
జీమెయిల్‌లో ఇక బ్లాకింగ్ ఫీచరు
న్యూఢిల్లీ: టెక్నాలజీ సంస్థ గూగుల్ ఈమెయిల్ సర్వీస్ జీమెయిల్‌లో ఇకపై ‘బ్లాక్’, ‘అన్‌సబ్‌స్క్రయిబ్’ ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. బ్లాక్ ఫీచర్‌ను ఉపయోగించి ...అవాంఛిత ఈమెయిల్ అడ్రస్‌ల నుంచి వచ్చే మెయిల్స్‌ను బ్లాక్ చేయొచ్చని గూగుల్ పేర్కొంది. ఆయా మెయిల్ ఐడీల నుంచి ఇకపై వచ్చే మెయిల్స్ నేరుగా స్పామ్ ఫోల్డర్‌లోకి వెడతాయి. భవిష్యత్‌లో కావాలంటే సెటింగ్స్‌లోకి వెళ్లి సదరు ఐడీలను అన్‌బ్లాక్ చేయొచ్చు. అలాగే ఏదైనా మెయిల్ ఐడీ నుంచి అన్‌సబ్‌స్క్రయిబ్ కూడా చేసే ఫీచర్‌ను ఆండ్రాయిడ్ యాప్‌లోనూ అందుబాటులోకి తెస్తున్నట్లు సంస్థ తెలిపింది. గతంలో ఎప్పుడో సబ్‌స్క్రయిబ్ చేసినా ప్రస్తుతం అంతగా ఉపయోగించని న్యూస్‌లెటర్స్ మొదలైన వాటి బారి నుంచి తప్పుకునేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుందని తెలిపింది.