
ఎస్‌ఎన్‌సీయూలో ముగ్గురు శిశువులు
కడప అర్బన్: రాజంపేట పట్టణానికి చెందిన కాశీ విశ్వనాథ్ భార్య ప్రతిమ (26) అనే మహిళ ఒకే కాన్పులో ముగ్గురికి జన్మనిచ్చింది. ఆదివారం తెల్లవారుజామున కడప రిమ్స్‌లో ఆమె ప్రసవించింది. ఇందులో ఆడశిశువులు కాగా, మరొకరు మగశిశువు ఉన్నారు. ముగ్గురు శిశువుల్ని ప్రస్తుతం ఎస్‌ఎన్‌సియూ వార్డులో చిన్నపిల్లల విభాగం వైద్యనిపుణుల పర్యవేక్షణలోఉంచారు. తల్లి ప్రతిమ కాన్పుల వార్డులో విశ్రాంతి తీసుకుంటున్నారు. ప్రస్తుతానికి తల్లితో పాటు, ముగ్గురు శిశువుల ఆరోగ్యపరిస్థితి బాగానే ఉందని డాక్టర్ కేశవచంద్ర తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment