- దశలవారీగా ద్విచక్ర వాహనదారులపై ఒత్తిడి
- అవగాహనతోనే లక్ష్య సాధనకు ప్రయత్నం
- ఆరునెలల్లో అందరూవాడేలాకృషితప్పనిసరి..
హెల్మెట్ తప్పనిసరి..
Published Fri, Jul 29 2016 10:48 PM | Last Updated on Mon, Sep 4 2017 6:57 AM
వరంగల్ : నగరంలో ప్రతి ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ వాడేలా చర్యలు తీసుకునేందు కు పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు ప్రయత్నా లు ముమ్మరం చేస్తున్నారు. 28న నిర్వహించిన ‘మీ క్షేమం’ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చిందని, అందులో పలువురు చేసిన సూచనలను అమలు చేసేందుకు ప్రయత్నిస్తామని అన్నారు. శుక్రవారం కమిషనరేట్‌లో ఆయన మాట్లాడుతూ.. హెల్మట్ల వాడకంపై విస్తృతం గా ప్రచారం నిర్వహించేలా ప్రణాళిక రూపొం దిస్తున్నామన్నారు.
హెల్మెట్లు లేని వారి నుంచి ఫైన్ వసూలు చేయడం వల్ల లక్ష్యం సాధించ డం కష్టమని పలువురు అభిప్రాయపడినట్లు చెప్పారు. ప్రస్తుతం రోజుకు సుమారు 150 మంది నుంచి ‘హెల్మెట్’ ఫైన్‌లు వసూలు చేస్తున్నట్లు తెలిపారు. ఫైన్ వేయకుండా వారి లో పరివర్తన తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నట్లు వివరించా రు. మొదటగా పోలీస్ సిబ్బంది హెల్మెట్ వాడేలా చర్యలు తీసుకుంటామన్నారు.
కాలేజీ యాజమాన్యాలతో భేటీ...
కాలేజీ విద్యార్థులు వేగంగా బైక్‌లు నడుపుతున్నారని గుర్తించామని చెప్పారు. అడ్మిషన్ల సమయంలో విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించి తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకొని బైక్ నడుపాలన్న నిబంధనలను కాలేజీ యాజమాన్యంతో పెట్టించేలా ప్రయత్నిస్తున్నామని తెలిపారు. నగరంలో గోతులు ఉన్న రోడ్లను గుర్తించామని, వాటి మరమ్మతుకు గ్రేటర్ కార్పొరేషన్ అధికారులతో చర్చిస్తామని చెప్పారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కడెక్కడ జరుగుతాయన్న విషయాలను అధ్యయనం చేయాలని నిట్ అధికారులను కోరినట్లు తెలిపారు.
ప్రీపెయిడ్ ఆటోలు...
నగరంలో ప్రీపెయిడ్ ఆటోలను ప్రారంభించాలని యోచిస్తున్నామని, అందుకోసం ఆటో యూనియన్లతో త్వరలో సమావేశం అవుతామని సీపీ పేర్కొన్నారు. స్టాండ్లు ఏర్పాటుచేసి ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Advertisement