడు. ఇప్పటికే విడుదలైన టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. తాజాగా బ్లాక్ సినిమా నుంచి దీపావళి సందర్భంగా కొత్త పోస్టర్‌ని విడుదలైంది.
టీజర్ లో కనిపించిన యాక్షన్ షాట్స్ తో సరికొత్త క్యారెక్టర్ తో ఆకట్టుకునే సంభాషణలతో ఈ చిత్రం పై అంచనాలను మరింత పెంచింది. ఆటగాళ్లు ఫేమ్ దర్శన బానిక్, బిగ్ బాస్ కుశాల్ మందా, ఆమని, పృథ్వి రాజ్, సూర్య, సత్యం రాజేష్, తాగుబోతు రమేష్, ఆనంద్ చక్రపాణి తదితరులు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకులముందుకు రానుంది.
Comments
Please login to add a commentAdd a comment