three babies born
-
ఒకే కాన్పులో ముగ్గురు బిడ్డల జననం
రాయచూరు రూరల్: ఒకే కాన్పులో ముగ్గురు బిడ్డలను ప్రసవించిన ఘటన బెళగావి జిల్లాలో చోటు చేసుకుంది. రాయభాగ తాలూకా కంకణవాడి గ్రామ నివాసి పూజా మొదటి కాన్పులో ఇద్దరు మగ పిల్లలు, ఒక ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. గురువారం రాత్రి మూడలిగిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో ఆమె కాన్పు కోసం చేరారు. ముగ్గురు పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు మహంతేష్ కదాడి, మయూరి, విజయ్, బసవరాజ్ తెలిపారు. -
ఒకే కాన్పులో ముగ్గురు శిశువుల జననం
కర్నూలు(హాస్పిటల్): ఒకే కాన్పులో ఓ మహిళ ముగ్గురు శిశువులకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డలు క్షేమంగా ఉన్నారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి గైనకాలజీ ప్రొఫెసర్ డాక్టర్ మాణిక్యరావు, డాక్టర్ శ్రీలక్ష్మి తెలిపిన వివరాల మేరకు.. కృష్ణగిరికి చెందిన మున్ని(35)కి అక్బర్‌బాషతో 15 ఏళ్ల క్రితం వివాహమైంది. మొదటి సారి అబార్షన్ కాగా ఐదేళ్ల క్రితం సాధారణ ప్రసవం అయ్యింది. అప్పటి నుంచి మళ్లీ గర్భం దాల్చకపోవడంతో గైనకాలజీ విభాగంలో చికిత్స చేయించుకోవడంతో గర్భం దాల్చింది. కొంతకాలం తర్వాత స్కానింగ్ చేయగా ఆమె గర్భంలో ముగ్గురు శిశువులు ఉన్నట్లు గుర్తించారు. ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహిస్తూ ఆమెకు వైద్యం అందిస్తూ జాగ్రత్తలు చెబుతూ వచ్చారు. ఆమెను 25 రోజులు ముందుగా ఈ నెల 5న ఆసుపత్రిలో చేర్చుకుని అవసరమైన చికిత్స అందించారు. శనివారం ఆమెకు సిజేరియన్ ద్వారా కాన్పు చేశారు. ప్రసవంలో ఒక ఆడ, ఇద్దరు మగశిశువులు జన్మించారు. ఆడ శిశువు, మగశిశువు రెండేసి కిలోలు ఉండగా, మరో మగశిశువు 1.5కిలోల బరువు ఉన్నారు. తల్లీ బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. విలేకరుల సమావేశంలో డాక్టర్ రత్నకుమారి, డాక్టర్ సుప్రియ, అనెస్తీషియా వైద్యులు శ్రీనివాసులు, మహేష్, పీజీలు మోనీషా, ఆఫ్రిన్ పాల్గొన్నారు. -
ఒకే కాన్పులో ముగ్గురు శిశువుల జననం
కడప అర్బన్: రాజంపేట పట్టణానికి చెందిన కాశీ విశ్వనాథ్ భార్య ప్రతిమ (26) అనే మహిళ ఒకే కాన్పులో ముగ్గురికి జన్మనిచ్చింది. ఆదివారం తెల్లవారుజామున కడప రిమ్స్‌లో ఆమె ప్రసవించింది. ఇందులో ఆడశిశువులు కాగా, మరొకరు మగశిశువు ఉన్నారు. ముగ్గురు శిశువుల్ని ప్రస్తుతం ఎస్ఎన్సియూ వార్డులో చిన్నపిల్లల విభాగం వైద్యనిపుణుల పర్యవేక్షణలోఉంచారు. తల్లి ప్రతిమ కాన్పుల వార్డులో విశ్రాంతి తీసుకుంటున్నారు. ప్రస్తుతానికి తల్లితో పాటు, ముగ్గురు శిశువుల ఆరోగ్యపరిస్థితి బాగానే ఉందని డాక్టర్ కేశవచంద్ర తెలియజేశారు. -
ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు
మామిడికుదురు:తూర్పు గోదావరి జిల్లాలోని పాశర్లపూడిలంక గ్రామానికి చెందిన పోతుల కవిత శుక్రవారం ఒకే కాన్పులో ముగ్గురు శిశువులకు జన్మనిచ్చింది. వీరిలో ఇద్దరు ఆడ పిల్లలు కాగా మరోకరు మగ శిశువు. తల్లితో ముగ్గురు శిశువులు ఆరోగ్యంతో ఉన్నారని రాజుపాలెం ఏరియా ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఆడ శిశువులు ఒక్కొక్కరూ రెండు కిలోలు బరువు ఉండగా మగ శిశువు రెండున్నర కిలోలు బరువున్నాడని వైద్యులు వెల్లడించారు. -
ఒకే కాన్పులో ముగ్గురు జననం:తల్లీపిల్లలు క్షేమం
తూ.గో: ఒకే కాన్పులో ఒకరు లేదా ఇద్దరు పుట్టడం సహజం. ముగ్గురు జన్మించడం అనేది అరుదుగా జరుగుతుంది. అటువంటి సంఘటనే తాజాగా జిల్లాలోని మల్కిపురం నళిని ఆస్పత్రిలో సోమవారం సంభవించింది. తల్లీపిల్లలు క్షేమంగా ఉన్నట్లు ఆస్పత్రి డాక్టర్లు తెలిపారు. పిల్లల్లో ఎటువంటి లోపాలు లేకుండా ఆరోగ్యంనే ఉన్నట్లు తెలిపారు.