one delivery
-
ఒకే కాన్పులో ముగ్గురు శిశువుల జననం
కడప అర్బన్: రాజంపేట పట్టణానికి చెందిన కాశీ విశ్వనాథ్ భార్య ప్రతిమ (26) అనే మహిళ ఒకే కాన్పులో ముగ్గురికి జన్మనిచ్చింది. ఆదివారం తెల్లవారుజామున కడప రిమ్స్‌లో ఆమె ప్రసవించింది. ఇందులో ఆడశిశువులు కాగా, మరొకరు మగశిశువు ఉన్నారు. ముగ్గురు శిశువుల్ని ప్రస్తుతం ఎస్ఎన్సియూ వార్డులో చిన్నపిల్లల విభాగం వైద్యనిపుణుల పర్యవేక్షణలోఉంచారు. తల్లి ప్రతిమ కాన్పుల వార్డులో విశ్రాంతి తీసుకుంటున్నారు. ప్రస్తుతానికి తల్లితో పాటు, ముగ్గురు శిశువుల ఆరోగ్యపరిస్థితి బాగానే ఉందని డాక్టర్ కేశవచంద్ర తెలియజేశారు. -
సంతాన లక్ష్మి
బళ్లారి రూరల్ (కర్ణాటక): q దీంతో ఆ కుటుంబంలో సంతోషం వెల్లివిరిసింది. ఈ అరుదైన ఘటనకు కర్ణాటకలోని బళ్లారిలోని ప్రభుత్వ విమ్స్ ఆసుపత్రి వేదికైంది. బళ్లారి జిల్లా కంప్లి సమీపంలోని ఎమ్మిగనూరుకు చెందిన బసవరాజు, హులిగమ్మ దంపతులకు వ్యవసాయమే జీవనాధారం. హులిగమ్మకు మొదటి కాన్పులో మగశిశువు జన్మించాడు. మూడేళ్ల తరువాత హులిగమ్మ గర్భం దాల్చింది. గురువారం మధ్యాహ్నాం ఆమెకు నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు విమ్స్‌లో చేర్పించారు. గైనకాలజిస్టులు డాక్టర్ రామరాజు, డాక్టర్ వారీజా, డాక్టర్ అనిరుద్ధ్, డాక్టర్ శ్వేతలు ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. సాధారణ కాన్పు కష్టతరం కావడంతో అదేరోజు సాయంత్రం శస్త్రచికిత్స(సిజేరియన్) చేసి నలుగురు పిల్లలను వెలికి తీశారు. వీరిలో ఇద్దరు మగ, ఇద్దరు ఆడపిల్లలు. ప్రస్తుతం తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇదిలా ఉండగా హులిగమ్మ అత్త(భర్త తల్లి)కు 8 మంది సంతానం కాగా వారిలో ఇద్దరు కవలలు. వీరిలో ఒకరు మగ, ఒకరు ఆడ సంతానం. అలాగే బసవరాజు తాతకు కూడా ఇద్దరు కవలలు పుట్టారు. ప్రస్తుతం ఆ ఇంటి కోడలికి ఒకే కాన్పులో నలుగురు కవలలు జన్మించడం విశేషం. -
ఒకే కాన్పులో ముగ్గురు శిశువులకు జననం
పావగడ : ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు జన్మినిచ్చింది ఓ తల్లి. తాలూకాలోని కోటబండ గ్రామానికి చెందిన మంజునాథ్ భార్య శశిరేఖ పావగడ ప్రభుత్వాస్పత్రిలో గురువారం ముగ్గురు శిశువులకు జన్మనిచ్చింది. ఈ సందర్భంగా వైద్యుడు జగదీశ్ మాట్లాడుతూ స్థానిక ప్రభుత్వాసుపత్రిలో ఒకే కాన్పులో ముగ్గురు జన్మించడం ఇదే మొదటిసారని తెలిపారు. తల్లీ బిడ్డలు క్షేమంగా ఉన్నారన్నారు. శస్త్ర చికిత్స ద్వారా కాన్పు చేశామన్నారు. అయితే ముగ్గురూ ఆడ పిల్లలే జన్మించడం విశేషం. ముగ్గురు శిశువులను చూడటానికి జనం అధిక సంఖ్యలో ఆస్పత్రికి తరలి వచ్చారు. -
ఒకే ఈతలో ఐదు మేక పిల్లలు
యాడికి : యాడికిలోని వెంగమనాయుడు కాలనీలో నివాసముండే లక్ష్మీనారాయణకు చెందిన మేక సోమవారం ఒకే ఈతలో ఐదు మేక పిల్లలకు జన్మనిచ్చింది. అయితే పుట్టిన వెంటనే రెండు మేక పిల్లలు మృతి చెందాయి. మిగిలిన మూడు మేక పిల్లలు ఆరోగ్యంగా ఉన్నట్లు రైతు తెలిపారు. ప్రతి ఈతలో రెండు మేక పిల్లలకు జన్మనిచ్చేదని, ఈసారీ ఏకంగా ఐదు మేక పిల్లలకు జన్మనిచ్చిందని వివరించారు. -
వీళ్లు ట్రిప్లెట్స్
వీళ్లు ట్రిప్లెట్స్.. కవలలు అంటే ఇద్దరు.. ట్రిప్లెట్స్ అంటే ఒకే కాన్పులో ముగ్గురు పుట్టడమన్నమాట. ఇందులో విచిత్రమేముంది కామనే కదా అని మీరు అనొచ్చు. కాదు.. ఇటు పోలిక పరంగా అటు జన్యుపరంగా ముగ్గురూ ఒకేలా ఉండటం చాలా అరుదట. ప్రతి 20 కోట్ల కాన్పుల్లో ఒకసారి మాత్రమే ఇలా జరుగుతుందట! ఆ మధ్య వీళ్ల అమ్మ బెక్కీ ఆలెన్ చేయించిన డీఎన్ఏ పరీక్షలోనూ ఈ విషయం తేలింది. బ్రిటన్‌లోని లివర్‌పూల్‌కు చెందిన ఈ గడుగ్గాయిల పేర్లు రోమన్, రోకో, రోహన్. వీరిలో రోమన్ ఎవరు? రోహన్ ఎవరు? అని మాత్రం అడక్కండేం.. కవలలంటేనే కన్ఫ్యూజ్ అయిపోతాం.. ఇక్కడేమో ముగ్గురున్నారు మరి.. -
ఒకే కాన్పులో నలుగురు ఆడ శిశువులు
సాక్షి, హైదరాబాద్: ఒకే కాన్పులో నలుగురు ఆడ పిల్లలకు జన్మనిచ్చిందో మహిళ. ప్రస్తుతం తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా తునికి చెందిన చంద్రశేఖర్ (35) సతీమణి నళిని (33) గర్భవతి. స్థానిక వైద్యులను సంప్రదించగా... ఆమె కడుపులో నలుగురు బిడ్డలున్నట్టు గుర్తించారు. వారి సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిని సంప్రదించారు. నగరంలోనే ఉంటూ చికిత్స చేయించుకుంటున్న నళినికి శుక్రవారం రాత్రి రక్తస్రావం కావడంతో బంధువులు ఆసుపత్రిలో చేర్చారు. యశోద ఆసుపత్రి వైద్యులు భాగ్యలక్ష్మి, మాధవి సహా 15 మంది బృందం 32 వారాల గర్భిణికి శస్త్రచికిత్స చేసి శిశువులను బయటికి తీశారు. ఒకే కాన్పులో నలుగురు ఆడ శిశువులు జన్మించడం చాలా అరుదని, ప్రతి ఏడు లక్షల ప్రసవాల్లో ఒకరికే ఈ అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. ఒక్కో శిశువు 1.2 కేజీల బరువు ఉంది. ప్రస్తుతం వారిని నియోనెటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంచి వైద్య సేవలు అందిస్తున్నారు. తొలి కాన్పులోనే నలుగురు ఆడశిశువులు జన్మించడం తమ అదృష్టంగా భావిస్తున్నట్లు నళిని భర్త చంద్రశేఖర్ చెప్పారు.