
రాయచూరు రూరల్: ఒకే కాన్పులో ముగ్గురు బిడ్డలను ప్రసవించిన ఘటన బెళగావి జిల్లాలో చోటు చేసుకుంది. రాయభాగ తాలూకా కంకణవాడి గ్రామ నివాసి పూజా మొదటి కాన్పులో ఇద్దరు మగ పిల్లలు, ఒక ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. గురువారం రాత్రి మూడలిగిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో ఆమె కాన్పు కోసం చేరారు. ముగ్గురు పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు మహంతేష్ కదాడి, మయూరి, విజయ్, బసవరాజ్ తెలిపారు.