
ఒకే ఈతలో ఐదు మేక పిల్లలు
యాడికి : యాడికిలోని వెంగమనాయుడు కాలనీలో నివాసముండే లక్ష్మీనారాయణకు చెందిన మేక సోమవారం ఒకే ఈతలో ఐదు మేక పిల్లలకు జన్మనిచ్చింది. అయితే పుట్టిన వెంటనే రెండు మేక పిల్లలు మృతి చెందాయి. మిగిలిన మూడు మేక పిల్లలు ఆరోగ్యంగా ఉన్నట్లు రైతు తెలిపారు. ప్రతి ఈతలో రెండు మేక పిల్లలకు జన్మనిచ్చేదని, ఈసారీ ఏకంగా ఐదు మేక పిల్లలకు జన్మనిచ్చిందని వివరించారు.