కన్నడ నాట కాంగ్రెస్ అత్యథిక మెజార్టీతో గెలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఆయా కార్యాలయాల్లో సంబరాలు చేసుకుంటూ సందడిగా కనిపిస్తున్నారు. ఈ మేరకు తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ దీనిపై స్పందిస్తూ..ఈ ఘన విజయానికి సంతృప్తి చెందాల్సిన సమయం కాదన్నారు. ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రజలకు తగిన ఫలితం అందించాల్సిన తరుణం అని నాయకులుకు గుర్తు చేశారు. అలాగే కన్నడ నాట గెలిచిన తన కాంగ్రెస్ సహచరులను చూసి తాను గర్వపడుతున్నానని చెప్పారు. ఇది వేడుకలకు సమయమే కానీ ఆత్మసంతృప్తికి మాత్రం కాదని అన్నారు.
ఎందుకంటే మనం గెలిచేందుకు చేసిన కృషికి తగిన ఫలితం పొందాం. అంతకంటే ముందు మన గెలుపుకి కారణమైన కర్ణాట ప్రజలకు తగిన ఫలితాలను అందించాల్సిన సమయం కూడా ఇది అని ఎంపీ శశి థరూర్ ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా..కర్ణాటకలో హంగ్ అసెంబ్లీ ఉంటుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలను చాలా వరకు నిజం చేస్తూ.. అనూహ్యంగా 224 సభ్యుల అసెంబ్లీలో కాంగ్రెస్ 136 స్థానాల్లో గెలిపోంది, విజయ డుండిభి మోగించడమే గాక సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉంది.
ప్రస్తుతం కర్ణాటకలో సీఎం రేసులో సిద్ధ రామయ్య, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డీ కే శివకుమార్ ఇద్దరూ ఉన్నందున అందరి దృష్టి ముఖ్యమంత్రి పదవికి సంబంధించిన కీలక నిర్ణయంపైనే ఉంది. కాగా కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తొలి కేబినేట్ సమావేశంలో హామీలను నెరవేర్చడంపైనే కర్ణాటక కాంగ్రెస్ దృష్టిసారిస్తుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment