మధ్యప్రదేశ్:మధ్యప్రదేశ్‌లోని సాత్నా జిల్లాలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. 62 ఏళ్ల భర్త, 30 ఏళ్ల భార్య ముగ్గురు శిశువులకు జన్మనిచ్చారు. ఇంతకూ.. భార్య భర్తల మధ్య ఇంత వయస్సు తేడా ఎందుకు వచ్చింది. ఇంత లేటు వయస్సులో పిల్లల్ని కనడానికి కారణాలేంటి? తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదివేయాల్సిందే..
గోవింద్ కుశ్వాహా(62),ఉచెహ్ర మండలంలోని అతర్వేడియా ఖుర్ద్ గ్రామానికి చెందిన వ్యక్తి. అతనికి యుక్త వయస్సులోనే కస్తూరి బాయ్(60)తో వివాహం జరిగింది. వారికి ఓ కుమారుడు పుట్టాడు. కానీ కొడుకు పెద్దయ్యాక 18 ఏళ్ల వయస్సు వచ్చాక ఓ ప్రమాదంలో మరణించాడు. దీంతో భర్తను రెండో వివాహం చేసుకోవాలని భార్య కస్తూరి బాయ్ కోరింది. ఆ తర్వాత గోవింద్‌కు హీరాభాయ్(30)తో వివాహం జరిగింది.
సోమవారం రాత్రి హీరాభాయ్‌కి పురిటి నొప్పులు రావడంతో స్థానిక ఆస్పత్రికి వెళ్లారు. ప్రస్తుతం ఆమెకు ముగ్గురు పిల్లలు పుట్టారు. దీంతో గోవింద్ కుశ్వాహా ఆనందం వ్యక్తం చేశారు. పిల్లల ఆరోగ్యం బాగుండాలని వేడుకుంటున్నారు. ప్రస్తుతం ముగ్గురు పిల్లల ఆరోగ్యం విషమంగా ఉన్నందున ఐసీయూలో ఉంచినట్లు వైద్యులు తెలిపారు. ప్రిమెచ్యూర్ కారణంగానే పిల్లల ఆరోగ్యం విషమంగా ఉందని వెల్లడించారు.
ఇదీ చదవండి:ఒకవైపు భార్య.. మరోవైపు ప్రియురాలు.. బెడిసి కొట్టిన యువకుని ప్లాన్!
Comments
Please login to add a commentAdd a comment