5 year Old Boy Playing With Cobra In Karnataka, Video Goes Viral - Sakshi
Sakshi News home page

 ‘కోబ్రా’తో బుడతడి ఆటలు..!

Published Tue, Jun 27 2023 8:11 AM | Last Updated on Tue, Jun 27 2023 9:47 AM

5 year Old Boy Playing With Cobra In Karnataka - Sakshi

కింగ్‌ కోబ్రా (రాచ నాగు) అంటేనే అందరికీ హడల్‌. ఆ పామును చూస్తే పరుగులు తీస్తారు. కానీ ఓ ఐదేళ్ల బుడతడు ఏ మాత్రం భయం లేకుండా దానిని ఆడిస్తున్నాడు. కర్ణాటకలో ఉత్తర కన్నడ జిల్లా శిరసి తాలూకా కేహెచ్‌బీ కాలనీవాసి పాము­లు పట్టే నిపుణుడు ప్రశాంత్‌ హులేకర్‌ కుమారుడు విరాజ్‌ ధైర్యా­న్ని అందరూ మెచ్చుకుంటున్నారు.

బాలుడు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతు­న్నాడు. గత రెండేళ్లుగా తండ్రితో కలిపి పాములు పట్టడం నేర్చుకున్నాడు. సోమవారం కేహెచ్‌బీ కా­ల­నీలో కింగ్‌ కోబ్రా చొరబడిందని తెలిసి తండ్రీ­కొడుకులు దానిని బంధించేందుకు వచ్చారు. ఈ సందర్భంగా విరాజ్‌ స్వేచ్ఛగా స­ర్పాన్ని ఆడి­స్తున్న దృశ్యాలు సోషల్‌ మీడి­యాలో వైరల్‌ అ­య్యా­యి. తర్వాత దానిని దూరంగా విడిచిపెట్టారు.  
– బనశంకరి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement