ద్విచక్రవాహం నడిపేవారందరికీ హెల్మెట్‌కున్న ప్రాధాన్యత ఏమిటో తెలిసేవుంటుంది. హెల్మెట్ పెట్టుకుని వాహనం నడపడం వలన ప్రమాదాల బారి నుంచి తప్పించుకోగలుగుతాం. రోడ్డు ప్రమాదాల బారిన పడిన వారిలో చాలామంది తలకు గాయాలై మరణిస్తున్నారని పలు రిపోర్టులు చెబుతున్నాయి. అందుకే వాహనం నడిపే ప్రతీఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని ప్రభుత్వం చెబుతోంది.
చాలావరకూ హెల్మెట్లు నలుపు రంగులోనే ఉండటాన్ని మీరు గమనించే ఉంటారు. ఇలానే ఎందుకు ఉంటాయని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? దీనికి గల కారణం ఏమిటో, దీనివెనుకనున్న సైన్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. నిజానికి హెల్మెట్లు నలుపు రంగులో ఉండటం వెనుక సైన్స్ కన్నా వాటి ఉత్పత్తిదారుల లాభమే అధికంగా ఉంది. హెల్మెట్ తయారీ కంపెనీలు వాటి తయారీలో వినియోగించే ప్లాస్టిక్, ఫైబర్ గ్లాస్ నలుపు రంగులోనే ఉంటాయి. వీటి ప్రాసెస్‌లో వివిధ మెటీరియల్స్ వినియోగిస్తారు. ఫలితంగా పూర్తి మిక్చర్ కలర్ లేదా పిగ్మెంట్ బ్లాక్‌గా మారుతుంది. కంపెనీలు ఖర్చును తగ్గించుకునేందుకు ఈ పిగ్మెంట్‌తోనే హెల్మెట్‌లను తయారు చేస్తాయి.
ఇది కూడా కారణమేనట!
మరోవైపు చూస్తే పలు కంపెనీలు ఫ్యాషన్‌ను దృష్టిలో పెట్టుకుని నలుపు రంగు హెల్మెట్లను తయారు చేస్తాయని కొందరు చెబుతుంటారు. వాహనం నడిపేవారు ఏ రంగు దుస్తులు ధరించినా, వాటికి నలుపురంగు హెల్మెట్ మ్యాచ్ అవుతుంది. దీంతో వారు హుందాగా కనిపిస్తారుట. అలాగే సాధారణంగా జుట్టు నలుపురంగులోనే ఉంటున్న కారణంగా హెల్మెట్‌ను కూడా నలుపు రంగులోనే తయారు చేస్తారని చెబుతారు. పైగా నలుపురంగు హెల్మెట్లను యువత అత్యధికంగా ఇష్టపడతారని పలు సర్వేలు తెలిపాయి. రోడ్డు రవాణా, రహదారుల మంత్రత్వశాఖ తెలిపిన వివరాల ప్రకారం 2021లో జరిగిన మొత్తం రోడ్డు ప్రమాదాల్లో 46,593 మంది హెల్మెట్ ధరించని కారణంగా మృతి చెందారు.
ఇది కూడా చదవండి: ‘తాజ్’ యమ క్రేజ్... ఆదాయంలో టాప్ వన్!
Comments
Please login to add a commentAdd a comment