హైదరాబాద్లోని జీడిమెట్ల పోలీస్స్టేషన్ ముందు ఆగి ఉన్న పోలీస్ వాహనాన్ని బుధవారం రాత్రి ఓ కెమికల్ ట్యాంకర్ ఢీకొట్టింది.
హైదరాబాద్ : హైదరాబాద్లోని జీడిమెట్ల పోలీస్స్టేషన్ ముందు ఆగి ఉన్న పోలీస్ వాహనాన్ని బుధవారం రాత్రి ఓ కెమికల్ ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో పోలీసు వాహనం పూర్తిగా ధ్వంసమైంది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అయిల్ ట్యాంకర్ డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.