మైసూరు(కర్ణాటక): వన్యజీవుల ప్రపంచంలో అత్యంత అరుదైన నల్ల చిరుతపులి సందర్శకులకు కనువిందు చేసింది. మైసూరు జిల్లాలో ఉన్న హెచ్‌డీ కోటె తాలూకాలో నాగరహొళె అభయారణ్యంలోని దమ్మనకట్టి రేంజిలో సోమవారం సఫారీకి వచ్చిన పర్యాటకులకు నల్ల చిరుత దర్శనమిచ్చింది.
దీంతో సందర్శకులు తమ కెమెరాలకు పనిచెప్పారు. అరుదైన నల్ల చిరుత ఫోటోలను తమ కెమెరాల్లో బంధించారు. సాధారణంగా ఇక్కడ ఏనుగులు, పులులు, చిరుతలు సంచరిస్తుంటాయి. చాలా అరుదుగా నల్ల చిరుత బయటకు వస్తూ ఉంటుందని అటవీ సిబ్బంది తెలిపారు.
చదవండి: ఆ ఫొటోలు మైనర్‌కు పంపిన శాంతిప్రియ.. భరత్ దక్కడేమోనని..
Comments
Please login to add a commentAdd a comment