karnatka
-
హిమాలయాల్లో విషాదం.. తొమ్మిదికి చేరిన మృతులు
యశవంతపుర: ఉత్తరాఖండ్‌లో హిమాలయ పర్వతాలలో విహారయాత్రకు వెళ్లి ఉత్తరకాశీ జిల్లా సహస్ర తాల్ వద్ద మంచు తుపానులో చిక్కుకున్న కన్నడిగుల విషాద ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది. సుమారు 18 మంది బెంగళూరు గత నెలాఖరులో హిమాలయాల ట్రెక్కింగ్‌కు వెళ్లారు. కానీ మంగళవారం సంభవించి మంచు తుపానులో 5 మంది మరణించి, 9 మంది గల్లంతయ్యారు. గురువారానికి మృతుల సంఖ్య 9 కి పెరిగింది.కన్నడిగుల మృతదేహాలను ప్రత్యేక విమానంలో బెంగళూరుకు తీసుకొచ్చే విషయంపై ఉత్తరాఖండ్ ప్రభుత్వంతో మంత్రి కృష్ణబైరేగౌడ చర్చలు జరిపారు. గురువారం ఉదయం 11 గంటలకు 9 మృతదేహాలకు ఉత్తరకాశీలోని ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం జరిపారు. అక్కడి నుంచి విమానంలో డెహ్రాడూన్‌కు తరలించారు. మరణించిన తొమ్మిది మంది ట్రెక్కర్ల మృతదేహాలలో ఐదుగురి మృతదేహాలు బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్నాయి. మిగిలిన నాలుగు మృతదేహాలు మరో విమానంలో చేరుకోనున్నాయి.Update on Uttarakhand Trekkers: After a continuous two-day rescue operation, the bodies of five out of the nine deceased trekkers have arrived at Bangalore Airport. The remaining four bodies will be arriving on the next flight. We paid homage to these trekkers, who succumbed to… pic.twitter.com/ZkltXtLWR9— Krishna Byre Gowda (@krishnabgowda) June 7, 2024 మృతులు వీరే మృతుల్లో ముగ్గురు పురుషులు, ఆరుమంది మహిళలు ఉన్నారు. ఇందులోనే మృతుడు సుధాకర్ (71) ఉన్నారు. ఆయనే కర్ణాటక మౌంటెనీరింగ్ సంఘం (కేఎంఏ)ని స్థాపించి తరచూ ఔత్సాహికులను హిమాయల పర్వతాల అధిరోహణకు తీసుకెళ్లేవారని తెలిసింది. మిగతా మృతుల వివరాలు.. సింధు వకీలం (44), సుజాత ముంగుర్‌వాడి (52), ఆమె భర్త వినాయక్.బి (52), చిత్రా ప్రణీత్ (48), కె.వెంకటేష్ ప్రసాద్ (53), కేపీ పద్మనాభ (50), అనితా రంగప్ప (55), పద్మిని హెగ్డే (34) ఉన్నారు. వీరందరూ బెంగళూరు వాసులే. తమవారు ఇక లేరని తెలిసి వారి పిల్లలు, జీవిత భాగస్వాములు తీవ్ర శోకంలో మునిగిపోయారు. -
‘కోబ్రా’తో బుడతడి ఆటలు..!
కింగ్ కోబ్రా (రాచ నాగు) అంటేనే అందరికీ హడల్. ఆ పామును చూస్తే పరుగులు తీస్తారు. కానీ ఓ ఐదేళ్ల బుడతడు ఏ మాత్రం భయం లేకుండా దానిని ఆడిస్తున్నాడు. కర్ణాటకలో ఉత్తర కన్నడ జిల్లా శిరసి తాలూకా కేహెచ్‌బీ కాలనీవాసి పాములు పట్టే నిపుణుడు ప్రశాంత్ హులేకర్ కుమారుడు విరాజ్ ధైర్యాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. బాలుడు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నాడు. గత రెండేళ్లుగా తండ్రితో కలిపి పాములు పట్టడం నేర్చుకున్నాడు. సోమవారం కేహెచ్‌బీ కాలనీలో కింగ్ కోబ్రా చొరబడిందని తెలిసి తండ్రీకొడుకులు దానిని బంధించేందుకు వచ్చారు. ఈ సందర్భంగా విరాజ్ స్వేచ్ఛగా సర్పాన్ని ఆడిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తర్వాత దానిని దూరంగా విడిచిపెట్టారు. – బనశంకరి -
ఇది సంతృప్తి చెందాల్సిన సమయం కాదు!: శశి థరూర్
కన్నడ నాట కాంగ్రెస్ అత్యథిక మెజార్టీతో గెలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఆయా కార్యాలయాల్లో సంబరాలు చేసుకుంటూ సందడిగా కనిపిస్తున్నారు. ఈ మేరకు తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ దీనిపై స్పందిస్తూ..ఈ ఘన విజయానికి సంతృప్తి చెందాల్సిన సమయం కాదన్నారు. ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రజలకు తగిన ఫలితం అందించాల్సిన తరుణం అని నాయకులుకు గుర్తు చేశారు. అలాగే కన్నడ నాట గెలిచిన తన కాంగ్రెస్ సహచరులను చూసి తాను గర్వపడుతున్నానని చెప్పారు. ఇది వేడుకలకు సమయమే కానీ ఆత్మసంతృప్తికి మాత్రం కాదని అన్నారు. ఎందుకంటే మనం గెలిచేందుకు చేసిన కృషికి తగిన ఫలితం పొందాం. అంతకంటే ముందు మన గెలుపుకి కారణమైన కర్ణాట ప్రజలకు తగిన ఫలితాలను అందించాల్సిన సమయం కూడా ఇది అని ఎంపీ శశి థరూర్ ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా..కర్ణాటకలో హంగ్ అసెంబ్లీ ఉంటుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలను చాలా వరకు నిజం చేస్తూ.. అనూహ్యంగా 224 సభ్యుల అసెంబ్లీలో కాంగ్రెస్ 136 స్థానాల్లో గెలిపోంది, విజయ డుండిభి మోగించడమే గాక సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం కర్ణాటకలో సీఎం రేసులో సిద్ధ రామయ్య, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డీ కే శివకుమార్ ఇద్దరూ ఉన్నందున అందరి దృష్టి ముఖ్యమంత్రి పదవికి సంబంధించిన కీలక నిర్ణయంపైనే ఉంది. కాగా కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తొలి కేబినేట్ సమావేశంలో హామీలను నెరవేర్చడంపైనే కర్ణాటక కాంగ్రెస్ దృష్టిసారిస్తుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. (చదవండి: ప్రజల తీర్పుని గౌరవిస్తాం: హెచ్డీ కుమారస్వామి) -
కాంగ్రెస్ గూటికి మాజీ సీఎం.. బీజేపీపై కీలక వ్యాఖ్యలు..
బెంగళూరు: బీజేపీ సీనియర్ నేత, కర్ణాటక మాజీ సీఎం జగదీశ్ శెట్టర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ కేటాయించలేదని బీజేపీకి ఆదివారం రాజీనామా చేసిన ఆయన.. ఆ మరునాడే హస్తం తీర్థం పుచ్చుకున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్, సిద్ధరామయ్య, రణ్‌దీప్ సుర్జేవాలా సమక్షంలో హస్తం కండువా కప్పుకున్నారు. బెంగళూరులో ఈ చేరిక కార్యక్రమం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కర్ణాటకలో క్షేత్రస్థాయిలో బీజేపీ బలోపేతం కోసం చాలా ఏళ్లపాటు కృషి చేసిన తనకు.. ఈసారి టికెట్ ఇవ్వకుండా దారుణంగా అవమానించడం షాక్‌కు గురి చేసిందని జగదీశ్ శెట్టర్ పేర్కొన్నారు. ప్రతిపక్ష నేత, మాజీ సీఎం, పార్టీ అధ్యక్షుడిగా పని చేసిన తాను కాంగ్రెస్‌లో చేరడం చూసి చాలా మంది ఆశ్చర్య పోతున్నారని తెలిపారు. అలాగే తనను రాజీనామా చేయకుండా బీజేపీలో ఎవరూ బుజ్జగించే ప్రయత్నం కూడా చేయలేదని జగదీశ్ తెలిపారు. ఎలాంటి పదవి ఇస్తామని గానీ, పార్టీలో ఉండాలని గానీ ఏ స్థాయి నేత కూడా తనను సంప్రదించలేదని చెప్పారు. #WATCH | Former Karnataka CM Jagadish Shettar joins Congress, in the presence of party president Mallikarjun Kharge, KPCC president DK Shivakumar & Congress leaders Randeep Surjewala, Siddaramaiah at the party office in Bengaluru. Jagadish Shettar resigned from BJP yesterday. pic.twitter.com/vxqVuKKPs1 — ANI (@ANI) April 17, 2023 కాగా.. కర్ణాటకలో బీజేపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. టికెట్ ఆశించి భంగపడ్డ సీనియర్ నేతలు పార్టీకి రాజీనామా చేస్తున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్, జేడీఎస్‌లో చేరారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మే 10న ఒకే విడతలో జరగనుంది. 13న కౌంటింగ్, ఫలితాలు ప్రకటిస్తారు. ఇటీవల నిర్వహించిన సీఓటర్ సర్వేలో ఈసారి కాంగ్రెస్‌దే విజయమని తేలింది. చదవండి: రాత్రి నా ఇంటికి ఆగంతుకుడు వచ్చాడు.. భద్రతా వైఫల్యంపై సిద్ధూ ఆందోళన -
వైభవంగా శ్రీ గణపతి సచ్చిదానంద సహస్ర చంద్రదర్శన వేడుకలు
మైసూరు :అవధూత దత్తపీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి సహస్ర చంద్రదర్శన శాంతి మహోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. దేశం నలుమూలల నుండి అనేక మంది చతుర్వేద పండితులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పూజ్య స్వామీజీ వారు విశేషంగా భక్తులకు తమ అనుగ్రహ సందేశం అందించారు. గత 50 సంవత్సరాల నుండి పూజ్య స్వామీజీ జన్మదినోత్సవ వేడుకలలో వివిధ శాఖలకు చెందిన వేదపండితులు, అర్చకులను గౌరవించే ఆనవాయితీ క్రమంలో నేడు అనేక మంది చతుర్వేద పండితులను, ఆలయ అర్చకులను గౌరవించారు. వేదవిద్యను అందరూ ప్రోత్సహించాలని అన్నారు. ఆలయ అర్చకులను అందరూ గౌరవించాలి వారికి తగిన ప్రోత్సాహం ఇవ్వాలి అన్నారు. అర్చకులను గౌరవించక పోతే ధర్మం క్షీణిస్తుంది, అర్చకులను పోషిస్తే దేశం సుభిక్షాంగా ఉంటుంది అన్నారు. ఆలయాలను రక్షించడంలో అర్చకులు పోషిస్తున్న ప్రధానపాత్రను కొనియాడారు. భారతీయులమైన మనం అర్చకులను తప్పనిసరిగా ప్రోత్సహించి వారికి కావలసిన వసతులు కల్పించటం మన బాధ్యతగా అందరూ ఆచరించాలి అని సూచించారు. -
పెళ్లయి పిల్లలు ఉన్న తండ్రి.. మరో వివాహిత వెంటపడి.. భర్త ఎదుటే..
చిక్కబళ్లాపురం(కర్ణాటక): పెళ్లయి పిల్లలు ఉన్న ఓ వ్యక్తి ప్రేమ పేరుతో మరో వివాహిత వెంటపడి ఆమె నిరాకరించడంతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన నగరంలో చోటుచేసుకుంది. వివరాలు...నగరంలోని కోటె ప్రాంతంలో నివాసం ఉంటున్న నవీన్ (27) వివాహితుడు. కార్పెంటర్ వృత్తితో జీవనం సాగిస్తున్నాడు. జీవితం సజావుగా సాగుతుండగా దుర్బద్ది పుట్టింది. తన ఇంటి సమీపంలోని ఓ వివాహితురాలిని ప్రేమించాలని వేధించేవాడు. ఏకంగా సదరు మహిళ ఇంటికి వచ్చి భర్త ఎదుటే తనను ప్రేమించాలని ఒత్తిడి చేసేవాడు. దీంతో రెండు కుటుంబాల మధ్య గొడవలు జరిగాయి. ప్రేమను అంగీకరించపోతే చనిపోతా: ఇటీవల నవీన్ సదరు వివాహిత ఇంటికి వచ్చి తనను ప్రేమించకపోతే చనిపోతానని బెదిరించాడు. ఆమె ఎదుటే బాటిల్‌తో తలపై కొట్టుకున్నాడు, ఆమె పేరును కూడా చెక్కించుకున్నాడు. ఇదిలా ఉంటే నవీన్ తల్లి కాశీ యాత్రకు వెళ్లింది. ఈ క్రమంలో తల్లి ఇంటిలో ఉరి వేసుకున్నాడు. నగర పోలీసులు అనుమానాస్పద మృతి కేసును నమెదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చదవండి: ఏఎస్ఐ కుమార్తె ఆత్మహత్య.. కారణం అదేనా? -
భర్తకు తెలియకుండా అబార్షన్ మాత్ర తీసుకున్న మహిళ.. చివరకు..
బెంగళూరు: కర్ణాటక బెంగళూరులో ప్రీతి కుశ్వాహా అనే 33 ఏళ్ల మహిళ భర్తకు తెలియకుండా అబార్షన్ మాత్రం తీసుకుంది. దీని వల్ల సమస్యలు తలెత్తి తీవ్ర రక్తస్రావమైంది. ఆస్పత్రికి తరలించగా ఆమె అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ దంపతులకు 11 నెలల చిన్నారి ఉంది. అయితే ఇటీవల వైద్య పరీక్షలు నిర్వహించగా ప్రీతి మళ్లీ గర్బం దాల్చినట్లు తేలింది. ఇప్పటికే చిన్న పాప ఉన్నందున ఇంత త్వరగా మరో బిడ్డకు జన్మనిచ్చేందుకు ఆమె విముఖత వ్యక్తం చేసింది. అబార్షన్ చేయించుకుంటానని భర్తకు చెప్పగా.. అందుకు అతను ఒప్పుకోలేదు. అయితే సోమవారం సాయత్రం భర్త బయటకు వాకింగ్‌కు వెళ్లినప్పుడు ప్రీతి అబార్షన్ మాత్ర తెచ్చుకుని వేసుకుంది. దీంతో తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. భరించలేని కడుపునొప్పితో పాటు రక్తస్రావమైంది. భర్త ఆస్పత్రికి తీసుకెళ్తానంటే ఆమె వద్దంది. కానీ మంగళవారం ఉదయం ప్రీతి స్పృహ తప్పి పడిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఆమె భర్త హుటాహుటిన ఆస్పత్రికి తరలించాడు. అయితే ప్రీతి అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించడంతో తీవ్ర దుఃఖంలో మునిగిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు అసహజ మరణంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అబార్షన్ మాత్ర వల్లే మహిళ చనిపోయినట్లు ప్రాథమిక నిర్ధరణకు వచ్చారు. అనుమానాస్పదంగా ఏమీ కన్పించడంలేదని పేర్కొన్నారు. చదవండి: సీబీఐ అధికారులమని చెప్పి రైడ్.. రూ.30 లక్షలు దోచుకెళ్లిన గ్యాంగ్.. -
ఇంకా ఆలస్యమైతే ఆరువేలు అడిగే వాళ్లం!
అదృష్టవంతులు.. 3వేలతో సరిపోయింది.. ఇంకా ఆలస్యమైతే ఆరువేలు అడిగే వాళ్లం! -
పెళ్లి పీటలెక్కనున్న నటి.. కాబోయే భర్త ఎవరంటే?
బనశంకరి(కర్ణాటక): కన్నడ నటి అదితి ప్రభుదేవా దాంపత్య జీవితంలోకి అడుగు పెట్టనున్నారు. సోమవారం ప్యాలెస్ మైదానంలో వివాహ వేడుక జరగనుంది. ఆమె శాండల్‌వుడ్‌లో డిమాండ్ ఉన్న నటి. కాగా, కాఫీ రంగ పారిశ్రామికవేత్త యశస్‌తో పెళ్లి జరగనుంది. ఇది పెద్దలు కుదిర్చిన పెళ్లి అని తెలిపారు. ఆదివారం సాయంత్రం జరిగిన రిసెప్షన్లో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. చదవండి: అలీ కూతురిని ఆశీర్వదించిన మెగాస్టార్, వీడియో వైరల్ -
వేరే మహిళతో భర్త వివాహేతర సంబంధం.. భార్య సహించలేక..
మండ్య(కర్ణాటక): ప్రేమించి పెళ్లి చేసుకుంది, కానీ కుటుంబ కలహాలను తాళలేక డెత్‌నోట్ రాసి బిడ్డతో కలసి తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన నాగమంగల తాలూకా కెంచెగౌడనకొప్పలో సోమవారం సాయంత్రం జరిగింది. వివరాలు.. మాజీ జడ్పీ సభ్యుడు దొరెస్వామి– సునంద దంపతుల కుమార్తె బిందు, నాగమంగల కుంభార వీధి నివాసి నవీన్ నాలుగేళ్ల క్రితం ప్రేమించి, పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరి కులాలు వేరు కావడంతో ఇరు కుటుంబాలు వ్యతిరేకించాయి. చదవండి: బీచ్‌లో లైంగిక దాడి.. ఆ వీడియోని పదే పదే చూపిస్తూ.. మొదట్లో దంపతులు అన్యోన్యంగా మెలిగే వారు. కానీ కాలం గడిచే కొద్దీ ఇద్దరి మధ్య చిన్నచిన్న గొడవలు ప్రారంభమయ్యాయి. వీటికి తోడు బిందును అత్త, మామ, ఆడపడుచులు వేధించడం మొదలైంది. ఇక భర్త వేరే మహిళతో సంబంధం పెట్టుకున్నాడు. ఇక సహించలేక బిందు తన పది నెలల కొడుకుతో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత కూడా తరచూ ఫోన్లో గొడవపడుతూ ఉండేవారు. దీంతో జీవితంపై విరక్తి చెందిన బిందు శిశువుకు ఉరి వేసి తరువాత తానూ అదే వైరుతో ఉరి వేసుకుంది. ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్ రాసింది. తన చావుకు భర్త నవీన్, అత్త, మామ, ఆడపడుచు కారణమని పేర్కొంది. నాగమంగల పోలీసులు పరిశీలించి ఇరువురి మృతదేహాలను పట్టణంలోని ప్రజా ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. బిందు తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
పవిత్రా లోకేశ్ నా భార్యే: సుచేంద్రప్రసాద్
బనశంకరి(కర్ణాటక): ‘నటి పవిత్రా లోకేశ్ నా భార్యే. హిందూ సంప్రదాయం ప్రకారం ఆమెను వివాహం చేసుకున్నాను. నా పాస్‌పోర్ట్, ఆధార్ కార్డును గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది’ అని కన్నడ నటుడు సుచేంద్రప్రసాద్ చెప్పారు. నటి పవిత్ర, తెలుగు సీనియర్ నటుడు నరేష్‌లు పెళ్లి చేసుకోబోతున్నారని గత కొద్దిరోజులుగా జోరుగా ప్రచారం సాగుతుండటం, అదే సమయంలో వారిద్దరూ తరచూ జంటగా కనిపిస్తుండటం తెలిసిందే. చదవండి: అలా చేస్తే ‘సర్కారువారి పాట’మరో 100 కోట్లు వసూలు చేసేది ఈ నేపథ్యంలో సుచేంద్రప్రసాద్ శనివారం బెంగళూరులో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పవిత్రా లోకేశ్, తాను భార్యాభర్తలుగా అనేక కార్యక్రమాలకు వెళ్లామని, కానీ వివాహ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ తీసుకోలేదని చెప్పారు. మ్యారేజ్ సర్టిఫికెట్ తీసుకోవడం విదేశీ సంస్కృతికి నిదర్శనమని భావించామని, అందుకే సర్టిఫికెట్ తీసుకోలేదని చెప్పారు. -
‘మాజీ ప్రధానితో సీఎం కేసీఆర్ భేటీ.. రెండు, మూడు నెలల్లో సంచలన వార్త’
సాక్షి, బెంగుళూరు: జాతీయస్థాయిలో పలు రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గురువారం కర్ణాటకలో పర్యటించారు. మాజీ ప్రధాని దేవెగౌడ, ఆయన కుమారుడు, ఆ రాష్ట్ర మాజీ సీఎం కుమారస్వామితో భేటీ అయ్యారు. అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ, దేశంలో మార్పు తథ్యం అని, కొన్ని నెలల్లో దేశంలో భారీ మార్పులు జరుగుతాయన్నారు. రెండు, మూడు నెలల్లో సంచలన వార్త చెబుతానన్నారు. దేశంలో బడుగు బలహీన వర్గాలు సంతోషంగా లేవన్నారు. భారత్‌లో పుష్కలమైన మానవ వనరులు ఉన్నాయన్నారు. చదవండి: తెలంగాణ ఆ కుటుంబ దోపిడీకి గురవుతోంది: ప్రధాని మోదీ కాగా, ప్రధానంగా కేంద్రం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై కేసీఆర్ చర్చించినట్లు తెలిసింది. రాబోయే సాధారణ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రాకుండా చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై దేవెగౌడతో చర్చించినట్లు సమాచారం. -
అరుదైన నల్ల చిరుతని ఎప్పుడైనా చూశారా..?
మైసూరు(కర్ణాటక): వన్యజీవుల ప్రపంచంలో అత్యంత అరుదైన నల్ల చిరుతపులి సందర్శకులకు కనువిందు చేసింది. మైసూరు జిల్లాలో ఉన్న హెచ్డీ కోటె తాలూకాలో నాగరహొళె అభయారణ్యంలోని దమ్మనకట్టి రేంజిలో సోమవారం సఫారీకి వచ్చిన పర్యాటకులకు నల్ల చిరుత దర్శనమిచ్చింది. దీంతో సందర్శకులు తమ కెమెరాలకు పనిచెప్పారు. అరుదైన నల్ల చిరుత ఫోటోలను తమ కెమెరాల్లో బంధించారు. సాధారణంగా ఇక్కడ ఏనుగులు, పులులు, చిరుతలు సంచరిస్తుంటాయి. చాలా అరుదుగా నల్ల చిరుత బయటకు వస్తూ ఉంటుందని అటవీ సిబ్బంది తెలిపారు. చదవండి: ఆ ఫొటోలు మైనర్‌కు పంపిన శాంతిప్రియ.. భరత్ దక్కడేమోనని.. -
అన్న కాదు మృగాడు.. గర్భం దాల్చిన బాలిక
మైసూరు(కర్ణాటక): తోడబుట్టిన చెల్లిపై అన్న అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ దారుణంతో ఆమె గర్భం దాల్చిన సంఘటన మైసూరు గిరిదర్శిని నగరలో వెలుగుచూసింది. కామాంధుడు వినయ్‌కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. చిన్న వయసులోనే తల్లిదండ్రులు మృతి చెందడంతో 16 ఏళ్ల బాలిక అన్న వినయ్‌కుమార్ వద్ద ఉంటోంది. ఆమెకు ఇద్దరు అన్నలు, ఇద్దరు అక్కలు ఉండగా, అక్కలకు పెళ్లయి వెళ్లిపోయారు. మద్యానికి బానిస అయిన వినయ్‌కుమార్ మద్యం తాగి వచ్చి చెల్లిపై లైంగికదాడికి పాల్పడేవాడు. గత మూడు నెలలుగా ఇలా జరుగుతుండటంతో ప్రస్తుతం బాలిక గర్భవతి అయ్యింది. ఇది తెలిసిన మరో అన్న ఆళనహళ్ళి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని మృగాన్ని అరెస్టు చేశారు. బాలికను ఆస్పత్రిలో చేర్పించారు. చదవండి: సినిమా చూసి.. శవాన్ని ముక్కలుచేసి.. బాలికకు గర్భం, యువకుడు అరెస్టు శివమొగ్గ: మైనర్ బాలికను పెళ్ళి కూడా చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేసిన కేసులో యువకున్ని అరెస్టు చేశారు. భద్రావతిలోని న్యూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. రెండు రోజుల క్రితం బాలికకు అనారోగ్యంగా ఉండటంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లగా, వైద్యులు పరీక్షించి బాలిక కడుపుతో ఉందని చెప్పారు. తల్లిదండ్రులు బాలికను ప్రశ్నించగా విషయం బయట పెట్టింది. దీంతో కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి యువకున్ని అరెస్టు చేశారు. -
ఆడి కారు యాక్సిడెంట్: ఎన్నో అనుమానాలు.. అసలు ఏం జరిగింది?
బనశంకరి(కర్ణాటక): ఐటీ సిటీలో ఆడి కారు దుర్ఘటనలో ఎమ్మెల్యే తనయుడు, మరో ఆరుగురు యువతీ యువకుల మరణం సంచలనాత్మకమైంది. హై ఎండ్ కారుతో యువత సరదాలు కుటుంబాలకు శోకాన్ని మిగిల్చాయి. ఈ కేసులో కొత్త కొత్త అంశాలు నెమ్మదిగా వెలుగుచూస్తున్నాయి. కరుణాసాగర్, అతని స్నేహితులు మిడ్ నైట్ పార్టీ చేసుకుని జాలీ రైడ్ చేసి ఉండవచ్చునని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 150 కిలోమీటర్ల వేగం బెంగళూరు రోడ్ల మీద 90–100 కిలోమీటర్ల వేగంతో వెళ్లడం కష్టం. ప్రమాద సమయంలో 150 కిలోమీటర్లు కంటే ఎక్కువ వేగంతో కారు డ్రైవింగ్ చేశారంటే మత్తులో ఉండి ఉండాలని పోలీసులకు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. దీంతో హెచ్ఎస్ఆర్ లేఔట్, కోరమంగల, ఎంజీ రోడ్డు, ఇందిరానగర హోటల్స్, పబ్‌లను పరిశీలించాలని నిర్ణయించారు. కరుణాసాగర్ మిత్రబృందం ఎక్కడెక్కడ తిరిగిందో పసిగట్టేందుకు అక్కడి సీసీ కెమెరాల చిత్రాలను తనిఖీ చేయనున్నారు. యాక్సిడెంట్ జరిగినచోట రోడ్డు కుడివైపునకు వంపు ఉండగా, కారు ఎడమవైపునకు నేరుగా దూసుకుపోయింది. అక్కడ కారును అదుపు చేయలేకపోయారు. 3 మొబైళ్లు లభ్యం కారు శిథిలాల్లో మూడు మొబైల్‌పోన్లు లభించాయి. అన్ని ఫోన్ల తెరలు ముక్కలై ఉన్నాయి. వారి కాల్ డేటా, టవర్ లొకేషన్ ఆధారంగా ఎక్కడ విందు చేసుకున్నారో కూపీ లాగుతున్నారు. సుమారు 30 మంది పోలీసులను ఇందుకు నియమించారు. మద్యం సేవించారా, లేదా అనేది కచ్చితంగా తెలుసుకునేందుకు మృతుల రక్తనమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపారు. ఒకటిరెండురోజుల్లో పరీక్షల నివేదిక అందే అవకాశం ఉంది. కారు నడిపిన కరుణాసాగర్ పోస్టుమార్టం నివేదిక కేసులో ముఖ్యమైనదని పోలీసులు తెలిపారు. అత్యంత వేగంగా డ్రైవింగ్ చేశారని కనబడుతున్నప్పటికీ అందుకు కారణాలేమిటీ అనేది ఈ నివేదికల ద్వారా తెలిసే అవకాశముంది. కరుణాసాగర్ ఎమ్మెల్యే పుత్రుడు కావడంతో ఇది ప్రాముఖ్యమైన కేసుగా మారింది. ప్రమాదస్థలికి ముందు సోనీ వరల్డ్ సిగ్నల్ వద్ద ఫుడ్ డెలివరీ బాయ్ ఈ ఆడి కారునుంచి తృటిలో తప్పించుకున్నట్లు తెలిసింది. దీనిని గమనించిన పోలీసులు కారును అడ్డగించడానికి వెళ్లగా వేగంగా వెళ్లిపోయిందని సమాచారం. మద్యం కొనుగోళ్లు? ►కారులోనివారు మద్యం సేవించి ఉంటారన్న పోలీసుల అనుమానానికి సాక్ష్యాలు లభిస్తున్నాయి. నైట్ కర్ఫ్యూ ప్రారంభానికి ముందు ఇషితా, మరొక యువతి కోరమంగలలో ఓ వైన్‌షాపులో మద్యం కొనుగోలు చేశారు. సీసాలను బ్యాగ్‌లో పెట్టుకుని బయలుదేరిన దృశ్యాలు సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. ►సోమవారం రాత్రి 8.19 నిమిషాలకు కోరమంగలలో ఉన్న జోలో పీజీ నుంచి ఇషితా, బిందు బయలుదేరారు. 8.39 నిమిషాలకు పీజీ నుంచి సోనీ వరల్డ్‌కు వెళ్లే రోడ్డుకు చేరారు. పీజీ నుంచి సుమారు 200 మీటర్ల దూరం వరకు నడుచుకుని వెళ్లిన దశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. ►5 వ క్రాస్ రోడ్డు నుంచి ఎడమవైపునకు తిరిగి అక్కడ నుంచి హైఫై మద్యం దుకాణం వద్దకు వెళ్లారు. రాత్రి.8.30 నుంచి 8.44 వరకు మద్యం దుకాణంలో కొనుగోలు చేశారు. ►అక్కడే పక్కనున్న పబ్‌లోకి వెళ్లగా మరమ్మత్తులు చేస్తుండటంతో వెనక్కి వచ్చేశారు. ఇషికా, బిందు అక్కడి నుంచి సోనీ వరల్డ్ మార్గంగా బయలుదేరారు. దుకాణాల వద్ద గల సీసీ టీవీలో దృశ్యాలు నమోదు కాబడ్డాయి. అక్కడికి ఆడి కారు రాగా, కారులో వెళ్లిపోయారు. ఇవీ చదవండి: పబ్‌లో చిన్నారి డాన్స్ వైరల్.. పోలీసులు సీరియస్ చార్జింగ్కు పెట్టి ఫోన్లో మాట్లాడిన యువతి, అక్కడికక్కడే.. -
విషాదం: ప్రియుడి హత్య.. తట్టుకోలేక ప్రియురాలు..
మండ్య(కర్ణాటక): ప్రియుడు హత్యకు గురి కావడంతో ప్రియురాలు అతని మరణాన్ని జీర్ణించుకోలేక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండ్య నగరంలోని బాలమందిరంలో మంగళవారం చోటు చేసుకుంది. ఆత్మహత్య చేసుకున్న బాలిక మండ్య నగరసభ స్థాయీ సమితి అధ్యక్షుడు శివలింగ కుమార్తె (17). పోలీసుల వివరాల మేరకు... విశ్వేశ్వరయ్య లేఔట్లో నివాసం ఉంటున్న దర్శన్, మాన్విత ప్రేమించుకున్నారు. కుమార్తె ప్రేమ విషయం తెలుసుకున్న తండ్రి శివలింగ ఏప్రిల్ 14న పథకం ప్రకారం కుమార్తెను బెదిరించి దర్శన్‌కు ఫోన్ చేసి రప్పించారు. అనంతరం తీవ్రంగా కొట్టారు. చికిత్స కోసం బెంగళూరు తరలిస్తుండగా అతను మృతి చెందాడు. ఈ కేసులో తండ్రి శివలింగతో పాటు తల్లి అనురాధ, మరో 17 మందిని పోలీసులు జైలుకు పంపించారు. ఈ క్రమంలో మాన్వితను అధికారులు బాల మందిరంలో ఉంచారు. అప్పటి నుంచి తీవ్ర మనోవేదనలో ఉన్న అమ్మాయి తన ప్రియుని సమాధిని చూపించాలని గొడవ చేసేది. మంగళవారం తెల్లవారుజామున తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
విషాదం: మనవరాలిని ఎత్తుకుని మిద్దెపై బట్టలు ఆరవేస్తుండగా..
క్రిష్ణగిరి(కర్ణాటక): క్రిష్ణగిరి సమీపంలో జరిగిన కరెంటు షాక్‌తో తల్లీ కూతురు, మనవరాలు ఘటనా స్థలంలోనే మృతి చెందిన ఘటన సింగారపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. అంబేడ్కర్ నగర్‌కు చెందిన పిచ్చుమణి భార్య ఇంద్ర (52), ఆమె కూతురు మహాలక్ష్మి (25). ఈమెకు మిట్టపల్లికి చెందిన శివతో గత నాలుగేళ్ల క్రితం పెళ్లి జరిగి మూడేళ్ల కూతురుంది. ఇటీవల పుట్టింటికి చేరుకుంది. ఆదివారం సాయంత్రం ఇంద్ర మనవరాలిని ఎత్తుకుని మిద్దెపై బట్టలు ఆరవేస్తుండగా ఆకస్మాత్తుగా వైర్లు తగిలి కరెంటు షాక్ కొట్టింది. ఆమె కేకలు వేయడంతో కూతురు మిద్దెపైకెళ్లి రక్షించే యత్నంలో ముగ్గురికీ షాక్ తగిలి ఘటనా స్థలంలోనే మృతి చెందారు. సింగారపేట పోలీసులు మృతదేహాలను స్వాధీనపరుచుకొని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన సింగారపేట ప్రాంతంలో సంచలనం సృష్టించింది. -
పెళ్లి కాకుండానే గర్భం.. బిడ్డను కిటికీలోంచి విసిరేసి..
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): అక్రమ సంబంధంతో గర్భం దాల్చిన అవివాహిత ప్రైవేట్ క్లినిక్‌లో బిడ్డకు జన్మనిచ్చి పురిటిబిడ్డను శౌచాలయం కిటికీలోంచి విసిరేసిన సంఘటన బెంగళూరు ఉత్తర తాలూకా హెసరఘట్టలో చోటుచేసుకుంది. హెసరఘట్టకు చెందిన మహిళ (22) అక్రమ సంబంధం కారణంగా గర్భం దాల్చింది. నెలలు నిండడంతో ప్రైవేటు ఆస్పత్రికి వచ్చి దాఖలయింది. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఆమె పురిటిబిడ్డను శౌచాలయంలోని కిటికీలోంచి విసిరేసి పరారైంది. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన హాస్పిటల్ సిబ్బంది మాదనాయకనహళ్లి పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఆమెను గుర్తించి అరెస్టు చేసి అనంతరం చికిత్స కోసం లక్ష్మివిలాస్ ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన నవజాత శిశువు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. ఆమె గర్భం దాల్చడానికి కారణమైన గుడేమారనహళ్లికి చెందిన శశాంక్ (25) అనే వ్యక్తిని అరెస్టు చేసారు. ఇద్దరిపై కేసులు నమోదు చేశారు. -
రుణ బాగోతం.. ఏం జరిగిందో తెలియాలి..
యశవంతపుర: నటుడు దర్శన్‌పై ప్రముఖ నిర్మాత– దర్శకుడు ఇంద్రజిత్ లంకేశ్ యుద్ధానికి నాంది పలికారు. దర్శన్ పేరుతో నకిలీ పత్రాలతో రూ.25 కోట్ల అప్పు తీసుకోవడానికి కొందరు యత్నించడంపై ఏం జరిగిందో కూపీ లాగాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు హోంమంత్రి బసవరాజ బొమ్మైకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పూర్తి విచారణ జరపాలని మైసూరు పోలీసు కమిషనర్‌ను ఆదేశించినట్లు హోంమంత్రి గురువారం బెంగళూరులో తెలిపారు. ఈ కేసులో నిర్మాత ఇంద్రజిత్ లంకేశ్ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణ చేస్తారన్నారు. అంత త్వరగా రాజీనా: లంకేశ్.. మైసూరులో సందేశ్ ప్రిన్స్ హోటల్లో సప్లయర్‌పై నటుడు దర్శన్ దాడి చేశారని, అతని కంటికి గాయమైందని నిర్మాత ఇంద్రజిత్ లంకేశ్ ఆరోపించారు. అతనికి రూ.50 వేలు ఇచ్చి రాజీ అయ్యారన్నారు. కాగా రూ.25 కోట్ల లోన్ కేసులో ఆరోపణలున్న అరుణకుమారిని దర్శన్ ఫాంహౌస్‌కు ఎందుకు పిలిచారు. అంత త్వరగా ఎందుకు రాజీ అయ్యారని ఇంద్రజిత్ ప్రశ్నించారు. వీటన్నింటిపై విచారణ చేయాలని హోంమంత్రికి ఫిర్యాదు చేశానన్నారు. కాగా, గతంలో శాండల్‌వుడ్ డ్రగ్స్ కేసులో కూడా లంకేశ్ అనేకమందిపై ఆరోపణలు చేయడం, సీఐడీ విచారణకు వెళ్లడం తెలిసిందే. అదృశ్య శక్తుల పని: దర్శన్.. ఈ వ్యవహారాలపై దర్శన్ స్పందిస్తూ, హోటల్లో గలాటా జరగడం నిజమే, అయితే సప్లయర్‌పై దాడి చేయలేదని, ఇంద్రజిత్ ఆరోపణలు సరికాదని అన్నారు. ఇక లోన్ విషయంలో కొన్ని అదృశ్య శక్తులు పని చేశాయని ఆరోపించారు. హోటల్లో దర్శన్ గొడవ నిజమే మైసూరు: మైసూరులోని తమ ప్రిన్స్ హోటల్లో నటుడు దర్శన్ గొడవ చేయడం నిజమే. నేనే పిలిచి మందలించానని నిర్మాత సందేష్‌నాగరాజు కుమారుడు సందేష్ చెప్పారు. గురువారం ఆయన హోటల్ వద్ద మీడియాతో మాట్లాడారు. దర్శన్ సుమారు 20 మంది స్నేహితులతో సుమారు నెలరోజుల కింద రాత్రి 11 గంటలప్పుడు వచ్చారు. మా వెయిటర్‌తో గొడవ పడ్డారు, కానీ అతన్ని కొట్టలేదు. నేను వెళ్లి సర్దిచెప్పా అని తెలిపారు. -
ఎవరినీ వదలను: ది బాస్ హెచ్చరిక..
మైసూరు(కర్ణాటక): సినిమాల్లో వీరోచిత సాహసాలతో విలన్లను మట్టికరిపించే ప్రముఖ నటుడు దర్శన్ నిజ జీవితంలో మోసగాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. వారు సాదాసీదా చీటర్లు కాదు ఏకంగా రూ.25 కోట్లకు ఎసరు పెట్టారు. ఆదివారం బయటపడిన ఈ బాగోతంపై సోమవారం దర్శన్ ఘాటుగా స్పందించారు. నా ఆస్తులకు నకిలీ పత్రాలు సృష్టించి బ్యాంకుల నుంచి రూ. 25 కోట్లను పొందాలని చూసి, నాపై కుట్ర చేసినవారు ఎంతటి సన్నిహితులైనా వదిలిపెట్టేది లేదు. చట్టపరంగా పోరాడుతా అని ప్రకటించారు. తెరపై ఆ మహిళ.. మైసూరులో మీడియా సమావేశంలో దర్శన్ మాట్లాడారు. వివరాలు.... జూన్ 6వ తేదిన నా మిత్రుడు, కన్నడ సినిమా నిర్మాత ఉమాపతి నాకు ఫోన్ చేసి రూ.25 కోట్ల బ్యాంకు రుణానికి మీరు ష్యూరిటీ సంతకం చేశారా? అని అడిగారు. నేను అయోమయానికి గురయ్యాను. ఏం జరిగిందని ఉమాపతిని అడగ్గా ఏమీ చెప్పలేదు. జూన్ 16వ తేదీన అరుణాకుమారి అనే మహిళను నిర్మాత ఉమాపతి నా ఇంటికి తీసుకొచ్చారు. ఆమె నా స్నేహితుల పేర్లను చెబుతూ కొన్ని దాఖలాలు చూపించారు. అందులో నా ఆధార్ నంబర్ తప్ప ఇంకేమీ లేదు. నేను పుట్టిన ప్రాంతం, జిల్లా పేరును ఆమె చెప్పగా అనుమానం పెరిగింది. నేను ఆమె ముందే నాగు, హర్ష అనే నా మిత్రులకు కాల్ చేసి లోన్‌కు దరఖాస్తు పెట్టారా అని అడిగా, లేదు అని చెప్పారు. మరోసారి అరుణతో నందీష్, మదుకేష్ అనే ఇద్దరు వ్యక్తులు నా ఇంటికి వచ్చారు. లోన్ ఇవ్వడానికి ముందు మీ తోటను చూడాలని అడగ్గా, సరే అన్నాను. నా తరఫున లోన్ కోసం హర్ష రికార్డులు ఇచ్చారని అరుణ చెప్పారు. చివరకు నా స్నేహితులందరినీ ఆరా తీయగా ఎవరూ రుణం కోసం దరఖాస్తు చేయలేదని తెలిపారు. అరుణపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశా... అని ది బాస్ వివరించారు. సూత్రధారులు, పాత్రధారుల గురించి పోలీసుల విచారణలో బయటికి వస్తుందని దర్శన్ అన్నారు. డీసీపీతో భేటీ.. నకిలీ పత్రాలను తయారుచేసిన వంచకులు వాటిని దర్శన్ స్నేహితులకు చూపి మాట వినకపోతే దుష్ప్రచారం చేస్తామని బెదిరించినట్లు తెలిసింది. దర్శన్, ఉమాపతి తదితరులు మైసూరు డీసీపీ ప్రదీప్ గుంటిని కలిసి ఫిర్యాదు చేశారు. మైసూరు హెబ్బాల పోలీసులు అరుణాకుమారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. -
కామాంధుడు.. ఆసుపత్రి గదిలోకి చొరబడి...
మైసూరు(కర్ణాటక): మతిస్థిమితం లేని యువతి (30)పై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన మైసూరు కేఆర్ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. వివరాలు... శుక్రవారం రాత్రి ఆస్పత్రి కిటికీ గ్రిల్స్ విరగ్గొట్టి గదిలోకి చొరబడిన కామాంధుడు అనారోగ్యంతో చికిత్స పొందుతున్న నిస్సహాయ యువతిపై లైంగికదాడికి పాల్పడి పారిపోయాడు. విషయాన్ని ఆమె బంధువులు వైద్యుల దృష్టికి తీసుకువచ్చినా ఆస్పత్రికి చెడ్డపేరు వస్తుందని దాచిపెట్టాలని యత్నించారని వారు తెలిపారు. మానవ హక్కుల సేవా సమితి సభ్యులు విషయం తెలుసుకుని వైద్యులను ప్రశ్నించగా సమాధానం చెప్పలేదు. ఎక్కడా బయట చెప్పొద్దని ఆస్పత్రి సిబ్బందిని వైద్యులు బెదిరించినట్లు ఆరోపించారు. ఈ ఘటనతో అక్కడే విధుల్లో ఉన్న భద్రతా సిబ్బంది పారిపోయారు. -
వింత సంప్రదాయం: కొబ్బరికాయలను తలపై కొడతారు
కెలమంగలం(కర్ణాటక): డెంకణీకోట తాలూకా జే.కారుపల్లి పంచాయతీ పరిధిలోని వెంకటాపురం గ్రామంలో మల్లేశ్వరస్వామికి ప్రత్యేక పూజలను నిర్వహించి తలపై కొబ్బరికాయలను కొట్టించుకొన్నారు. ప్రతి 9 ఏళ్లకొకసారి ఈ సంప్రదాయం పాటిస్తారు. వెంకటాపురం, గంగసంద్రం, పాపిరెడ్డిపాళ్యం తదితర గ్రామాల నుంచి 500 మంది భక్తులు ఏమాత్రం భీతి లేకుండా తలపై కొబ్బరికాయలు కొట్టించుకొని మొక్కులు తీర్చుకొన్నారు. పెద్దఎత్తున ప్రజలు పాల్గొని భక్తుల విన్యాసాలను తిలకించారు. -
Karnataka: సీఎం కావాలని ఉంది: ఉపేంద్ర
యశవంతపుర: కరోనా సమయంలో నటుడు ఉపేంద్రకు ముఖ్యమంత్రి కావాలనే కోరిక పుట్టింది. ఈ సందర్భంగా ఆయన ఓ లేఖను ప్రజలకు రాశారు. ఆ లేఖ తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు. ‘నాకు సీఎం కావాలని ఉంది, ఎన్నికల్లో పోటీ చేస్తే గెలిపిస్తారా’ అంటూ లేఖ రాశారు. తాను రాజకీయాల్లోకి వస్తే నిరంతరం ప్రజా సేవలోనే ఉంటానని పేర్కొన్నారు. సీఎం (కామన్ మ్యాన్) అనే పదానికి సరైన నిర్వచనం ఇస్తానని చెప్పారు. ఖర్చు చేసే ప్రతి పైసాకు జవాబుదారీగా ఉంటానన్నారు. ప్రజల నిర్ణయమే తన నిర్ణయమని ఆ లేఖలో ఉప్పి పేర్కొన్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. తెలుగులో హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న ‘గని’ చిత్రంలో ఉపేంద్ర అతిధి పాత్రలో నటించనున్నట్లు సమాచారం. వరుణ్ తండ్రి పాత్రలో ఉపేంద్ర నటించబోతున్నట్లు టాక్ Upendra CM of Karnataka? pic.twitter.com/OkgPfgm9ab— Upendra (@nimmaupendra) May 22, 2021 -
దారుణం: భర్త మెడపై కాలితో తొక్కి..
శివాజీనగర: భర్తను భార్య హత్య చేసిన దుర్ఘటన జే.జే.నగరలో తెల్లవారజామున జరిగింది. మోహన్ (41) హత్యకు గురైన వ్యక్తి. ఇతని భార్య పద్మ (37) నిందితురాలు. ఇద్దరూ బీబీఎంపీ పారిశుధ్య కార్మికులుగా పనిచేస్తుండేవారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆదివారం రాత్రి మోహన్ మద్యం తాగి ఇంటికి వచ్చాడు. ఈ సమయంలో ఇంట్లో పిల్లలు లేరు. దంపతుల మధ్య పెద్ద ఎత్తున గొడవ జరిగింది. మత్తులో ఉన్న మోహన్ కిందపడిపోగా భార్య అతని మెడపై తొక్కింది. స్పృహ తప్పి పడిపోవడంతో ఇరుగుపొరుగు సహాయంతో సమీపంలో ఆసుపత్రిలో తీసుకెళ్తుండగా చనిపోయాడు. పరారైన పద్మను జేజే నగర పోలీసులు గాలించి అరెస్ట్ చేశారు. చదవండి: విజయవాడ: అయ్యో.. తల్లీ ఎంతపని చేశావు! హోంగార్డు భార్య మృతి కేసులో ట్విస్ట్ -
మళ్లీ కరోనా భయం: సౌతాఫ్రికా స్ట్రెయిన్ కలకలం
సాక్షి బళ్లారి: రాష్ట్రంలోకి సౌతాఫ్రికా స్ట్రెయిన్ వైరస్ అడుగు పెట్టడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. ఇన్నాళ్లూ విలయతాండవం చేసిన కరోనా తగ్గుముఖం పట్టిందని ఊరట చెందుతున్న నేపథ్యంలో కొత్త రకం వైరస్ ప్రబలడంతో ప్రజలు హడలెత్తిపోతున్నారు. వివరాలు...గత నెల 17న దుబాయ్ నుంచి బెంగళూరుకు చేరుకున్న అన్నాచెల్లెలికి ఎయిర్‌పోర్ట్‌లో వైద్య పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. బళ్లారికి చేరుకున్న ఇద్దరికీ గతనెల 20న జ్వర లక్షణాలు కనిపించడంతో మళ్లీ వైద్య పరీక్షలు నిర్వహించారు. రక్తనమూనాలను బెంగళూరు నిమ్హాన్స్ ఆస్పత్రిలోని ప్రయోగశాలకు పంపించగా సౌతాఫ్రికా స్ట్రెయిన్ కరోనా సోకినట్లు ధ్రువపడినట్లు జిల్లా అధికారులు విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కాన్నారు. బాధితులను బళ్లారిలోని ట్రామాకేర్ సెంటర్లో చికిత్స అందించి హోం క్వారంటైన్లో ఉంచారు. శివమొగ్గలో సౌతాఫ్రికా స్ట్రెయిన్ కేసులు లేవు శివమొగ్గ: దుబాయ్‌కు వెళ్లి వచ్చిన శివమొగ్గకు చెందిన 53 సంవత్సరాల వయసున్న వ్యక్తికి సౌతాఫ్రికా స్ట్రెయిన్ లేదని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి. కే.ఎస్. ఈశ్వరప్ప తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మెగ్గాన్ అస్పత్రికి వెళ్లి విచారించగా దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తికి ఎలాంటి కరోనా లేదని, వైద్య పరీక్షల్లో ఆయనకు నెగిటివ్ వచ్చినట్లు వైద్యులు తెలిపారన్నారు. అతన్ని కలిసిన 39 మందికి కూడా కరోనా పరీక్షలు నిర్వహించగా వారికి కూడా నెగిటివ్ వచ్చిందన్నారు. కాగా శివమొగ్గ జిల్లా అరోగ్య,శాఖ ఆధికారి డాక్టర్ రాజేష్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చదవండి: పుణేలో కోవిడ్ ఆంక్షలు కరోనా విజృంభణ.. మార్చి 31 వరకు స్కూల్స్ బంద్!