
శ్రీకాకుళం: మందసలో భారీ నల్లతాచు శనివారం స్థానికులను భయపెట్టింది. పట్టణంలోని వాసుదేవ స్వామి ఆలయం సమీపంలోని కూరగాయల తోటలకు శనివారం ఉదయం స్థానికులు పనికి వెళ్తుండగా చలనం లేకుండా పడి ఉన్న 14 అడుగుల నల్లతాచు కనిపించింది. సర్పాన్ని చూసిన వెంటనే వారు హడలెత్తిపోయారు. కాస్త పరిశీలనగా చూసి మరణించిందని నిర్ధారించుకున్నారు.
ఆ పామును చూసేందుకు స్థానికులంతా అక్కడకు వచ్చా రు. మందస ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్, జూవాలజీ అధ్యాపకుడు చింతాడ శరత్‌బాబు మాట్లాడుతూ ఇది అరుదైన కింగ్‌కోబ్రా అని, దీనినే రాచనాగు అనికూడా పిలుస్తారన్నారు. దీని జాతి పేరు ఓఫియోఫేగస్ అని, సుమారు 18 నుంచి 20 అడుగుల వరకు పెరుగుతుందని, జీవితకాలం 20 ఏళ్లన్నారు. ఇది సిగ్గరి అని, ఎవరి కంట పడడానికి ఇష్టపడదని, నాగుపాములు, ఇతర పాములను ఆహారంగా తీసుకుంటుందన్నారు.