
బెంగళూరు: లోక్‌సభ ఎన్నికల్లో బీవీ నాయక్ అనే నేతకు బీజేపీ టికెట్ నిరారించింది. దీంతో ఆయన అభిమానులు, కార్యకర్తలు తీవ్రంగా మనస్తాపం చెందారు. ఆయన అభిమానులు, మద్దతుదారులు బుధవారం రోడెక్కి నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో శివకుమార్, శివమూర్తి అనే ఇద్దరు బీవీ నాయక్ మద్దతుదారులు నిరసన తెలుపుతూ.. పొట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించారు. దీంతో మరో మద్దతుదారుడు వెంటనే వారి వద్ద నుంచి పేట్రోల్ క్యాన్‌ను లాక్కున్నాడు. అక్కడితో ఆగకుండా బీవీ నాయక్ అభిమానులు టైర్లతో మెయిన్‌రోడ్డును దిగ్బంధం చేశారు.
2019లో బీవీ నాయక్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన సమీప బీజేపీ అభ్యర్థి రాజా అమరేశ్వర నాయక్ చేతిలో పరాజయం పాలయ్యారు. సుమారు 1,17,716 ఓట్లు తేడాతో ఓడిపోయారు. అనంతరం బీవీ నాయక్ బీజేపీలో చేరారు. మొదటి నుంచి బీవీ నాయక్ తనకు బీజేపీ అధిష్టానం రాయ్‌చూర్ ఎంపీ టికెట్ కేటాయిస్తుందని ఆశించారు. అయితే, మరోసారి రాయ్‌చూర్ పార్లమెంట్ స్థానాన్ని సిట్టింగ్ ఎంపీ రాజా అమరేశ్వర నాయక్‌కు కేటాయించింది బీజేపీ. దీంతో తమ నేతకు బీజేపీ టికెట్ కేటాయించలేదని బీవీ నాయక్ అభిమానులు, మద్దతుదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment