తల్లి మృతి.. పిల్లలు క్షేమం
ఇటిక్యాల: ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన ఓ మాతృమూర్తి ఆలనాపాలనా చూడకుండానే మృత్యుఒడిలోకి జారుకుంది. ఈ ఘటన గురువారం మహబూబ్‌నగర్ జిల్లా ఇటిక్యాల మండలం కొండేరులో వెలుగుచూసింది. గ్రామానికి చెందిన మందా మహేశ్వరి గత నెల 29వ తేదీన కాన్పు కోసం కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరింది.
30న ఆపరేషన్ ద్వారా ఇద్దరు మగపిల్లలు, ఆడ శిశువుకు జన్మనిచ్చింది. చిన్నారులు ముగ్గురూ ఆరోగ్యంగానే ఉన్నారు. అయితే, రక్తహీనతతో బాధపడుతున్న మహేశ్వరిని గాంధీ ఆస్పత్రికి తరలించగా.. అక్కడే చికిత్స పొందుతూ గురువారం మృతిచెందింది. మృతురాలు మహేశ్వరి మొదటికాన్పులో ఒక బిడ్డకు, రెండో కాన్పులో కవలలకు, మూడోకాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చి తనువు చాలించింది.
ఒకే కాన్పులో ముగ్గురు జననం
Published Fri, Jan 2 2015 4:57 AM | Last Updated on Sat, Sep 2 2017 7:04 PM
Advertisement
Advertisement