
శివాజీనగర: భర్తను భార్య హత్య చేసిన దుర్ఘటన జే.జే.నగరలో తెల్లవారజామున జరిగింది. మోహన్ (41) హత్యకు గురైన వ్యక్తి. ఇతని భార్య పద్మ (37) నిందితురాలు. ఇద్దరూ బీబీఎంపీ పారిశుధ్య కార్మికులుగా పనిచేస్తుండేవారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆదివారం రాత్రి మోహన్ మద్యం తాగి ఇంటికి వచ్చాడు. ఈ సమయంలో ఇంట్లో పిల్లలు లేరు. దంపతుల మధ్య పెద్ద ఎత్తున గొడవ జరిగింది. మత్తులో ఉన్న మోహన్ కిందపడిపోగా భార్య అతని మెడపై తొక్కింది. స్పృహ తప్పి పడిపోవడంతో ఇరుగుపొరుగు సహాయంతో సమీపంలో ఆసుపత్రిలో తీసుకెళ్తుండగా చనిపోయాడు. పరారైన పద్మను జేజే నగర పోలీసులు గాలించి అరెస్ట్ చేశారు.
చదవండి:
విజయవాడ: అయ్యో.. తల్లీ ఎంతపని చేశావు!
హోంగార్డు భార్య మృతి కేసులో ట్విస్ట్
Comments
Please login to add a commentAdd a comment