గోదావరి పైప్‌లైన్‌ను పగులగొట్టారు..
సుల్తానాబాద్: కరీంనగర్ జిల్లా పెద్దపల్లి సమీపంలోని గోదావరి నుంచి హైదరాబాద్‌కు నీటిని తరలించే పైపులైన్‌ను టీడీపీ నాయకులు పగులగొట్టారు. శనివారం ఉదయం సుల్తానాబాద్ మండలం పూసాల గ్రామ సమీపంలో పైపును పగులగొట్టి నీటిని చెరువులు, కుంటలకు మళ్లించారు. జిల్లా ప్రజలు తాగునీరు దొరక్క అల్లాడుతుంటే నగరానికి సరఫరా చేయటమేంటని పైపు పగులగొట్టే కార్యక్రమానికి నేతృత్వం వహించిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు విజయరామారావు అన్నారు.
చెరువులు, కుంటలు నిండేదాకా ఈ కార్యక్రమం ఆగదని చెప్పారు. మన నీరు మనకే అని నినదించే టీఆర్‌ఎస్ నాయకులు ఈ విషయం గమనించాలని అన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలిని పరిశీలించి వెళ్లిపోయారు.