ఇటీవల భారత్‌లో ఇద్దరు కవలలను పెళ్లి చేసుకున్న ఒక వ్యక్తి బహు భార్యత్వం కేసు కింద అరెస్టు అయ్యాడు. ఆ ఘటన మరువక మునుపే అలాంటి ఘటనే కెన్యాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. కేట్, ఈవ్, మేరీ అనే ముగ్గురు అక్కా చెల్లెళ్లు స్టీవ్ అనే వ్యక్తిని పెళ్లాడారు. తొలుత ఆ కవలల్లో కేట్ అనే అమ్మాయి స్టీవ్ అనే వ్యక్తిని కలిసింది. ఆ తర్వాత వారిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక పెళ్లి విషయమై మాట్లాడేందుకు వాళ్ల చెల్లెళ్లను కలిసేందుకు వెళ్లాడు స్టీవ్.
అనుహ్యంగా స్టీవ్‌కి అక్కడకు వెళ్లేంత వరకు తెలియదు ముగ్గుర్ని చేసుకోవాల్సి వస్తుందని. తాను ఒకరిని వివాహం చేసుకునేందుకు మాట్లాడటానికి వెళ్లితే ముగ్గుర్ని పెళ్లి చేసుకుంటానని అస్సలు అనుకోలేదని చెబుతున్నాడు. ఐతే వారు తాము ముగ్గురు తననే ఇష్టపడుతున్నామని చెప్పటంతో ఆశ్చర్యపోయానని చెబుతున్నాడు స్టీవ్. ఆ తర్వాత కాసేపు ఆలోచించి ముగ్గుర్ని పెళ్లాడేందుకు అంగీకరించినట్లు వివరించాడు.
ఐతే ఆ ముగ్గరికి ఒకరిని వదిలి ఒకరు ఉండేందుకు ఇష్టపడకపోవడంతోనే ఇలా ఒక్క వ్యక్తినే పెళ్లి చేసుకోవాలని అనుకున్నట్లు చెప్పుకొచ్చారు. ఐతే తమను పెళ్లి చేసుకునేందుకు స్టీవ్ ఒక కండిషన్ కూడా పెట్టాడని చెబుతున్నారు ఆ అక్కాచెల్లెళ్లు. అలాగే ఏ సమస్య రాకుండా తాము ఎవరికీ కేటాయించిన సమయంలో వారు స్టీవ్‌తో గడిపేలా గట్టి టైం షెడ్యూల్ కూడా కేటాయించుకున్నట్లు ఆ కవలలు చెబుతున్నారు.
(చదవండి: చీరకట్టులో డైవింగ్ చేసిన సీనియర్ సిటిజన్ మహిళలు)
Comments
Please login to add a commentAdd a comment