వీళ్లు ట్రిప్లెట్స్
వీళ్లు ట్రిప్లెట్స్.. కవలలు అంటే ఇద్దరు.. ట్రిప్లెట్స్ అంటే ఒకే కాన్పులో ముగ్గురు పుట్టడమన్నమాట. ఇందులో విచిత్రమేముంది కామనే కదా అని మీరు అనొచ్చు. కాదు.. ఇటు పోలిక పరంగా అటు జన్యుపరంగా ముగ్గురూ ఒకేలా ఉండటం చాలా అరుదట. ప్రతి 20 కోట్ల కాన్పుల్లో ఒకసారి మాత్రమే ఇలా జరుగుతుందట! ఆ మధ్య వీళ్ల అమ్మ బెక్కీ ఆలెన్ చేయించిన డీఎన్‌ఏ పరీక్షలోనూ ఈ విషయం తేలింది. బ్రిటన్‌లోని లివర్‌పూల్‌కు చెందిన ఈ గడుగ్గాయిల పేర్లు రోమన్, రోకో, రోహన్. వీరిలో రోమన్ ఎవరు? రోహన్ ఎవరు? అని మాత్రం అడక్కండేం.. కవలలంటేనే కన్‌ఫ్యూజ్ అయిపోతాం.. ఇక్కడేమో ముగ్గురున్నారు మరి..