triplets
-
ఆమెకు 30.. ఆయనకు 62.. వారికి ముగ్గురు.. ఇదో వింత కథ..
మధ్యప్రదేశ్:మధ్యప్రదేశ్‌లోని సాత్నా జిల్లాలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. 62 ఏళ్ల భర్త, 30 ఏళ్ల భార్య ముగ్గురు శిశువులకు జన్మనిచ్చారు. ఇంతకూ.. భార్య భర్తల మధ్య ఇంత వయస్సు తేడా ఎందుకు వచ్చింది. ఇంత లేటు వయస్సులో పిల్లల్ని కనడానికి కారణాలేంటి? తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదివేయాల్సిందే.. గోవింద్ కుశ్వాహా(62),ఉచెహ్ర మండలంలోని అతర్వేడియా ఖుర్ద్ గ్రామానికి చెందిన వ్యక్తి. అతనికి యుక్త వయస్సులోనే కస్తూరి బాయ్(60)తో వివాహం జరిగింది. వారికి ఓ కుమారుడు పుట్టాడు. కానీ కొడుకు పెద్దయ్యాక 18 ఏళ్ల వయస్సు వచ్చాక ఓ ప్రమాదంలో మరణించాడు. దీంతో భర్తను రెండో వివాహం చేసుకోవాలని భార్య కస్తూరి బాయ్ కోరింది. ఆ తర్వాత గోవింద్‌కు హీరాభాయ్(30)తో వివాహం జరిగింది. సోమవారం రాత్రి హీరాభాయ్‌కి పురిటి నొప్పులు రావడంతో స్థానిక ఆస్పత్రికి వెళ్లారు. ప్రస్తుతం ఆమెకు ముగ్గురు పిల్లలు పుట్టారు. దీంతో గోవింద్ కుశ్వాహా ఆనందం వ్యక్తం చేశారు. పిల్లల ఆరోగ్యం బాగుండాలని వేడుకుంటున్నారు. ప్రస్తుతం ముగ్గురు పిల్లల ఆరోగ్యం విషమంగా ఉన్నందున ఐసీయూలో ఉంచినట్లు వైద్యులు తెలిపారు. ప్రిమెచ్యూర్ కారణంగానే పిల్లల ఆరోగ్యం విషమంగా ఉందని వెల్లడించారు. ఇదీ చదవండి:ఒకవైపు భార్య.. మరోవైపు ప్రియురాలు.. బెడిసి కొట్టిన యువకుని ప్లాన్! -
ముగ్గురు అమ్మాయిలను పెళ్లాడిన వ్యక్తి!: వీడియో వైరల్
ఇటీవల భారత్‌లో ఇద్దరు కవలలను పెళ్లి చేసుకున్న ఒక వ్యక్తి బహు భార్యత్వం కేసు కింద అరెస్టు అయ్యాడు. ఆ ఘటన మరువక మునుపే అలాంటి ఘటనే కెన్యాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. కేట్, ఈవ్, మేరీ అనే ముగ్గురు అక్కా చెల్లెళ్లు స్టీవ్ అనే వ్యక్తిని పెళ్లాడారు. తొలుత ఆ కవలల్లో కేట్ అనే అమ్మాయి స్టీవ్ అనే వ్యక్తిని కలిసింది. ఆ తర్వాత వారిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక పెళ్లి విషయమై మాట్లాడేందుకు వాళ్ల చెల్లెళ్లను కలిసేందుకు వెళ్లాడు స్టీవ్. అనుహ్యంగా స్టీవ్‌కి అక్కడకు వెళ్లేంత వరకు తెలియదు ముగ్గుర్ని చేసుకోవాల్సి వస్తుందని. తాను ఒకరిని వివాహం చేసుకునేందుకు మాట్లాడటానికి వెళ్లితే ముగ్గుర్ని పెళ్లి చేసుకుంటానని అస్సలు అనుకోలేదని చెబుతున్నాడు. ఐతే వారు తాము ముగ్గురు తననే ఇష్టపడుతున్నామని చెప్పటంతో ఆశ్చర్యపోయానని చెబుతున్నాడు స్టీవ్. ఆ తర్వాత కాసేపు ఆలోచించి ముగ్గుర్ని పెళ్లాడేందుకు అంగీకరించినట్లు వివరించాడు. ఐతే ఆ ముగ్గరికి ఒకరిని వదిలి ఒకరు ఉండేందుకు ఇష్టపడకపోవడంతోనే ఇలా ఒక్క వ్యక్తినే పెళ్లి చేసుకోవాలని అనుకున్నట్లు చెప్పుకొచ్చారు. ఐతే తమను పెళ్లి చేసుకునేందుకు స్టీవ్ ఒక కండిషన్ కూడా పెట్టాడని చెబుతున్నారు ఆ అక్కాచెల్లెళ్లు. అలాగే ఏ సమస్య రాకుండా తాము ఎవరికీ కేటాయించిన సమయంలో వారు స్టీవ్‌తో గడిపేలా గట్టి టైం షెడ్యూల్ కూడా కేటాయించుకున్నట్లు ఆ కవలలు చెబుతున్నారు. (చదవండి: చీరకట్టులో డైవింగ్ చేసిన సీనియర్ సిటిజన్ మహిళలు) -
ట్రిపుల్ బొనాంజా.. ఒకే కాన్పులో ఇద్దరు కాదు ముగ్గురు
మైసూరు: ఒకే కాన్పులో ఒకరూ ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు పిల్లలు పుట్టారు. నగరంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో శనివారం ఈ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. లక్ష్మి అనే మహిళ గర్భం దాల్చింది. ప్రస్తుతం ఆమెకు 7 నెలలు. ప్రసవ వేదన రావడంతో ప్రైవేటు ఆస్పత్రిలో చేరింది. వైద్యులు సిజేరియన్ ఆపరేషన్ ద్వారా కాన్పు చేశారు. ఇద్దరు మగ పిల్లలు, ఒక ఆడపిల్ల పుట్టారు. తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని వైద్య నిపుణురాలు డాక్టర్ లీలావతి తెలిపారు. కాగా, శిశువులు కొంత బరువు పెరిగేవరకూ 20 రోజులు ఐసీయూలో ఉంచుతామన్నారు. తల్లి లక్ష్మి మాట్లాడుతూ స్కానింగ్‌లో ముగ్గురు పిల్లలు ఉన్నట్లు తెలిసి ఆందోళన చెందానని, పిల్లలు క్షేమంగా ఉండడంతో సంతోషంగా ఉందని చెప్పారు. చదవండి: (Preethi Manoj: రెండువారాలు మృత్యుపోరాటం) -
అప్పుడే పుట్టిన కవలలకు సోకిన కరోనా
మెక్సికో : అప్పుడే పుట్టిన నవజాత కవలలకు కరోనా సోకిన ఘటన మెక్సికోలో చోటుచేసుకుంది. తల్లితో పాటు ముగ్గురు కవలపిల్లలకు కూడా వైరస్ సోకిందని వైద్యులు మంగళవారం ప్రకటించారు. కవలల్లో ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి పుట్టినట్లు తెలిపారు. అయితే వీరిలో ఓ అబ్బయి మాత్రం శ్వాస తీసుకోవడంలో ఇబ్బందు పడుతున్నాడని ప్రస్తుతం అతనికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు. (వినూత్నంగా యోగా! ) అయితే అప్పుడే పుట్టిన పిల్లలకు కరోనా సోకడం చాలా అరుదైన సంఘటన అని రాష్ట్ర ఆరోగ్య భద్రతా కమిటీ ప్రతినిధి తెలిపారు. అయితే తల్లి గర్భిణీగా ఉన్న సమయంలోనే కోవిడ్‌కు గురై తద్వారా పిల్లలకు సంక్రమించి ఉండొచ్చని ప్రాధమికంగా అంచనా వేస్తున్నారు. మెక్సికోలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,85,00 కు చేరుకోగా 22,584 మంది మృత్యువాత పడ్డారు. ఫిబ్రవరి 28న మెక్సికోలో తొలి కరోనా కేసు బయటపడ్డ విషయం తెలిసిందే. (నేపాల్ భూభాగాన్ని ఆక్రమించిన చైనా! ) -
కిడ్నీలో రాళ్లని వెళ్లి.. ముగ్గురికి జన్మనిచ్చింది
వినడానికి, చదవడానికి, నమ్మశక్యంగా లేని వార్త ఒకటి ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఈ సంఘటన దక్షిణ డకోటాలో ఈ నెల 10న చోటు చేసుకుంది. వివరాలు.. గిల్ట్జ్(34) అనే మహిళ గత కొంతకాలంగా కిడ్నీలో రాళ్లతో బాధపడుతుంది. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం ఆమె తీవ్రమైన నడుము నొప్పితో బాధపడసాగింది. దాంతో ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ గిల్ట్జ్‌ను పరీక్షించిన వైద్యులు ఆమె ఎనిమిదిన్నర నెలల గర్భవతి అని తేల్చారు. అంతేకాక ఆమె కడుపులో కవలలు లేదా ముగ్గురు పిల్లలు పెరుగుతున్నట్లు గుర్తించారు. గిల్ట్జ్ బాధపడుతుంది కిడ్నీలో రాళ్ల వల్ల వచ్చిన నొప్పితో కాదని ప్రసవ వేదనతో అని పేర్కొన్నారు. అనంతరం 4 నిమిషాల వ్యవధిలో గిల్ట్జ్ ముగ్గురు బిడ్డలకు జన్మనిచ్చింది. చిన్నారులంతా 1.8కిలోగ్రాముల బరువుతో ఆరోగ్యంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ఈ విషయం గురించి వైద్యులు మాట్లాడుతూ.. ‘ఎటువంటి ఆపరేషన్లు లేకుండా ముగ్గురు బిడ్డలకు జన్మనివ్వడం చాలా అరుదుగా జరిగే సంఘటన. డెలివరీ సమయానికి గిల్ట్జ్ 34 వారాల గర్భంతో ఉన్నారు. కానీ దాని గురించి ఆమెకు ఏమాత్రం అవగాహన లేకపోవడం ఆశ్చర్యం కల్గిస్తుంది. వైద్యుడిని అయినప్పటికి సాధరణ జనాల మాదిరిగానే నేను కూడా ఈ విషయాన్ని నమ్మలేకపోతున్నాను. ఓ మహిళకు తాను గర్భవతిని అని తెలియకపోవడం.. నిజంగా వింతే. ఎందుకంటే గర్భవతి అయ్యాక నెలసరి ఆగిపోతుంది.. బిడ్డ పెరుగుతున్న కొద్ది ఉదర భాగం ముందుకు వస్తుంది. అంతేకాక ఆరు, ఏడో నెల నుంచి కడుపులో బిడ్డ కదలిక తెలుస్తుంది. కానీ గిల్ట్జ్ విషయంలో ఇవేవి జరగకపోవడం నిజంగా ఆశ్చర్యమే. ఇప్పటికి నేను ఈ విషయాన్ని నమ్మలేకపోతున్నాను. కిడ్నీలో రాళ్లు అంటూ ఆస్పత్రిలో చేరిన మహిళ ఏకంగా ముగ్గురు బిడ్డలకు జన్మనివ్వడం బహుశా చరిత్రలో ఇదే ప్రథమం అనుకుంటా’ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ వార్త చదివిన జనాలు కూడా సదరు వైద్యులు వ్యక్తం చేసిన అనుమానాలనే వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక తల్లి బిడ్డలు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ అభినందనలు తెలుపుతున్నారు. గిల్ట్జ్‌కు ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉండగా.. ప్రస్తుతం ఓ అమ్మాయికి, ఇద్దరు అబ్బాయిలకు జన్మనిచ్చింది. -
ఒకే కాన్పులో ముగ్గురు
ములకలపల్లి : భద్రాద్రి జిల్లా ములకలపల్లి మండల కేంద్రంలోని మంగపేట గిరిజన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ)లో బుధవారం ఓ తల్లి ముగ్గురు శిశువులకు జన్మనిచ్చింది. మండలంలోని చింతపేట గ్రామానికి చెందిన మడివి పద్మ పురిటి నొప్పులతో ఆస్పత్రికి వచ్చింది. డ్యూటీలో ఉన్న స్టాఫ్‌నర్స్ విమల పద్మ రిపోర్టులను పరిశీలించి ముగ్గరు బిడ్డలు ఉన్నట్లు గుర్తించి, చాకచక్యంగా కాన్పు చేశారు. పద్మకు ఇద్దరు మగపిల్లలు, ఒక ఆడ శిశువు జన్మించారు. ఆమెకు ఇది రెండో కాన్పు కాగా, తొలి కాన్పులోనూ కవల పిల్లలకు జన్మనివ్వడం విశేషం. తల్లీ, బిడ్డలు ఆరోగ్యంగానే ఉన్నారని, అయితే శిశువులు బరువు తక్కువగా ఉండడంతో భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించామని వైద్యులు తెలిపారు. స్టాఫ్ నర్స్ విమలతో పాటు వైద్య సిబ్బందిని ఎమ్మెల్యే, ట్రైకార్ చైర్మన్ తాటి వెంకటేశ్వర్లు ఫోన్లో అభినందించారు. -
ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు
ఆదిలాబాద్ : ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో ఓ మహిళ ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మ నిచ్చింది. మహారాష్ట్రలోని కిన్వాట్ ఆసీఫ్ తన భార్య అంజూమ్‌ను పురిటినొప్పులు రావడం తో సోమవారం రిమ్స్‌కు తీసుకొచ్చాడు. అయి తే ఆమెకు ఇంకా 9 నెలలు కూడా నిండకపోవడంతో వైద్యులు రిమ్స్‌లో అడ్మిట్ చేసుకున్నారు. అయితే మంగళవారం తీవ్ర నొప్పులు రావడంతో ఆపరేషన్ చేసి కాన్పు చేశారు. దీం తో ఆమెకు ఇద్దరు పాపలు, ఒక బాబు పు ట్టారు. మొదటి కాన్పు, అదీ కూడా 8 నెలలకే ప్రసూతి అయినప్పటికీ పుట్టిన శిశువులు ఆరోగ్యంగానే ఉన్నారు. ఇందులో ఒకరు 1.5 కేజీ, మరొకరు 1.25 కేజీ, బాబు1.3 కేజీలు ఉన్న ట్లు చిల్డ్రన్స్ డాక్టర్ సూర్యకాంత్ తెలిపారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం బాగానే ఉందన్నారు. -
ట్రిపుల్ ధమాకా!
నాగర్‌కర్నూల్ ఎడ్యుకేషన్: ఒకే కాన్పులో కవలలు పుడితేనే ఆ దంపతులు వర్ణించలేని ఆనందం పొందుతారు. అలాంటిది ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు జన్మించటం ఆశ్చర్యమేనని చెప్పాలి. జడ్చర్ల వెంకటేశ్వరనగర్‌లో మేస్త్రీ కుమార్‌కు నాగర్‌కర్నూలు ఉయ్యాలవాడకు చెందిన లావణ్యతో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఏడాదిన్నర క్రితం ఓ అమ్మాయి జన్మించినా కొద్ది సేపటికే మృతి చెందింది. మళ్లీ ఆమె గర్భం దాల్చగా మంగళవారం ఉదయం నొప్పులు రావడంతో నాగర్‌కర్నూలు సత్యసాయి ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ డాక్టర్ శ్రీనివాస్ ఆమె ప్రసవం చేయగా ఇద్దరు మగ శిశువులు, ఓ ఆడశిశువు జన్నించారు. కాగా, 14ఏళ్లక్రితం జడ్చర్ల–మహబూబ్‌నగర్ ప్రధాన రహదారిపై నక్కలబండ తండా సమీపంలోని మామిడితోటలో పనిచేసే గిరిజన దంపతులకు ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు జన్మించారు. ఆ తర్వాత మళ్లీ ముగ్గురు జన్మించడం ఇదే. -
ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు
రాయచోటి: వైఎస్సార్ కడప జిల్లా రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రిలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. శుక్రవారం ఉదయం ఓ మహిళ ఒకే కాన్పులో ముగ్గురు మగబిడ్డలకు జన్మనిచ్చింది. గాలివీడు మండలం గోపనపల్లె గ్రామం నక్కవాండక్లపల్లెకు చెందిన నారాయణమ్మ కాన్పు కోసం ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చింది. ఆమెకు శస్త్రచికిత్స చేసిన వైద్యులు ముగ్గురు మగబిడ్డలకు జన్మనిచ్చిందని.. తల్లి, పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. -
రియోలో ముగ్గురమ్మాయిల ముచ్చట
ఈసారి రియో ఒలింపిక్స్‌లో న్యాయనిర్ణేతలతో పాటు చూస్తున్న ప్రజలకు కూడా కాస్తంత గందరగోళం తప్పదు. ఎందుకంటే ముగ్గురు కవల అమ్మాయిలు మారథాన్‌లో పరుగులు తీయనున్నారు. ఈ ముగ్గురూ ఈస్టోనియా దేశానికి చెందినవారు. వీళ్లు గానీ టాప్ 5 స్థానాల్లో ఉన్నారంటే.. ఎవరు ఏ స్థానంలో వచ్చారో చెప్పడం ఆ బ్రహ్మ తరం కూడా కాదు. వీళ్లలో వీళ్లు చెప్పాల్సిందే. అవును... ఎందుకంటే ఈ ముగ్గురూ చూడటానికి అచ్చుగుద్దినట్లు ఒకేలా ఉంటారు. అందుకే వీళ్లను 'ట్రయో టు రియో' అంటున్నారు. వీళ్లు ముగ్గురూ ఒకేలాంటి యూనిఫాం కూడా వేసుకుంటారు. వీళ్ల పేర్లు లీలా, లిల్లీ, లీనా లుయిక్. చూసేవాళ్లకు తమలో ఎవరు ఎవరో గుర్తుపట్టడం అసాధ్యమని లిల్లీ చెప్పింది. తమలో ఒకరు ముందు, మరొకరు కాస్త వెనకాల కనిపిస్తే.. వెనక ఉన్నవాళ్లే ముందుకు వచ్చారనుకుని అప్పుడే వచ్చేశావా అని అనడం కూడా తనకు తెలుసని ఆమె తెలిపింది. నెగ్గింది తానంటే తానని ఇంటర్వ్యూలు చేసేవాళ్లను కూడా ఈ అక్కచెల్లెళ్లు ఏడిపిస్తుంటారు. అసలు విజేత ఎవరో తెలియక, ఎవరిని అభినందించాలో, ఎవరి వద్ద మైకు పెట్టాలో అర్థం కాక తల బద్దలుకొట్టుకుంటారు. ఒలింపిక్స్‌లో కవలలు పాల్గొనడం కొత్త కాదు. కానీ, ఇలా ట్రిప్లెట్లు పాల్గొనడం, అది కూడా ఒకే ఈవెంటులో పాల్గొనడం మాత్రం ఇదే మొదటిసారని చెబుతున్నారు. ఇక వీళ్ల కుటుంబానికి అథ్లెటిక్స్‌లో పాల్గొన్న చరిత్ర కూడా లేదు. చిన్నతనం నుంచి ఆటలంటే మాత్రం వీళ్లకు ఆసక్తి ఉండేది. అప్పటినుంచే ఎక్కువ దూరం పరుగులు తీసేవారు. అందులోనూ ఒకళ్లతో ఒకరు బాగా పోటీపడేవారు. ముగ్గురిలో ప్రస్తుతం లీలా ముందుంది. ఈమె అందరికంటే పెద్దది (కొన్ని నిమిషాలు!). ఎవరైనా వెనకబడుతుంటే ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ కమాన్.. ఆగొద్దు అని చెప్పుకొంటారట. అలాగే ముగ్గురిలో ఎవరికైనా గాయాలు అయినప్పుడు చాలా బాధపడతారు. తాము ముగ్గురం కలిసి పరుగులు తీయకపోతే ఏదోలా అనిపిస్తుందని లీలా చెప్పింది. ఈస్టోనియా నుంచి కేవలం ముగ్గురికి మాత్రమే ఒలింపిక్స్ మారథాన్‌లో పాల్గొనేందుకు అవకాశం ఉండగా, ఈ ముగ్గురే దాన్ని దక్కించుకోవడం మరో విశేషం. అయితే వీళ్లలో ఎవరికీ పతకం వచ్చే అవకాశం మాత్రం లేదు. ఎందుకంటే, అందరికంటే అత్యుత్తమ సమయం 2 గంటల 37 నిమిషాల 11 సెకండ్లను లీలా నమోదుచేసింది. కానీ ఇది ఒలింపిక్స్ రికార్డు కంటే 15 నిమిషాలు ఎక్కువ. మారథాన్‌లో అంత సమయాన్ని కవర్ చేయడం అంటే అంత సులభం కాదు. చాలావరకు ఆఫ్రికన్ దేశాల క్రీడాకారులే మారథాన్ లాంటి ఈవెంట్లలో ముందుంటారు. అయినా తాము మాత్రం ఆశలు వదులుకునేది లేదని.. 'ట్రయో టు రియో' స్ఫూర్తిని కొనసాగిస్తామని ముగ్గురూ ముక్తకంఠంతో చెబుతున్నారు. -
వీళ్లు ట్రిప్లెట్స్
వీళ్లు ట్రిప్లెట్స్.. కవలలు అంటే ఇద్దరు.. ట్రిప్లెట్స్ అంటే ఒకే కాన్పులో ముగ్గురు పుట్టడమన్నమాట. ఇందులో విచిత్రమేముంది కామనే కదా అని మీరు అనొచ్చు. కాదు.. ఇటు పోలిక పరంగా అటు జన్యుపరంగా ముగ్గురూ ఒకేలా ఉండటం చాలా అరుదట. ప్రతి 20 కోట్ల కాన్పుల్లో ఒకసారి మాత్రమే ఇలా జరుగుతుందట! ఆ మధ్య వీళ్ల అమ్మ బెక్కీ ఆలెన్ చేయించిన డీఎన్ఏ పరీక్షలోనూ ఈ విషయం తేలింది. బ్రిటన్‌లోని లివర్‌పూల్‌కు చెందిన ఈ గడుగ్గాయిల పేర్లు రోమన్, రోకో, రోహన్. వీరిలో రోమన్ ఎవరు? రోహన్ ఎవరు? అని మాత్రం అడక్కండేం.. కవలలంటేనే కన్ఫ్యూజ్ అయిపోతాం.. ఇక్కడేమో ముగ్గురున్నారు మరి.. -
ఒకే కాన్పులో ముగ్గురు
ఆదిలాబాద్ పట్టణంలోని రిమ్స్ ఆస్పత్రిలో ఒక మహిళ మంగళవారం ముగ్గురు చిన్నారులకు జన్మనిచ్చింది. ఇచ్చోడ మండలం మాదాపూర్‌కు చెందిన షబానాకు ప్రసవ నొప్పులు తీవ్రం కావడంతో ఆమెను భర్త షఫీఖాన్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. వైద్యులు మంగళవారం ఉదయం శస్త్రచికిత్స చేయగా, ఇద్దరు మగ శిశువులు, ఒక ఆడ శిశువుకు ఆమె జన్మనిచ్చింది. ముగ్గురూ ఆరోగ్యంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. దీంతో ఆ దంపతుల ఆనందానికి అవధుల్లేవు. -
చెల్లీ ఇక నీకేం కాదు...
చెల్లీ ఇక నీకేం కాదు... అన్నట్టు కనిపిస్తున్న ఆ ఫోటో ఇప్పుడు అందర్నీ ఆకట్టుకుంటోంది. తన గర్భంలోని ముగ్గురు కవలలనూ కాపాడుకునేందుకు ఆ తల్లి చేసిన సాహసాన్ని వైద్యులూ సవాల్ గా తీసుకున్నారు. ఇద్దరు మగ శిశువుల ప్రాణాలకు రిస్క్ అని తెలిసినా పాపను రక్షించుకునేందుకు..ఆ తల్లి నెలలు నిండకుండా ముందుగానే ప్రసవం చేయించుకున్న తీరు... అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు ఇంట్లో ముగ్గురు పిల్లలతో హాయిగా ఎంజాయ్ చేస్తోంది. ఆస్ట్రేలియాకి చెందిన 22 ఏళ్ళ దన్ స్తాన్ అనే మహిళ ముగ్గురు కవల పిల్లలకు జన్మనిచ్చింది. నడి గర్భిణిగా ఉండగానే ఆమె ప్రసవానికి సిద్ధమైంది. మరో మార్గం లేని సందర్భంలో ఆమె... 28 వారాల్లోనే ప్రసవం చేయించుకుంది. ఇద్దరు మగ శిశువులతోపాటు... కడుపులో ఆక్సిజన్ సమస్యతో ఇబ్బంది పడుతున్న పాపను కూడ రక్షించుకునేందుకు ఆమె భర్త రోహాన్ తో సంప్రదించి ధైర్యం చేసింది. ఆస్పత్రిలో ప్రసవం అనంతరం కాస్త అనారోగ్యంగా ఉన్న బిడ్డలను పదకొండు వారాలపాటు వైద్యుల పర్యవేక్షణలోనే ఉంచారు. అనంతరం ఆ దంపతులు ముగ్గురు బిడ్డలనూ ఆనందంగా ఇంటికి తీసుకెళ్ళారు.