three babies
-
ఒకే కాన్పులో ముగ్గురు బిడ్డల జననం
రాయచూరు రూరల్: ఒకే కాన్పులో ముగ్గురు బిడ్డలను ప్రసవించిన ఘటన బెళగావి జిల్లాలో చోటు చేసుకుంది. రాయభాగ తాలూకా కంకణవాడి గ్రామ నివాసి పూజా మొదటి కాన్పులో ఇద్దరు మగ పిల్లలు, ఒక ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. గురువారం రాత్రి మూడలిగిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో ఆమె కాన్పు కోసం చేరారు. ముగ్గురు పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు మహంతేష్ కదాడి, మయూరి, విజయ్, బసవరాజ్ తెలిపారు. -
ఒకే కాన్పులో ముగ్గురు శిశువులకు జననం
పావగడ : ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు జన్మినిచ్చింది ఓ తల్లి. తాలూకాలోని కోటబండ గ్రామానికి చెందిన మంజునాథ్ భార్య శశిరేఖ పావగడ ప్రభుత్వాస్పత్రిలో గురువారం ముగ్గురు శిశువులకు జన్మనిచ్చింది. ఈ సందర్భంగా వైద్యుడు జగదీశ్ మాట్లాడుతూ స్థానిక ప్రభుత్వాసుపత్రిలో ఒకే కాన్పులో ముగ్గురు జన్మించడం ఇదే మొదటిసారని తెలిపారు. తల్లీ బిడ్డలు క్షేమంగా ఉన్నారన్నారు. శస్త్ర చికిత్స ద్వారా కాన్పు చేశామన్నారు. అయితే ముగ్గురూ ఆడ పిల్లలే జన్మించడం విశేషం. ముగ్గురు శిశువులను చూడటానికి జనం అధిక సంఖ్యలో ఆస్పత్రికి తరలి వచ్చారు. -
ఒకే కాన్పులో ముగ్గురు జననం
తల్లి మృతి.. పిల్లలు క్షేమం ఇటిక్యాల: ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన ఓ మాతృమూర్తి ఆలనాపాలనా చూడకుండానే మృత్యుఒడిలోకి జారుకుంది. ఈ ఘటన గురువారం మహబూబ్నగర్ జిల్లా ఇటిక్యాల మండలం కొండేరులో వెలుగుచూసింది. గ్రామానికి చెందిన మందా మహేశ్వరి గత నెల 29వ తేదీన కాన్పు కోసం కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరింది. 30న ఆపరేషన్ ద్వారా ఇద్దరు మగపిల్లలు, ఆడ శిశువుకు జన్మనిచ్చింది. చిన్నారులు ముగ్గురూ ఆరోగ్యంగానే ఉన్నారు. అయితే, రక్తహీనతతో బాధపడుతున్న మహేశ్వరిని గాంధీ ఆస్పత్రికి తరలించగా.. అక్కడే చికిత్స పొందుతూ గురువారం మృతిచెందింది. మృతురాలు మహేశ్వరి మొదటికాన్పులో ఒక బిడ్డకు, రెండో కాన్పులో కవలలకు, మూడోకాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చి తనువు చాలించింది.