కొబ్బరికాయలు కొట్టించుకొంటున్న భక్తులు
కెలమంగలం(కర్ణాటక): డెంకణీకోట తాలూకా జే.కారుపల్లి పంచాయతీ పరిధిలోని వెంకటాపురం గ్రామంలో మల్లేశ్వరస్వామికి ప్రత్యేక పూజలను నిర్వహించి తలపై కొబ్బరికాయలను కొట్టించుకొన్నారు. ప్రతి 9 ఏళ్లకొకసారి ఈ సంప్రదాయం పాటిస్తారు. వెంకటాపురం, గంగసంద్రం, పాపిరెడ్డిపాళ్యం తదితర గ్రామాల నుంచి 500 మంది భక్తులు ఏమాత్రం భీతి లేకుండా తలపై కొబ్బరికాయలు కొట్టించుకొని మొక్కులు తీర్చుకొన్నారు. పెద్దఎత్తున ప్రజలు పాల్గొని భక్తుల విన్యాసాలను తిలకించారు.
Comments
Please login to add a commentAdd a comment