heads
-
బొరుసు పడుంటే ఆమె బతికి ఉండేదేమో!
మనిషిలోని ‘మృగం’ మేల్కొంటే.. ఎంతటి దారుణానికైనా తెగిస్తుంది. ముఖ్యంగా లైంగిక దాడుల విషయంలో మరీ ఘోరాలను నిత్యం చూస్తూనే ఉన్నాం. అయితే ఇక్కడో కేసులో నిందితుడు నేరానికి పాల్పడిన తీరు, కారణం విని.. న్యాయమూర్తితో సహా అందరినీ విస్తుపోయేలా చేశాయి. 18 ఏళ్ల ఓ యువతి నైట్‌క్లబ్‌లో తన స్నేహితులతో పార్టీ ముగించుకుని బస్సులో ఇంటికి వెళ్తోంది. ఆ టైంలో ఓ కుర్రాడి కళ్లు ఆమె మీద పడ్డాయి. హ్యాండ్సమ్గా ఉండడంతో ఆమె కూడా అతనితో మాటలు కలిపింది. అర్ధరాత్రి దాటడంతో.. తన ఇంటికి రావాలంటూ ఆమెను ఆహ్వానించాడు. అయితే అమాయకంగా అతని వెంట వెళ్లడం ఆమె పాలిట శాపమైంది.కొన్నిరోజుల తర్వాత.. ఓ ప్లాస్టిక్ బ్యాగులో ఆమె శవంగా కనిపించింది. శవపరీక్షలో.. ఆమెను ఊపిరి ఆడకుండా చేసి చంపినట్లు తేలింది. అంతేకాదు ఆమెపై అఘాయిత్యం జరిగినట్లు నిర్ధారణ అయ్యింది. మృతురాలి ఐడెంటిటీని మిస్సింగ్ కేసు ద్వారా పోల్చుకున్నారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపిన పోలీసులు.. చివరకు ఆ రాత్రి ఆమెను తన ఇంటికి తీసుకెళ్లి మరీ బలిగొన్న యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు. కేసు విచారణలో భాగంగా నిందితుడ్ని జనవరి 8వ తేదీన పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. జడ్జి ముందు నేరం అంగీకరిస్తూ అతను చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి.. ‘‘మా పరిచయం బస్సులో జరిగింది. కాసేపు ఇద్దరం మాటలు కలిపాం. ఇంటికి వెళ్తావా? నాతో వస్తావా? అని ఆమెను అడిగా. ఆమె నాతో రావడానికి ఇష్టపడింది. నా ఇంట్లో ఏం మాట్లాడకుండా ఇద్దరం ఎదురెదురుగా కూర్చున్నాం. ఉన్నట్లుండి ఆమె పడుకుని పోయింది... నాకేం చేయాలో పాలుపోలేదు. ఆమెను నిద్ర లేపేందుకు యత్నించా. కానీ, ఆమె లేవలేదు. నా చేతిలో ఉన్న కాయిన్‌ను ఎగరేశా. బొమ్మ పడితే చంపేయాలి అనుకున్నా. బొరుసు పడితే ప్రాణాలతో వదిలేయాలనుకున్నా. ఆమె దురదృష్టం.. బొమ్మ పడింది. అందుకే ఆమెను చంపేశా. అలా ఎందుకు చేశానో నాకు తెలియదు. అది అలా జరిగిపోయిందంతే..!.. నిర్ణయాలు తీసుకోవడం కష్టమనిపించినప్పుడల్లా నేను అలా కాయిన్ ఎగరేస్తుంటా. ఆరోజూ అలానే చేశా. బొమ్మ పడ్డాక.. ఆమె ఛాతీపై కూర్చుకున్నా. నా రూంలోని నైలాన్ తాడును ఆమె పీకకు వేసి నలిపేయడం ప్రారంభించా. ఊపిరాడక ఆమె విలవిలలాడింది. తిరిగి పోరాడలేని శక్తి ఆమెది. అప్పటికే ఆలస్యమై ఆమె ప్రాణం పోయింది. రక్తం చుక్క పడకుండా ఆమెను చంపాలని అనుకున్నా.. అలాగే చేశా. .. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్నాక.. ఆమె దుస్తులు తొలగించి అనుభవించా. ఆపై మళ్లీ దుస్తులు తొడిగి ఓ బ్యాగ్‌లో ఆమె శవాన్ని పార్శిల్ చేశా. ఒక దుప్పట్లో చుట్టేసి తగలేయాలని అనుకున్నా. కానీ, ఎందుకనో అలా చేయలేకపోయా!. అందుకే ఆ రాత్రి బయట పారేసి వచ్చా. ఆమెను చంపేశాక ఎందుకనో హాయిగా అనిపించింది. ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నా. కానీ, నా వెంటనే ఆ నిర్ణయం మార్చుకున్నా’’ అని నిందితుడు జడ్జి ముందు ఒప్పుకున్నాడు.కేసు విచారణ పూర్తయ్యాక.. బయటకు వస్తున్న నిందితుడిని తిడుతూ.. దాడికి మృతురాలి స్నేహితులు ప్రయత్నించారు. అయితే.. పోలీసులు వాళ్లను అడ్డుకుని నిందితుడ్ని అక్కడి నుంచి తరలించారు. ఫిబ్రవరి 12వ తేదీన ఈ కేసు తదుపరి విచారణ జరగనుంది. ఆ విచారణలోనే అతనికి జీవిత ఖైదు పడే అవకాశం ఉంది.పోలాండ్(Poland) నగరం కటోవీస్‌లో 2023లో జరిగిన దారుణ ఘటన ఇది. నిందితుడి పేరు మెటాయుజ్ హెపా(20). బాధితురాలి పేరు విక్టోరియా కోజిఎలెస్కా(18). దాదాపు నేరం జరిగిన ఏడాది తర్వాత నిందితుడు పోలీసులకు చిక్కాడు. గ్లివిస్ కోర్టు ఫిబ్రవరిలో నిందితుడికి శిక్ష ఖరారు చేయనుంది. ప్రస్తుతం ఈ కేసు అక్కడ చర్చనీయాంశమైంది. -
Madhya Pradesh: ‘పాంచ్’ పంచ్.. ఐదోసారి అధికారం దిశగా బీజేపీ
భోపాల్: మధ్యప్రదేశ్‌లో స్పష్టమైన మెజార్టీతో అధికారం దిశగా బీజేపీ పయనిస్తోంది. 230 స్థానాలున్న రాష్ట్ర అసెంబ్లీలో కాషాయ పార్టీ 160పైగా నియోజకవర్గాలలో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇప్పటికే నాలుగు పర్యాయాలు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పని చేసిన శివరాజ్ సింగ్ చౌహాన్ ఐదోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారా లేక మరో వ్యక్తిని పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రిని చేస్తుందా అన్నది చూడాలి. నాలుగుసార్లు సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్‌కి ఇప్పటికే నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. మొదటిసారిగా 2005లో మొదటి సారిగా సీఎం అయ్యారు. ఆ తర్వాత 2008లో వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. 2013లో మరోసారి గెలిచి బీజేపీ శివరాజ్ సింగ్ చౌహాన్‌ను మూడోసారి సీఎంగా చేసింది. 2018 ఎన్నికల్లో మాత్రం బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. 109 సీట్లకే ఆ పార్టీ పరిమితమైంది. ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ రాకపోయినప్పటికీ 114 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్ పార్టీ, ఇతర పార్టీలు, స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ పార్టీ సీనియర్ నేత కమల్‌నాథ్ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే 2020లో ఆ పార్టీ సీనియర్ జ్యోతిరాదిత్య సింధియా సహా 22 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారడంతో కమల్‌నాథ్ ప్రభుత్వం పడిపోయింది. దీంతో శివరాజ్ సింగ్ చౌహాన్ నాలుగో సారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం చౌహాన్ బంపర్ మెజార్టీ మధ్యప్రదేశ్ 2023 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దూసుకెళ్తున్నారు. తన నియోజకవర్గం బుధ్నిలో 1,04,974 భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. శివరాజ్ సింగ్ చౌహాన్‌కు మొత్తం 1,64,951 ఓట్లు వచ్చాయి. -
రెండు వేల గొర్రె తలలను ప్రసాదంగా ఉంచారట!
కుక్కలు, మేకలు, ఆవులు, గజెల్స్, ముంగిసలు మమ్మీలుగా ఉండటం గురించి వినలేదు కదా!. కానీ అమెరికా పురావస్తు శాస్త్రజ్ఞులు ఈజిప్టులో వాటిని కూడా మమ్మీలుగా ఉంచినట్లు గుర్తించారు. జంతువుల మమ్మీలను అమెరికా పురావస్తు బృందం దక్షిన ఈజిప్టులోని అబిడోస్ నుంచి వెలికితీసింది. అక్కడ దేవాలయాల వద్ద జంతువుల మమ్మీల సమాధులకు ప్రసిద్ధి. కీ.పూ 1304 నుంచి 1237 వరకు దాదాపు ఏడు దశాబ్దాల పాటు ఫారో రామ్సేస్2 అనే రాజు ఈజిప్టుని పాలించాడట. దీంతో ఆయన మరణాంతరం ఆయనకో దేవాలయాన్ని కట్టారు. అయితే ఆయన మరణించిన వెయ్యేళ్లకు గుర్తుగా ఆయన ఆరాధనలో గొర్రె తలలను అర్పించేవారట. అంటే వేల గొర్రెలను శిరచ్ఛేదనం చేసి ఆయనకు నైవేద్యంగా పెట్టేవారని పురావస్తు శాఖ సుప్రీం కౌన్సిల్ మోస్తఫా వాజిరి తెలిపారు. క్రీ.పూర్వం 2374 నుంచి214 మధ్య కాలం రామ్సెస్ 2 ఆలయానికి సంబంధించిన కార్యకలాపాలు, నిర్మాణాలు గురించి తెలుస్తాయని వెల్లడించారు. అంతేగాదు ఈ ప్రదేశంలో మమ్మీగా చేయబడిన జంతు అవశేషాల తోపాటు దాదాపు 4 వేల ఏళ్లక్రితం నాటి ఐదు మీటర్ల మందం గోడలతో కూడిన ప్యాలెస్ అవశేషాలను కూడా కనుగొన్నారు. అక్కడ అనేక విగ్రహాలు, పురాతన చెట్ల అవశేషాలు, తోలు బట్టలు, బూట్లను గుర్తించారు. కైరో నదికి దక్షిణంగా నైలు నిదిపై దాదాపు 270 మైళ్ల దూరంలో ఈ అబిడోస్ ఉంది. ఇక్కడ సేటీ 1 వాటి శవపేటికల ఆలయాలకు ప్రసిద్ధి చెందింది. కైరోలో ఎప్పుడూ ఇలాంటి కొత్తకొత్త ఆవిష్కరణలు వెలుగులోకి వస్తుండటం విశేషం. దాదాపు 105 మిలియన్ల మంది నివాసం ఉండే ఈజిప్టు ఆర్థిక సంక్షోబంలో చిక్కుకుంది. అంతేగాదు అక్కడ సుమారు 10 శాతం జీపీడీ పర్యాటకంపైనే ఆధారపడి ఉంది. పైగా ఇది సుమారు రెండు మిలియన్ల మందికి ఉపాధి కల్పిస్తోంది. అయితే కైరో కరోనా మహమ్మారికి ముందు సుమారు 13 మిలియనల మందిని లక్ష్యంగా చేసుకుంటే 2028 నాటికి సుమారు 30 మిలియన్ల మంది టార్గెట్‌గా పెట్టుకుని పర్యాటకాన్ని పునరుద్ధరించాలని భావిస్తోంది. (చదవండి: ఎదురెదురుగా రెండు విమానాలు.. త్రుటిలో తప్పిన ప్రమాదం) -
రావణుడి తలలు దహనం కాలేదని షోకాజ్ నోటీసులు, గుమస్తాపై వేటు
చత్తీస్‌గఢ్: దసరా వేడుకల్లో చివరి రోజైన విజయదశమి నాడు రావణ దహనం నిర్వహించడం సర్వసాధారణం. అయితే, చత్తీస్‌గఢ్‌లోని ధామ్తరిలో మాత్రం రావణ దహనం కార్యక్రమం వైరల్‌గా మారింది. ఎందుకంటే రావణుడి పదితలలు కాలలేదు. కేవలం దిష్టిబొమ్మ కింద భాగం అంత బూడిదైపోయింది. దీంతో ఈ ఘటనపై ధామ్‌తరీ పౌర సంఘం సీరియస్ అయ్యి ఒక గుమస్తాని సస్పెండ్ చేసి కొంతమంది అధికారులకు షోకాజ్‌నోటీసులు కూడా జారీ చేసింది. ఈ మేరకు అక్టోబర్5న ధామ్తరిలో రామ్‌లీలా మైదాన్‌లో రాక్షసరాజు రావణుడి దహనం చేస్తున్నప్పుడూ ఈ వింత ఘటన చోటుచేసుకుంది. అయితే, ఈ వేడుకల్లో రావణ దిష్టిబొమ్మ దహనాన్ని పర్యవేక్షిస్తోంది స్థానిక పౌరసంఘం. అంతేగాదు ధామ్తరి మున్సిపల్ కార్పొరేషన్ (డీఎంసీ) గుమస్తా రాజేంద్ర యాదవ్ రావణ దిష్టిబొమ్మ రూపొందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ సీరియస్ అయ్యి విధుల నుంచి బహిష్కరించింది. పైగా యాదవ్ రావణ దిష్టి బొమ్మను తయారుచేయడంలో మున్సిపల్ కార్పోరేషన్ ప్రతిష్టను కించపరిచేలా నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ మండిపడింది. అంతేగాదు ఆయన స్థానంలో సమర్థ రాణాసింగ్ అనే వ్యక్తిని నియమించినట్లు డీఎంసీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాజేష్ పద్మవర్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి నలుగురు అధికారులు అసిస్టెంట్ ఇంజనీర్ విజయ్ మెహ్రా, సబ్ ఇంజనీర్లు లోమస్ దేవాంగన్, కమలేష్ ఠాకూర్, కమతా నాగేంద్రలపై డీఎంసీ షోకాజ్‌నోటీసులు జారీ చేసింది. దిష్టి బొమ్మను తయారు చేసే బాధ్యతలను అప్పగించిన వారిపై కూడా చర్యలు తీసుకుంటున్నామని, వారి వేతనాల చెల్లింపులు కూడా నిలిపేస్తున్నామని ధామ్తరి మేయర్ విజయ దేవగన్ అన్నారు. (చదవండి: గేదెలు ఢీకొట్టడంతో దెబ్బతిన్న వందే భారత్ రైలు.. 24 గంటల్లోనే రిపేర్) -
రెండు తలలతో జన్మించిన పిల్లి.. మురిసిపోతున్న యజమాని!
బ్యాంకాక్: ఇదేమిటో తెలుసా? పిల్లి కూన. అయితే అల్లాటప్పా కూన కాదు. ఏకంగా రెండు తలలతో పుట్టిన కూన! ఇలా పుట్టినవి సాధారణంగా కొన్ని గంటల కంటే బతకవు. కానీ ఆదివారం థాయ్‌లాండ్‌లో పుట్టిన ఈ కూన మాత్రం భేషుగ్గా బతికేసింది. పైగా రెండు మూతులతోనూ పాలు తాగేస్తోందంటూ యజమాని మురిసిపోతున్నాడు. దీనికి టుంగ్ గ్రెన్ (వెండి బ్యాగు), టుంగ్ టోంగ్ (బంగారు బ్యాగు) అని ఏకంగా రెండు పేర్లు కూడా పెట్టుకున్నాడు. ఒక్కో తలకు ఒక్కో పేరన్నమాట! దీని తల్లి ముందుగా ఒక మామూలు కూనను కనింది. తర్వాత రెండో కాన్పు కష్టంగా మారడంతో హుటాహుటిన స్థానిక పశువుల ఆస్పత్రికి తీసుకెళ్లారట. వాళ్లు సిజేరియన్ చేసి ఈ అరుదైన రెండు తలల కూనను విజయవంతంగా బయటికి తీశారు. దాంతో యజమాని ఆనందంలో మునిగిపోయాడు. ‘‘చనిపోతుందేమోనని ముందుగా భయపడ్డా. అలాంటిదేమీ జరక్కపోవడంతో నా ఆనందం రెట్టింపైంది’’ అని చెప్పుకొచ్చాడు. రెండు తలల పిల్లుల్ని రెండు తలల రోమన్ దేవత జానస్ పేరిట జానస్ క్యాట్స్ అని పిలుస్తారు. ఫ్రాంక్ అండ్ లూయీదే గిన్నిస్ రికార్డు ఏకంగా 15 ఏళ్లు బతికిన రెండు తలల పిల్లి ఇది! దీని పేరు ఫ్రాంక్ అండ్ లూయీ. 1999లో అమెరికాలోని మసాచుసెట్స్‌లో పుట్టింది. అత్యధిక కాలం బతికిన జానస్ క్యాట్‌గా 2012లోనే ఇది గిన్నిస్ బుక్కులోకి ఎక్కింది. అన్నట్టూ, ఇది మూడు కళ్లతో పుట్టడం విశేషం. ఇదీ చదవండి: ఆ పిల్లి... కోలుకుంటోంది! -
బాప్రే!... రెండు తలలు ఉన్న బల్లిని చూశారా!!
రెండు తలల పాములను చూసి ఉంటాం. అంతేందుకు అవిభక్త కవలలు అంటూ మనుషులను కూడా చూసి ఉంటారు. అయితే రెండు తలలు బల్లులను ఎప్పుడైన చూశారా. అంతేకాదు అవి ఉంటాయని కూడా అనుకోరు. అసలు విషయంలోకెళ్లితే...ఇక్కడొక రెండు తలలతో చాలా వింతగా కూడా ఉంది. పైగా దాని నాలుక నీలి రంగులో ఉంటుందట. చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదూ!. అయితే దీనికి సంబంధిన వీడియో ఒకటి నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది. లక్షల్లో వ్యూస్, లైక్‌లు వస్తున్నాయి. మీరు కూడా ఓ లుక్ వేయండి. (చదవండి: గతేడాది చనిపోతే!... ఇప్పుడు మృత దేహాలను ఇచ్చారు!!) View this post on Instagram A post shared by Jay Brewer (@jayprehistoricpets) -
వింత సంప్రదాయం: కొబ్బరికాయలను తలపై కొడతారు
కెలమంగలం(కర్ణాటక): డెంకణీకోట తాలూకా జే.కారుపల్లి పంచాయతీ పరిధిలోని వెంకటాపురం గ్రామంలో మల్లేశ్వరస్వామికి ప్రత్యేక పూజలను నిర్వహించి తలపై కొబ్బరికాయలను కొట్టించుకొన్నారు. ప్రతి 9 ఏళ్లకొకసారి ఈ సంప్రదాయం పాటిస్తారు. వెంకటాపురం, గంగసంద్రం, పాపిరెడ్డిపాళ్యం తదితర గ్రామాల నుంచి 500 మంది భక్తులు ఏమాత్రం భీతి లేకుండా తలపై కొబ్బరికాయలు కొట్టించుకొని మొక్కులు తీర్చుకొన్నారు. పెద్దఎత్తున ప్రజలు పాల్గొని భక్తుల విన్యాసాలను తిలకించారు. -
రెండు తలలు, మూడు చేతుల శిశువు
భోపాల్ : మధ్యప్రదేశ్‌లోని విదిశలో అరుదైన సంఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ రెండు తలలు, మూడు చేతులు ఉన్న బాబుకు జన్మనిచ్చింది. వివరాల్లోకి వెళితే.. విదిశ జిల్లాలోని గంజ్బసోడకు చెందిన 21 ఏళ్ల బబితకు ఏడాదిన్నర క్రితం వివాహమైంది. ఆమె తన తొలి కాన్పు కోసం ఆస్పత్రిలో చేరారు. అయితే అక్కడ ఆమె రెండు తలలు ఉన్న బాబుకు జన్మనిచ్చారు. ప్రస్తుతం తల్లి, బిడ్డలను ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. రెండు తలలు ఉన్నప్పటికీ.. ఆ బాబుకు ఒకటే గుండె ఉన్నట్టు విదిశ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఈ విధంగా పిల్లలు జన్మించడం అరుదైన ఘటన అని వైద్యులు పేర్కొన్నారు. అండాలు విడిపోకపోవడం వల్ల ఇలా జరుగుతుందని వైద్యులు తెలిపారు. కాగా, ఇలాంటి సంఘటనే 2016లో భోపాల్‌లో చోటుచేసుకుంది. రెండు తలలు, నాలుగు చేతులతో ఓ బాలుడు జన్మించాడు. -
నిక్కరు
కొంకణీ మూలం : వశంత్ భగవంత్ సావంత్ అనువాదం: శిష్టా జగన్నాథరావు రాత్రవుతున్న కొద్దీ అతిథులు రావడం కూడా పెరుగుతోంది. బయట కొరికేసే చలి. జాతరకొచ్చిన జనం గుంపులు గుంపులుగా చట్టాపట్టాలేసుకు తిరుగుతున్నారు. చాలామంది మండపంలో గుమిగూడి జాతరలో దేవుడి వస్తువుల వేలం త్వరగా పూర్తవ్వాలని హడావుడి చేస్తున్నారు. కేశవ్ మామ టీకొట్టు ఎదురుగా ఉన్న స్తంభానికి ఆనుకుని నేను ఎవరైనా నా స్కూలు మిత్రులు కనిపిస్తారేమోనని ఎదురు చూస్తూ నిలుచున్నాను. జాతర ఆఖరి రోజవడం వలన ఊళ్లో వాళ్లంతా మూకుమ్మడిగా వచ్చారు. నాకెంతో ఇష్టమైన ఈ జాతర ఏడాదికొకసారి వస్తుంది. ఈ ఏడాది మాత్రం నా ఉత్సాహం ఎండిపోయింది మనస్సులోనే. కారణం ఈసారి అమ్మ నన్ను కేశవ్ మామ జాతరలో పెట్టిన టీ దుకాణంలో ఉంచి, ఆయనకి సహాయం చేయమని పురమాయించింది. నిజం చెప్పాలంటే ఈ కేశవ్ మామని చూస్తేనే నాకు చిరాకేసేది. ఈ జాతర మూడు రాత్రులు మమ్మల్ని గద్దలా పొడిచి, పొడిచి చంపుకుతిన్నాడు. చలికి వణుకుతున్న జనం, ఆ వణుకు తగ్గడానికని చాయ్ కోసం మా కొట్టులో జమవుతున్నారు. అందువల్ల మాకు బొత్తిగా విశ్రాంతి లోపించింది. కేశవ్ మామ టీకొట్టులో పనిచేసే భట్టీవాడు, టీ ఇచ్చే సర్వరు ఇద్దరూ మామని చాటుగా నానాబూతులు తిట్టేవారు. అయితే ఆయన ముందు మాత్రం పల్లెత్తుమాట అనకుండా అడ్డమైన చాకిరీ చేసేవారు. మూడు రాత్రులు నిద్రలేకుండా పనిచేయడం వలన నా కళ్లు గుడ్లగూబ కళ్లల్లా అయ్యాయి. రెండు కాళ్లు పీకుతున్నాయి. ఎప్పుడు కాస్త నడుంవాల్చి విశ్రాంతి తీసుకోగలుగుతానా అని ఎదురుచూస్తున్నాను. ‘‘డిగూ.. ఒరేయ్ డిగూ.. లోపల ఆ ఖాళీ గ్లాసులెవరు తీస్తార్రా? మీ నాన్న వస్తాడ్రా కడగడానికి? గొప్పగా షావుకార్లా నిల్చున్నావు ఆ కొయ్యపట్టుకుని. నడు... తొరగారా లోపలికి. ఆ గ్లాసులు కడుగు.. ముందు ఆ ప్లేట్లు చూడు’’.మావ నా మీద ఇంకా శాపనార్థాలు కురిపించేలోగా, ఆయన రుసరుసలని లక్ష్యపెట్టక నేను వెనకదారిలో వచ్చి గ్లాసులు కడగసాగాను. మూడు రాత్రులు రెండు గ్లాసులు బద్దలుకొట్టానని, నేను అప్పటికే రెండు తన్నులు తిన్నాను. నాకు పూర్తిగా విసిగెత్తింది.అన్ని గ్లాసులు, ప్లేట్లు, చెంచాలు అక్కడే విసిరేసి హాయిగా జాతరలోకి పోయి మండపంలో స్నేహితులతో కూర్చుని పిచ్చాపాటి మాటల్తో, చక్కగా నాటకం చూడాలని మనసు ఉవ్విళ్లూరింది. కానీ ఏం చేస్తాను? అమ్మ నన్ను కోప్పడుతుందని భయమేసి, ఆ ఆలోచన వదులుకొన్నాను.ప్రతి ఏడాదీ ఇలాగే కేశవ్ మావ జాతరలో టీకొట్టు పెడతాడు. కానీ నాకు ఈసారే తెలిసింది. అతను నాకు మావని. అతని వ్యాపారమే అదిట. వివిధ జాతర్లలో తిరగడం. ఏ ఊళ్లో ఏ జాతర జరిగినా అక్కడ మావ టీ హోటలు డేరా వెలుస్తుంది. ఈ హడావిడిలో పనితొందర్లో ఎప్పుడూ ఆయనకి, తన చెల్లెల్ని (అంటే మా అమ్మని) చూడడానికి వీలవలేదట. కానీ ఈ సారి మాత్రం జాతర ప్రారంభం అవడానికి ముందురోజే మా ఇంటికి వచ్చాడు. ఆయన నా మావ అనీ, జాతరలో దుకాణం పెడ్తున్నాడనీ విని, ఆశ్చర్యం ఆనందాలతో ఈ విషయం నా తోటి మిత్రులకి చెప్పడానికి నేను వాడలోకి పరిగెత్తాను.నేను తిరిగి, తిరిగి ఇంటికి చేరిన తర్వాత కేశవ్ మావ గుడికి వెళ్తానని చెప్పి బయటకి వస్తున్నాడు. మావ తెచ్చి ఇచ్చిన పిప్పరమెంట్ల పొట్లం నాకు ఇస్తూ అమ్మ ఇలా అంది – ‘‘డిగూ, మావ నీకు లాగు కుట్టించుకోడానికి కొత్త బట్ట ఇస్తానన్నాడు’’.‘‘నిజంగానా?’’ అని నేను నా వెనక చిరిగిన లాగు తడుముకుంటూ అన్నాను. ‘‘అవును, నిజం. కానీ నువ్వు ఆయనకో పని చెయ్యాలట.’’‘‘ఎటువంటి పని?’’ నేను ఉత్సాహంతో ఊరటతో అడిగాను.‘‘మావ చాయ్ కొట్టులో ఇద్దరు పనివాళ్లు ఆరోగ్యం బాగులేనందువల్ల రాలేదట. అందుకని జాతర ఉన్న మూడు రోజులు నువ్వు అతనికి సహాయంగా ఆ టీకొట్టులో పనిచేయాలి’’ అమ్మ నన్ను బుజ్జగిస్తూ చెప్పింది.‘‘వద్దు.. వద్దు.. నేను ఎంచక్కా జాతరలో తిరగాలి మిత్రులతో కలిసి!’’‘‘ఇదిగో విను – నువ్వు తెలివైన నా బంగారు కొడుకువి కదూ, ఈ మధ్య నీకు నేను కొత్త బట్టలు కుట్టించలేకపోయాను. నీ ముడ్డి దగ్గర చిరిగిన పట్లంతో జాతరలో తిరుగుతావా ముష్ఠివాడిలా? నీ మిత్రులునవ్వరా నిన్ను చూసి? అయినా జాతరలో ఏముందిరా, ప్రతీ ఏడాది వస్తూనే ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఆ దుకాణంలో పనిచేస్తే, ఎంచక్కా నీకు కొత్త లాగు వస్తుంది.’’అమ్మకి ఎలా నచ్చజెప్పాలో నాకు తెలియలేదు. చివరికి ఒప్పుకున్నాను. నా జుత్తుని వేళ్లతో ప్రేమగా నిమురుతూ అమ్మ అంది – ‘‘ఇదిగో చూడు, నువ్వు మావ దుకాణానికి వెళ్లు. నేను చెప్పాను మీ మావకి నువ్వు వస్తావని. పని కాస్త వొళ్లు దగ్గర పెట్టుకుని చెయ్యి. నీ మావ కాస్త కోపిష్ఠి. అతనికి సహనం తక్కువ. నీ మీద ఏ కారణం వల్లనైనా విరుచుకుపడితే నిరాశపడకు. ఈ జాతర్లలో రాత్రిళ్లు ఎప్పుడూ జాగరణ చెయ్యడం వలన అతనిలో శక్తి, సహనం పోయాయి.’’ నేను సరేనని అన్నట్లు తల ఆడించాను. అమ్మ మళ్లీ అంది – ‘‘నీకు తెలియదురా. నీ మావకి ఎన్నో పనులు అడ్డమైన వ్యవహారాల్లోనూ తల దూరుస్తాడు. ఇక్కడి వస్తువులు అక్కడికీ, అక్కడివి ఇక్కడికీ వాణ్ని వంచించడం, వీణ్ని కాళ్లు పట్టుకుని వేసుకోవడం ఇటువంటి తిమ్మిని బమ్మిని చేసే వక్రబుద్ది వాడిది. డబ్బే వాడి దైవం. డబ్బు ముందు మనవాళ్లు, పరాయివాళ్లు అని అంతరం చూపడు. ఎవర్నీ లెక్కచెయ్యడు. ఇన్నేళ్లుగా జాతరలో దుకాణం పెడుతున్నాడు అయినా ఒక్కసారీ, ఈ ఊరికి వచ్చినప్పుడు వాడికి నన్ను చూడాలని తోచలేదు. మనింటికి రాలేదు. ఈసారి మాత్రం వచ్చాడు. ఎందుకనీ? పనివాళ్లు తక్కువైనందువల్ల. నిన్ను మేనల్లుడిని ఆ మురికిపనిలో దింపడానికి.’’అమ్మ కళ్లంబడి అశ్రువులు వచ్చాయి. అప్పుడామె చెప్పిన మాటలు నాకు సరిగ్గా అర్థమవలేదు. కానీ రెండు రాత్రులు కేశవ్మావ టీ కొట్టులో కొట్టుమిట్టాడాక ఆ త్రాస్టుడి కుటిల స్వభావం బాగా తెలిసింది. టీ ఒకసారి చేసాక, మళ్లీ అదే పొడితో మళ్లీ మళ్లీ టీ చేయమని వంటవాడికి ముందే పురమాయించి వాడు మరచినప్పుడు, మండిపడి కోప్పడేవాడు. శేరు పాలల్లో మరో శేరు నీళ్లు కలిపేవాడు. ఆ టీలో రుచిపచీ లేదు. ఒట్టి వేడినీళ్లు. కొద్దిగా పంచదార ఎక్కువ పడితే ఆ వంటవాడి ముడ్డిమీద పడిందనుకో దెబ్బ! జనం గోలచేసేవారు. కానీ మావ వాళ్లేమన్నా పళ్లు ఇకిలిస్తూ నవ్వేవాడు. ఏమాత్రం లజ్జ లేకుండా! జాతరలో మరెవ్వరి చాయ్ దుకాణం లేనందువల్ల మావ కొట్టులోనే జనాలు ఉండేవారు. మావ మానవత్వం ఇసుమంతైనా చూపించకుండా తన వ్యాపారం కొనసాగించేవాడు. అతని కుటిల స్వభావం, కుత్సిత బుద్ధి, పాడు పనులు చూశాక అతనంటే నాకు ఏహ్యభావం కలిగేది. అతన్ని చూడాలంటేనే అసహ్యం వేసేది. హోటల్లో గిరాకీదారులుండగా, అందరి ముందు మావని తూర్పారబెట్టి, అవమానం చేసి ఆ పని విడిచిపెట్టి పారిపోవాలని నాకు క్షణక్షణం అనిపించేది. కానీ అమ్మ ప్రేమతో చెప్పిన మాటలు గుర్తుకువచ్చి, ఆ ఆలోచనకీ, నా కాళ్లకి బంధాలు తగిలేవి.గ్లాసులు, సాసర్లు కడుగుతూ ఉండగా, నా చెవుల్లో బయట జాతరలో లౌడ్‌స్పీకర్ మీద దేవుడి వస్తువుల వేలంపాట వినపడుతోంది. ‘‘ఆఖరి బేరం.. దేవుడి చరణాల మీద పూల దండ.. ఇరవై ఒక్క రూపాయలు... మూడవసారి....’’ వేలం పాట ముగియగానే, ఆ వేలంపాట పాడినవాడు ఉస్సూరుమని నిట్టూర్చాడు. పెద్ద కార్యం పూరై్తందని. కానీ నాకూ ఆ వంటవాడికీ, టీనీళ్లు గిరాకులకి ఇచ్చే పనివాడికీ మాత్రం విశ్రాంతి లేదు. హఠాత్తుగా దుకాణంలో రద్దీ తగ్గింది. నాటకం ప్రారంభమవుతుందని తెలిసి పరుగుపరుగున డబ్బులు గల్లా మీద విసిరేసి వెళ్లిపోయారు. గడియారంలో టైమ్ చూసి మావకి ఒళ్లుమండింది. మావ మండిపడ్డం చూసి నిజం చెప్పాలంటే నాకు భలే భలే అనిపించింది. ఈ మనిషి ఇలాగే జీవితాంతం ఏడుస్తూ చావాలని మనసులోనే శాపనార్థాలు పెట్టాను. వంటవాడు చక్కటి, చిక్కటి టీ నాకోసమని చేసి మావ చూడకుండా గ్లాసు నా చేతికిచ్చి తాగమని రహస్యంగా సంజ్ఞ చేశాడు.మావ గల్లాపెట్టెలో నోట్లు లెక్కపెడుతున్నాడు. నేను ఒక కుర్చీలో కూర్చుని నోట్లు లెక్కపెట్టడం చూస్తున్నాను. తడి చేసిన నాలికని వేలుతో మధ్య మధ్య తాకుతూ, ఏకాగ్రదృష్టితో అతి జాగ్రత్తతో లెక్కపెడుతున్నాడు. అలా లెక్కపెడుతూ తలెత్తి నన్ను చూసి హఠాత్తుగా కోపంతో కేకలేశాడు – ‘‘నువ్వేం చేస్తున్నావురా? నడు, త్వరగా ఆ ఎంగిలి గ్లాసులన్నీ కడుగు. సర్ది పెట్టు. లెక్కపెట్టు ఎన్ని విరిగాయో, ఎన్ని మిగిలాయో’’.నేను అన్ని గ్లాసులు, సాసర్లు కడిగాను. వాటిని సర్దిపెట్టి, భట్టీ దగ్గరకెళ్లి చలితో కొంకర్లుపోయిన చేతుల్ని వెచ్చచేసుకోసాగాను. చేతుల్లో కరెన్సీనోట్లు మరోసారి లెక్కపెట్టి మావ నన్ను పిలిచాడు. నాకనిపించింది. ఇప్పుడు మావ నాకు ప్యాంట్ కుట్టించుకోవడానికి బట్టకోసం డబ్బులు ఇస్తాడని. నేను గల్లాపెట్టె దగ్గర చేరగానే మావ అన్నాడు – ‘‘నువ్వు కాస్త ఈ గల్లాపెట్టె దగ్గర కూర్చో కాసేపు’’ అని. నన్ను అక్కడ కూర్చోబెట్టి, లోపల ఉంచిన ట్రంక్‌పెట్టె తెరిచి డబ్బులు పెట్టసాగాడు. నేను గల్లాపెట్టె దగ్గర కూర్చుంటే, నాకు ఏనుగెక్కినంత ఆనందమైంది. నేను ఇలా కూర్చునుండగా నా మిత్రులెవరైనా చూస్తే బాగుంటుందని సంబరపడ్డాను. కానీ కళ్లకెవరూ కనిపించలేదు.మావ నోట్లన్నీ తీసుకెళ్లాక, గల్లా పెట్టెలో చాలా చిల్లర మిగిలింది. ఎంత చిల్లరంటే, నేను ఎప్పుడూ దేవాలయంలో దేవుడి ముందు పళ్లెంలో కూడా చూడలేదు. అంత చిల్లర! నేనా చిల్లరలో నా చెయ్యి పెట్టి, కెలుకుతూ చప్పుడు చేశాను. ఆ చప్పుడు విని నా ఒళ్లు ఝల్లుమంది. నేను నా దోసిట్లో వచ్చినంత చిల్లర తీసుకుని పైకెత్తి గడగడలాడించి, మళ్లీ లోపల పడేశాను. మూడు రాత్రుల జాగరణ ఉండి ఆ హోటల్లో చేసిన పని అలసట ఆ చప్పుడుతో అదృశ్యమైపోయినట్లు నాకనిపించింది. నాటకం మొదటి అంకం పూర్తవగానే నలుగురైదుగురు వ్యక్తులు టీ తాగడానికి దుకాణంలోకి వచ్చారు. వాళ్లు టీ తాగాక, నేను హుందాగా బెల్లు వాయించి బిల్లు ఎంతైందని పనివాణ్ని అడిగాను. వాళ్లిచ్చిన నోటు తీసుకుని బాకీ చిల్లర తిరిగి ఇచ్చాను.లోపటి నుంచి మావ అరిచాడు – ‘‘సరిగ్గా బిల్లు వసూలుచేశావట్రా?’’ అని.‘‘హా.. చేశాను’’ నేనూ గంభీరంగా జవాబిచ్చాను.‘‘సీతారామ్..’’ వంటవాడిని ఉద్దేశించి మావ గట్టిగా అన్నాడు. ‘‘రేపు, ఎల్లుండీ కామర్ఖండ్ జాతరకి వెళ్తున్నాం. నాటకం మూడవ భాగం పూర్తవగానే సామాన్లు అన్నీ సర్దేసి, మూటలు కట్టి, ఆతర్వాతే పడుకోవాలి. తెల్లవారుజామున పికప్ వ్యాన్ వస్తుంది. డేరా ఎత్తేసి వెంటనే వెళ్లిపోవాలి. వింటున్నావా?’’సీతారాం.. అవును అనలేదు, కాదు అనలేదు.మావ చిన్న మేజామీద లెక్కలు రాసుకుంటున్నాడు. నేను పావలా కాసులు, అర్ధరూపాయి బిళ్లలూ ఏరి ఒకదానిమీద ఒకటి పేర్చి నిటారుగా అమర్చాను. నేను గల్లాపెట్టె దగ్గర కూర్చుని ఉండడం చూసిననా క్లాసు మిత్రులిద్దరు నా ముందరికి వచ్చి నన్ను పలకరించారు. నేను వాళ్లని చూసి హుందాగా అడిగాను, ‘‘టీ తాగుతార్రా?’’. వాళ్లు తాగుతామని తల ఊపుతూ సూచించారు. ‘‘సీతారాం, ఇక్కడ రెండు చక్కటి, చిక్కటి టీలు తీసుకురా’’ అని నేను హుందాగా, దర్జాగా ఆర్డర్ ఇస్తూ బల్ల మీద బెల్లు వాయించడానికి చేయి చాపితే, ఆ చెయ్యి తగిలి నిలువుగా పేర్చిన నాణేలన్నీ ఖంగున నేలమీద పడిపోయాయి. ఇంతవరకూ నా చేతలు చూడని మావ వెంటనే లేచి పరుగున వచ్చి చిల్లరంతా ఏరి గల్లాపెట్టెలో వేశాడు. నన్ను ఓ మూలకి తీసుకెళ్లి నా జేబులన్నీ జాగ్రత్తగా వెతికి, నా చెవి మెలేసి అన్నాడు కోపంగా.. ‘‘మీ అబ్బ సొమ్మనుకున్నావురా ఇది? డబ్బుల దగ్గర ఆటలాడుతావు? కాస్త గల్లాపెట్టె దగ్గర కూర్చోగానే డబ్బు నిషా ఎక్కింది కదూ? చాలు చాలు.. పక్కకి తప్పుకో’’. మావ నన్ను తోసేసి, మూలకి గెంటాడు. నా మిత్రులు నారాయణ, బీకు బెదిరిపోయి బయటకెళ్లిపోయారు. నా ఒళ్లు మండిపోయింది కోపంతో. ఒక కుర్చీ ఎత్తి మావ నెత్తిమీద గట్టిగా పడేసి, రక్తం కారేలా చూడాలని క్షణంసేపు అనిపించింది.‘‘నా లాగు బట్టకోసం డబ్బులియ్యి’’ కోపం పట్టలేక గట్టిగా అన్నాను.‘‘ఆ.. డబ్బులా? రేపొద్దున్న మీ అమ్మకి ఇస్తాను’’ మావ తాపీగా అన్నాడు.‘‘రేపు వద్దు.. నాకు ఇవాళే ఇప్పుడే కావాలి.’’‘‘ఇప్పుడే కావాలా? సరే ఇప్పుడే నీ చెవి మెలేసి ఓ లెంపకాయ ఇస్తాను’’ అలా అంటూనే మావ నాకో లెంపకాయ ఇచ్చాడు. జాగరణతో నిద్రలోపించిన నా కళ్లల్లో హఠాత్తుగా చీకట్లు చిమ్మాయి. ఆ దెబ్బతో నేను పరిగెత్తి నాటకం ఆడుతున్న మండపంలోకి వచ్చిపడ్డాను. నాటకం చూస్తూ, చూస్తునే నిద్రపోయాను. ఎప్పుడు నాటకం పూర్తయిందో ఎవరికి తెలుసు! అమ్మ నన్ను తట్టి లేపినప్పుడు కళ్లు తెరిచాను. మధ్యాహ్నం అయ్యింది. నాలాగే నలుగురైదుగురు కుర్రాళ్లు మండపంలో పడుకొని ఉన్నారు.‘‘మావ నీకు నిక్కరు బట్టకోసం డబ్బులిచ్చాడ్రా?’’ అమ్మ ప్రేమతో నిమురుతూ చెవిలో అడిగింది. ‘‘లేదమ్మా! నీకు ఇస్తానన్నాడమ్మా. నీకూ ఇవ్వలేదన్నమాట!’’ నేనన్నాను.అమ్మ ఇవ్వలేదని తలాడించింది.నేను మావ టీ దుకాణంవైపు చూశాను. సామాన్లన్నీ తీసుకుని మావ ఎప్పుడెళ్లిపోయాడో ఎవరికి తెలుసు? డేరా – బురా ఏం లేదక్కడ. పిడకలతో, బొగ్గులతో నిండిన ఒక భట్టీ మాత్రం వదిలేసివుంది, అక్కడ ఒక దుకాణం ఉండేదన్న గుర్తుగా. మరే విధమైన గుర్తులేదు.‘‘మావ పెద్ద మోసగాడు’’ నేను ఏడుపు గొంతుకతో అన్నాను.‘‘వాడి పని గొడవలో నీ సంగతి బహుశా మరచిపోయి ఉంటాడు’’ అంటూ నడవసాగింది అమ్మ. మావ చాయ్ దుకాణం పెట్టిన స్థలంవైపు కన్నెత్తి కూడా మళ్లీ చూడకుండా నా చిరిగిన లాగు మీద చిరుగుని అరచేతితో కప్పుకుంటూ నేనూ అమ్మవెంబడే ఇంటివైపు నడవసాగాను. -
తలనీలాలు సమర్పిస్తున్న జయ అభిమానులు
-
వచ్చే వారం నుంచి ‘నీతి’ షురూ!
త్వరలో వైస్ చైర్మన్, సభ్యుల నియామకం యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు న్యూఢిల్లీ: ప్రణాళికా సంఘం స్థానంలో నూతనంగా ఏర్పాటు చేసిన వ్యవస్థ ‘నీతి (నేషనల్ ఇనిస్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా) ఆయోగ్’ వచ్చే వారం నుంచి కార్యకలాపాలను ప్రారంభించే అవకాశం ఉంది. ఈ మేరకు అధికారులు, సిబ్బంది యుద్ధప్రాతిపాదికన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని నేతృత్వంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లతో ‘నీతి ఆయోగ్’ వ్యవస్థను గురువారం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇది జరిగిన కొద్దిగంటల్లోనే.. ఇప్పటివరకు ప్రణాళికా సంఘం కొనసాగిన ఢిల్లీలోని సంసద్ మార్గ్‌లో ఉన్న యోజన భవన్ వద్ద బోర్డుపై పేరును ‘నీతి ఆయోగ్’గా మార్చారు. ఇందులో నియామకం కాబోయే అధికారులకు అనుగుణంగా గదులను, కార్యాలయాలను సిద్ధం చేస్తున్నారు. నీతి ఆయోగ్‌కు త్వరలోనే వైస్ చైర్మన్, సభ్యులను నియమించనున్న నేపథ్యంలో... వారికి ఘనంగా స్వాగతం పలికేందుకు సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి తొలి వైఎస్ చైర్మన్‌గా ప్రముఖ ఆర్థిక వేత్త అరవింద్ పనగారియాను నియమించనున్నట్లుగా వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు ఐదుగురు శాశ్వత సభ్యుల నియామకం త్వరలోనే జరుగనుందని.. వారంతా వచ్చేవారం విధుల్లో చేరే అవకాశముందని కేంద్ర అధికార వర్గాల సమాచారం.