helmet ..
-
హెల్మెట్లు చాలావరకూ నలుపు రంగులోనే ఎందుకుంటాయంటే..
ద్విచక్రవాహం నడిపేవారందరికీ హెల్మెట్కున్న ప్రాధాన్యత ఏమిటో తెలిసేవుంటుంది. హెల్మెట్ పెట్టుకుని వాహనం నడపడం వలన ప్రమాదాల బారి నుంచి తప్పించుకోగలుగుతాం. రోడ్డు ప్రమాదాల బారిన పడిన వారిలో చాలామంది తలకు గాయాలై మరణిస్తున్నారని పలు రిపోర్టులు చెబుతున్నాయి. అందుకే వాహనం నడిపే ప్రతీఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని ప్రభుత్వం చెబుతోంది. చాలావరకూ హెల్మెట్లు నలుపు రంగులోనే ఉండటాన్ని మీరు గమనించే ఉంటారు. ఇలానే ఎందుకు ఉంటాయని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? దీనికి గల కారణం ఏమిటో, దీనివెనుకనున్న సైన్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. నిజానికి హెల్మెట్లు నలుపు రంగులో ఉండటం వెనుక సైన్స్ కన్నా వాటి ఉత్పత్తిదారుల లాభమే అధికంగా ఉంది. హెల్మెట్ తయారీ కంపెనీలు వాటి తయారీలో వినియోగించే ప్లాస్టిక్, ఫైబర్ గ్లాస్ నలుపు రంగులోనే ఉంటాయి. వీటి ప్రాసెస్‌లో వివిధ మెటీరియల్స్ వినియోగిస్తారు. ఫలితంగా పూర్తి మిక్చర్ కలర్ లేదా పిగ్మెంట్ బ్లాక్‌గా మారుతుంది. కంపెనీలు ఖర్చును తగ్గించుకునేందుకు ఈ పిగ్మెంట్తోనే హెల్మెట్లను తయారు చేస్తాయి. ఇది కూడా కారణమేనట! మరోవైపు చూస్తే పలు కంపెనీలు ఫ్యాషన్‌ను దృష్టిలో పెట్టుకుని నలుపు రంగు హెల్మెట్లను తయారు చేస్తాయని కొందరు చెబుతుంటారు. వాహనం నడిపేవారు ఏ రంగు దుస్తులు ధరించినా, వాటికి నలుపురంగు హెల్మెట్ మ్యాచ్ అవుతుంది. దీంతో వారు హుందాగా కనిపిస్తారుట. అలాగే సాధారణంగా జుట్టు నలుపురంగులోనే ఉంటున్న కారణంగా హెల్మెట్‌ను కూడా నలుపు రంగులోనే తయారు చేస్తారని చెబుతారు. పైగా నలుపురంగు హెల్మెట్లను యువత అత్యధికంగా ఇష్టపడతారని పలు సర్వేలు తెలిపాయి. రోడ్డు రవాణా, రహదారుల మంత్రత్వశాఖ తెలిపిన వివరాల ప్రకారం 2021లో జరిగిన మొత్తం రోడ్డు ప్రమాదాల్లో 46,593 మంది హెల్మెట్ ధరించని కారణంగా మృతి చెందారు. ఇది కూడా చదవండి: ‘తాజ్’ యమ క్రేజ్... ఆదాయంలో టాప్ వన్! -
హెల్మెట్ తప్పనిసరి..
దశలవారీగా ద్విచక్ర వాహనదారులపై ఒత్తిడి అవగాహనతోనే లక్ష్య సాధనకు ప్రయత్నం ఆరునెలల్లో అందరూవాడేలాకృషితప్పనిసరి.. వరంగల్ : నగరంలో ప్రతి ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ వాడేలా చర్యలు తీసుకునేందు కు పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు ప్రయత్నా లు ముమ్మరం చేస్తున్నారు. 28న నిర్వహించిన ‘మీ క్షేమం’ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చిందని, అందులో పలువురు చేసిన సూచనలను అమలు చేసేందుకు ప్రయత్నిస్తామని అన్నారు. శుక్రవారం కమిషనరేట్‌లో ఆయన మాట్లాడుతూ.. హెల్మట్ల వాడకంపై విస్తృతం గా ప్రచారం నిర్వహించేలా ప్రణాళిక రూపొం దిస్తున్నామన్నారు. హెల్మెట్లు లేని వారి నుంచి ఫైన్ వసూలు చేయడం వల్ల లక్ష్యం సాధించ డం కష్టమని పలువురు అభిప్రాయపడినట్లు చెప్పారు. ప్రస్తుతం రోజుకు సుమారు 150 మంది నుంచి ‘హెల్మెట్’ ఫైన్లు వసూలు చేస్తున్నట్లు తెలిపారు. ఫైన్ వేయకుండా వారి లో పరివర్తన తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నట్లు వివరించా రు. మొదటగా పోలీస్ సిబ్బంది హెల్మెట్ వాడేలా చర్యలు తీసుకుంటామన్నారు. కాలేజీ యాజమాన్యాలతో భేటీ... కాలేజీ విద్యార్థులు వేగంగా బైక్‌లు నడుపుతున్నారని గుర్తించామని చెప్పారు. అడ్మిషన్ల సమయంలో విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించి తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకొని బైక్ నడుపాలన్న నిబంధనలను కాలేజీ యాజమాన్యంతో పెట్టించేలా ప్రయత్నిస్తున్నామని తెలిపారు. నగరంలో గోతులు ఉన్న రోడ్లను గుర్తించామని, వాటి మరమ్మతుకు గ్రేటర్ కార్పొరేషన్ అధికారులతో చర్చిస్తామని చెప్పారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కడెక్కడ జరుగుతాయన్న విషయాలను అధ్యయనం చేయాలని నిట్ అధికారులను కోరినట్లు తెలిపారు. ప్రీపెయిడ్ ఆటోలు... నగరంలో ప్రీపెయిడ్ ఆటోలను ప్రారంభించాలని యోచిస్తున్నామని, అందుకోసం ఆటో యూనియన్లతో త్వరలో సమావేశం అవుతామని సీపీ పేర్కొన్నారు. స్టాండ్లు ఏర్పాటుచేసి ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.