ఆది సాయికుమార్
ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘బ్లాక్’ అనే టైటిల్ ఖరారైంది. ఇందులో దర్శనా బానిక్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మహంకాళి మూవీస్ బ్యానర్‌పై మహంకాళి దివాకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జి.బి కృష్ణ దర్శకుడు. ఇందులో పోలీసాఫీసర్ గెటప్‌లో కనిపించనున్నారు ఆది. ఇప్పటికే 70 శాతం చిత్రీకరణ పూర్తయింది. లాక్‌డౌన్ తర్వాత బ్యాలెన్స్ షూట్‌ను పూర్తి చేసేందుకు ప్రణాళిక వేస్తున్నారు చిత్రబృందం.
ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన కొన్ని వర్కింగ్ స్టిల్స్‌ను విడుదల చేశారు. ‘‘ఈ చిత్రంలో ఆది క్యారెక్టర్ చాలా కొత్తగా ఉంటుంది. మిగిలిన షూట్‌ను వీలైనంత తొందరగా పూర్తి చేసి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు నిర్మాత దివాకర్. ఈ సినిమాకు సంగీతం: సురేష్ బొబ్బిలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శంకర్.
Comments
Please login to add a commentAdd a comment