ట్రిపుల్‌ ధమాకా!  | Triple Dhamaka! | Sakshi
Sakshi News home page

ట్రిపుల్‌ ధమాకా! 

Published Wed, Apr 4 2018 12:50 PM | Last Updated on Mon, Oct 8 2018 5:07 PM

Triple Dhamaka! - Sakshi

నాగర్‌కర్నూల్‌ ఎడ్యుకేషన్‌: ఒకే కాన్పులో కవలలు పుడితేనే ఆ దంపతులు    వర్ణించలేని ఆనందం పొందుతారు. అలాంటిది ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు జన్మించటం ఆశ్చర్యమేనని చెప్పాలి. జడ్చర్ల వెంకటేశ్వరనగర్‌లో మేస్త్రీ కుమార్‌కు నాగర్‌కర్నూలు ఉయ్యాలవాడకు చెందిన లావణ్యతో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఏడాదిన్నర క్రితం ఓ అమ్మాయి జన్మించినా కొద్ది సేపటికే మృతి చెందింది. మళ్లీ ఆమె గర్భం దాల్చగా మంగళవారం ఉదయం నొప్పులు రావడంతో నాగర్‌కర్నూలు సత్యసాయి ఆస్పత్రిలో చేర్పించారు.

అక్కడ డాక్టర్‌ శ్రీనివాస్‌ ఆమె ప్రసవం చేయగా ఇద్దరు మగ శిశువులు, ఓ ఆడశిశువు జన్నించారు. కాగా, 14ఏళ్లక్రితం జడ్చర్ల–మహబూబ్‌నగర్‌ ప్రధాన రహదారిపై నక్కలబండ తండా సమీపంలోని మామిడితోటలో పనిచేసే గిరిజన దంపతులకు ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు జన్మించారు. ఆ తర్వాత మళ్లీ ముగ్గురు జన్మించడం ఇదే.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement