smashed
-
ఇదిగో కూజా..!
ఇదేమిటో గుర్తు పట్టారా? దాదాపు మూడు వారాల క్రితం ఇజ్రాయెల్‌లోని హెక్ట్ మ్యూజియంలో ఏరియల్ గెలర్ అనే నాలుగేళ్ల చిన్నారి పొరపాటున తాకడంతో కింద పడి ముక్కలైపోయిన 3,500 ఏళ్ల నాటి అరుదైన కూజా ఇది. పట్టి చూస్తే తప్ప పగిలిన ఆనవాళ్లు కని్పంచకుండా రిస్టొరేషన్ నిపుణుడు రో షెఫర్ సారథ్యంలోని బృందం దాన్ని అత్యంత నైపుణ్యంతో ఇలా తిరిగి అతికించింది. బుధవారం నుంచి కూజాను మ్యూజియంలో మళ్లీ ప్రదర్శనకు ఉంచారు. ఇంతటి అరుదైన కూజా పగిలిపోయినా మ్యూజియం సిబ్బంది హుందాగా స్పందించిన తీరు అందరి మనసులూ గెలుచుకుంది. బాలున్ని గానీ, అతని తల్లిదండ్రులను గానీ వాళ్లు ఏమాత్రమూ నిందించలేదు. పైగా ‘పిల్లలన్నాక ఇలా చేస్తుంటారు, మరేం పర్లే’దంటూ ఊరడించారు. జరిమానా చెల్లిస్తామన్నా అలాంటిదేమీ అక్కర్లేదన్నారు. మ్యూజియం చీఫ్ దగ్గరుండి మరీ వారికి మ్యూజియం అంతా తిప్పి చూపించారు. గిల్టీ ఫీలింగ్ నడుమ సరిగా చూశారో లేదోనని పది రోజులు పోయాక మరోసారి మ్యూజియం సందర్శనకు ఆహా్వనించారు. ఆ సందర్భంగా చిన్నారి గెలర్ ఒక మట్టి కూజా తీసుకెళ్లి బహూకరించడంతో సిబ్బంది తెగ ఆనందపడిపోయారు. బాలునితో చాలాసేపు గడపడమే గాక పగిలిన కూజాలను ఎలా అతికిస్తారో ప్రత్యక్షంగా చూపించారు. ‘‘పురాతత్వ వస్తువులను తాకి చూస్తే వాటిపై అనురక్తి కలుగుతుంది. వాటిని తాకి చూస్తే చరిత్ర, పురాతత్వ శా్రస్తాల పట్ల పిల్లల లేత మనసుల్లో గొప్ప ఆస్తకి పుట్టవచ్చు. ఎవరికి తెలుసు?! అందుకే అవి సందర్శకులకు చేతికందే సమీపంలోనే ఉండాలి తప్ప అద్దాల అరల్లో కాదన్నదే ఇప్పటికీ మా అభిప్రాయం’’ అని మ్యూజియం చీఫ్ చెప్పుకొచ్చారు. అందుకు తగ్గట్టుగానే అతికించిన కూజాను రక్షణ వలయం వంటివేవీ లేకుండా తాజాగా మళ్లీ సందర్శకులకు అందుబాటులోనే ఉంచడం విశేషం! -
కర్కశత్వం: పార్కింగ్ వివాదం...ఇటుకతో కొట్టి చంపేశాడు
న్యూఢిల్లీ: కారు పార్కింగ్ విషయంతో తలెత్తిన వివాదం హత్యకు దారి తీసింది. ఈ ఘటన ఘజియాబాద్‌లో చోటుచేసుకుంది. బాధితుడు వరణ్ రోడ్డు వద్ద ఉండే తినుబండారాలకు సమీపంలో తన కారుని పక్కగా ఆపాడు. ఐతే వరుణ్ పార్కింగ్ వద్ద నిందితుడి కారు కూడా ఉంది. వరుణ్ అక్కడే పార్కింగ్ చేయడం వల్ల కారు డోర్లు ఓపెన్ చేయడం కుదరదు. దీంతో సదరు వ్యక్తి కోపంతో వరుణ్‌తో పార్కింగ్ విషయమై గొడవపడ్డాడు. ఆ వాగ్వాదం కాస్త ఘర్ణణకు దారితీసింది. దీంతో నిందితుడు కోపంతో ఇటుకతో వరుణ్ తలను పగలుగొట్టి చంపి పారిపోయాడు. అందుకు సంబంధించిన ఘటనను ఒక పాదాచారి రికార్డు చేయడంతో వెలుగు చూసింది. దీంతో పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితుడు తండ్రి రిటైర్డ్ పోలీస్ అధికారి అని, వరుణ్ డైరీ బిజినెస్ చేస్తుంటాడని చెబుతున్నారు పోలీసులు. అంతేగాదు అదే సమయంలో బాధితుడి స్నేహితుడు దీపక్ కూడా అక్కడే ఉన్నట్లు పేర్కొన్నారు. ఇంత దారుణంగా శత్రువులను కూడా హతమార్చరంటూ బాధితుడి స్నేహితుడు దీపక్ కన్నీటి పర్యంతమయ్యాడు. పోలీసులు ఐదు బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. (చదవండి: అన్నదమ్ములిద్దరూ ఇద్దరే!...ఒకరు కిడ్నాప్, మరోకరు అఘాయిత్యాలు) -
రూ.3.14 కోట్ల మద్యం బాటిళ్లు ధ్వంసం.. రోడ్డు రోలర్‌తో తొక్కించి
సాక్షి, నెల్లూరు: మద్యం అక్రమరవాణా, అనధికార విక్రయాలను పూర్తిస్థాయిలో కట్టడి చేయడమే లక్ష్యంగా సెబ్, పోలీసు అధికారులు దాడులు చేశారు. మూడు సంవత్సరాల్లో రూ.3.14 కోట్ల అక్రమ మద్యాన్ని స్వా«దీనం చేసుకుని వందలాది మందిని కటకటాల వెనక్కి పంపారు. వరుస దాడులతో అక్రమ రవాణా తగ్గుముఖం పడుతోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మద్యం అక్రమ రవాణా, అనధికార విక్రయాలు, చట్టవ్యతిరేక కార్యకలాపాలను కట్టడి చేసేందుకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను ఏర్పాటు చేసింది. జిల్లా పోలీçసు బాస్‌ల పర్యవేక్షణలో సెబ్ అధికారులు, స్థానిక పోలీసులు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. ప్రజల భాగస్వామ్యంతో నిఘా వ్యవస్థను పటిష్టం చేశారు. అక్రమ రవాణాకు అనుకూలంగా ఉండే ప్రాంతాల్లో కాపు కాసి దాడులు చేస్తున్నారు. కార్లు, బస్సులు, కంటైనర్లు, ఇతర వాహనాల్లో తరలిస్తున్న పొరుగు మద్యంతోపాటు డ్యూటీ పెయిడ్ లిక్కర్‌ను స్వా«దీనం చేసుకుని నిందితులను కటకటాల వెనక్కి పంపుతున్నారు. పక్కాగా.. మూడేళ్ల కాలంలో జిల్లా వ్యాప్తంగా సెబ్, పోలీసులు 2,744 కేసులు నమోదు చేసి (ఎన్డీపీఎల్, డీపీఎల్) రూ 3,14,37,980 విలువ చేసే 74,547 మద్యం బాటిళ్ల (15,719 లీటర్ల)ను స్వా«దీనం చేసుకున్నారు. ఎస్పీ సీహెచ్ విజయారావు పర్యవేక్షణలో సెబ్ జాయింట్ డైరెక్టర్ కె.శ్రీలక్ష్మి పూర్తిస్థాయిలో అక్రమ మద్యం కట్టడికి చర్యలు తీసుకున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో నిఘాను పెంచి వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. పాత నేరస్తులను బైండోవర్ చేయడంతోపాటు పదేపదే నేరాలకు పాల్పడే వారిపై పీడీ యాక్ట్‌లు ప్రయోగిస్తున్నారు. వరుస దాడులు, సెబ్, పోలీసు అధికారుల చర్యలతో అక్రమార్కుల వెన్నులో వణుకు మొదలవడంతోపాటు అక్రమ రవాణా, అనధికార విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. మాకివ్వండి సారూ.. పట్టుబడిన మద్యంను ధ్వంసం చేసేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. ఎస్పీ సీహెచ్ విజయారావు పర్యవేక్షణలో సెబ్ అధికారులు మంగళవారం కొత్తూరు టాస్‌్కఫోర్స్ కార్యాలయ ప్రాంగణంలో మద్యం బాటిళ్లను రోడ్డురోలర్లతో తొక్కించారు. దీంతో ఆ ప్రాంతమంతా మద్య ప్రవాహంతో నిండిపోయింది. మద్యం బాటిళ్లను చేస్తున్నారన్న ధ్వంసం చేస్తున్నారన్న విషయం తెలుసుకున్న స్థానికులు, మందుబాబులు పెద్దఎత్తున ఘటనా స్థలానికి చేరుకున్నారు. రోడ్డురోలర్లతో తొక్కించే బదులుగా తమకివ్వండి సారూ.. కొందరు అక్కడ విధుల్లో ఉన్న సెబ్, పోలీసు సిబ్బందిని బతిమిలాడారు. వారు నిరాకరించడంతో వెళ్లిపోయారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
రాళ్లు తేలిన రహదారి
అగనంపూడి: జీవీఎంసీ 86వ వార్డు కూర్మన్నపాలెం నుంచి రాజీవ్‌నగర్ కూడలి మీదుగా కుసుమ హరనాథ ఆశ్రమం మార్గంలోని రహదారి అధ్వానంగా ఉంది. రాళ్లు తేలి ప్రయాణికులకు ప్రాణ సంకటంగా మారింది. పదేళ్లుగా ఇదే దుస్థితి ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని వుడా ఫేజ్–1 కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 1988లో వుడా ఫేజ్–1 కాలనీ ఏర్పాటయింది. అప్పట్లో నిర్మించిన రహదారి పూర్తిగా రాళ్లు తేలి, ధ్వంసమైంది. రెండు దశాబ్దాలుగా ఈ మార్గంలో వాహనాల రద్దీ పెరిగినా రోడ్డు విస్తరణ, మరమ్మతుల విషయంలో అధికారులు చొరవ తీసుకోలేదు. మరో వైపు రాజీవ్‌నగర్ నుంచి కూర్మన్నపాలెం వైపు వెళ్లే వాహనాలు, కూర్మన్నపాలెం నుంచి దువ్వాడ రైల్వేస్టేషన్‌కు వెళ్లే వాహనాలను కూడా ఈ మార్గంలోకి మళ్లించారు. అలాగే కుసుమ హరనాథ ఆశ్రమానికి నిత్యం వందలాది భక్తులు వచ్చి వెళ్తారు. రోడ్డు విషయమై కుసుమ హరనాథ్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా స్పందించలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపాదనలకే పరిమితం అసోసియేషన్ దరఖాస్తులను పరిశీలించిన జీవీఎంసీ ఏడాదిన్నర క్రితం అంచనాలను రూపొందించింది. కానీ రహదారి నిర్మాణ పనులు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే రీతిలో ఉండడంతో కాలనీవాసులు, ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీవీఎంసీ మేయర్, కమిషనర్ స్పందించి చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరుతున్నారు. -
నుజ్జు నుజ్జు అయిన కారు
-
వింత సంప్రదాయం: కొబ్బరికాయలను తలపై కొడతారు
కెలమంగలం(కర్ణాటక): డెంకణీకోట తాలూకా జే.కారుపల్లి పంచాయతీ పరిధిలోని వెంకటాపురం గ్రామంలో మల్లేశ్వరస్వామికి ప్రత్యేక పూజలను నిర్వహించి తలపై కొబ్బరికాయలను కొట్టించుకొన్నారు. ప్రతి 9 ఏళ్లకొకసారి ఈ సంప్రదాయం పాటిస్తారు. వెంకటాపురం, గంగసంద్రం, పాపిరెడ్డిపాళ్యం తదితర గ్రామాల నుంచి 500 మంది భక్తులు ఏమాత్రం భీతి లేకుండా తలపై కొబ్బరికాయలు కొట్టించుకొని మొక్కులు తీర్చుకొన్నారు. పెద్దఎత్తున ప్రజలు పాల్గొని భక్తుల విన్యాసాలను తిలకించారు. -
'మీరిచ్చే ఆఫర్ ఆరేళ్ల పిల్లాడికి బాగుంటుంది'
ఆస్టిన్ : ఆస్టిన్ నుంచి లాస్ ఏంజిల్స్ వెళ్లడానికి పాట్రిక్ కాసిడీ అనే వ్యక్తి బుధవారం డెల్టా ఎయిర్‌లైన్స్ ఎక్కాడు. కాసిడీ తన సీటులో కూర్చుని ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి పని చేసుకుంటున్నాడు. ఇంతలో తన ముందు సీటులో కూర్చున్న వ్యక్తి నిద్రపోవడానికి తన సీటును వెనక్కు వాల్చాడు. దాంతో ల్యాప్‌టాప్ మీద సీటు బరువు పడడంతో కంప్రెస్ అయి స్ర్కీన్ పగిలిపోయింది. అయితే తన ల్యాప్‌టాప్ అలా అవడానికి కారణమైన వ్యక్తిని ఏం అనకుండా కాసిడీ ఆ విషయాన్ని డెల్టా ఎయిర్‌లైన్స్ యాజమాన్యానికి ట్విటర్లో షేర్ చేశాడు. @Delta small note for the suggestion box, maybe have a little warning sign or someway to prevent my laptop from being destroyed when the person in front of me reclines their seat. pic.twitter.com/QHmphXiDhH — Pat Cassidy (@HardFactorPat) February 26, 2020 ' @డెల్టా ఎయిర్‌లైన్స్.. ముందు సీటులో కూర్చున్న వ్యక్తి తన సీటును వెనక్కి వాల్చే ముందు తగిన హెచ్చరికలు బోర్డులు పెడితే బాగుండేది. మీరు అలా పెట్టకపోవడం వల్లే నా ల్యాప్‌టాప్ ద్వంసమైంది' అని పేర్కొన్నాడు. దీంతో పాటు ల్యాప్‌టాప్ ఫోటోను కూడా వారికి షేర్ చేశాడు. అయితే ఈ విషయంపై డెల్టా ఎయిర్‌లైన్స్ స్పందించింది. కాసిడి ఫిర్యాదు మేరకు అతని వస్తువుకు భంగం కలిగించినందుకు మా విమానంలో ఎప్పుడైనా సరే 7500 మైళ్లు ఉచితంగా ప్రయాణం చేసే వీలు కల్పించింది. అయితే కాసిడీ రీట్వీట్ చేస్తూ..' నాకు 7500 మైళ్లు ఉచిత ప్రయాణం ఆఫర్ చేయడం బాగానే ఉంది. కానీ మీరు ఇచ్చిన ఆఫర్ ఒక ఆరేళ్ల పిల్లాడికి ఇచ్చుంటే ఎగిరి గంతేసేవాడు' అని పేర్కొన్నాడు. అయితే కాసిడి చేసిన ట్వీట్‌పై నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. ల్యాప్‌టాప్ ధ్వంసం కావడానికి ఒక వ్యక్తి కారణమైతే డెల్టా ఎయిర్‌లైన్స్‌ను ఆశ్రయించడం ఏంటని....డెల్టా ఎయిర్‌లైన్స్ ఇచ్చిన ఆఫర్ తీసుకుంటే బాగుండేదని కొందరు పేర్కొనగా... మరి కొందరు మాత్రం పాట్రిక్‌కు మద్దతుగా నిలిచారు. Update: @Delta is giving me the equivalent of a $75 gift card and an explanation that you would give a six year old. Cool. pic.twitter.com/etGLUXOOjs — Pat Cassidy (@HardFactorPat) February 29, 2020 -
ప్రభుత్వాస్పత్రి ఓపి డిస్పెన్సరీలో అగ్నిప్రమాదం
సాక్షి, కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. ఓపి డిస్పెన్సరీలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం. ఈ సంఘటనలో మందులు, ఫర్నిచర్, ఏసీ అగ్నికి ఆహుతయ్యాయి. సంఘటన ఎలా జరిగిందన్న దానిపై ఆస్పత్రి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. -
వర్షాలకు కూలిన ఇళ్లు
మునగాల: మండల కేంద్రంలో మంగళవారం కురిసిన భారీ వర్షానకి నానిన ఓ ఇల్లు బుధవారం వేకువ జామున కుప్పకూలింది. గ్రామానికి చెందిన ఉప్పుల క్రిష్ణారెడ్డికి చెందిన ఇల్లు కురుస్తుండడంతో ఇంటి ముందు వసారాలో జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో తెల్లవారుజామున ఒక్కసారి ఇల్లు పైకప్పు పూర్తిగా కుప్పకూలింది. ప్రభుత్వం నుంచి తనకు నష్టపరిహారం అందచేసి ఆదుకోవాలని కృష్ణారెడ్డి కోరారు. -
గోదావరి పైప్‌లైన్‌ను పగులగొట్టారు..
సుల్తానాబాద్: కరీంనగర్ జిల్లా పెద్దపల్లి సమీపంలోని గోదావరి నుంచి హైదరాబాద్‌కు నీటిని తరలించే పైపులైన్‌ను టీడీపీ నాయకులు పగులగొట్టారు. శనివారం ఉదయం సుల్తానాబాద్ మండలం పూసాల గ్రామ సమీపంలో పైపును పగులగొట్టి నీటిని చెరువులు, కుంటలకు మళ్లించారు. జిల్లా ప్రజలు తాగునీరు దొరక్క అల్లాడుతుంటే నగరానికి సరఫరా చేయటమేంటని పైపు పగులగొట్టే కార్యక్రమానికి నేతృత్వం వహించిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు విజయరామారావు అన్నారు. చెరువులు, కుంటలు నిండేదాకా ఈ కార్యక్రమం ఆగదని చెప్పారు. మన నీరు మనకే అని నినదించే టీఆర్ఎస్ నాయకులు ఈ విషయం గమనించాలని అన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలిని పరిశీలించి వెళ్లిపోయారు. -
ఆగి ఉన్న పోలీస్ వాహనాన్ని ఢీ కొట్టిన ట్యాంకర్
హైదరాబాద్ : హైదరాబాద్‌లోని జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ ముందు ఆగి ఉన్న పోలీస్ వాహనాన్ని బుధవారం రాత్రి ఓ కెమికల్ ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో పోలీసు వాహనం పూర్తిగా ధ్వంసమైంది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అయిల్ ట్యాంకర్ డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.