న్యూఢిల్లీ: అస్తమానం వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో మునిగిపోయేకంటే కాస్తంత సేపు వాటిని పక్కనబెడితే మానసిక ఆరోగ్యంతోపాటు ఉద్యోగంలో సంతృప్తి పెరుగుతాయని తాజా అధ్యయనం ఒకటి తేల్చి చెప్పింది. జర్మనీలోని ప్రఖ్యాత రూహర్–యూనివర్సిటీ బూచమ్, జర్మనీ మానసిక ఆరోగ్య కేంద్రం నిర్వహించిన అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.
► సామాజిక మాధ్యమాల్లో గడిపేవారు తమ ఉద్యోగంపై దృష్టిపెట్టలేకపోతున్నారు. వీరు ఒక 30 నిమిషాలు సోషల్ మీడియా వాడకాన్ని తగ్గిస్తే మానసిక ఆర్యోగం మెరుగవడంతోపాటు వృత్తిజీవితం పట్ల సంతృప్తి వ్యక్తంచేస్తున్నారు
► సోషల్‌మీడియాలో ఆన్‌లైన్‌లో లేనపుడు ఏదో మిస్ అవుతున్నామే అనే భావన ఈ 30 నిమిషాల దూరం తర్వాత తగ్గిందట
► ఇంతకాలం సోషల్ మీడియాలో గడుపుతూనే పని చేసిన వాళ్లు అతిగా పనిచేశామని భావించేవారట. 30 నిమిషాలు సోషల్‌మీడియా పక్కనబెడితే ‘అతిపని’ భావన కొంచెం తగ్గిందట
► పని మధ్యలో వదిలేసి వాట్సాప్, ఫేస్‌బుక్ చూసేవాళ్లు తిరిగి పని మీద పూర్తి ఫోకస్ చేయలేకపోతున్నారు. దీంతో పనిలో చక్కని ఫలితాలు అందుకోలేకపోతున్నారు
► రోజుకు కనీసం 35 నిమిషాలు సోషల్‌మీడియాలో గడిపేవారిపై అధ్యయనం చేశారు
► అధ్యయనంలో భాగంగా సగం మంది పాత అలవాట్లనే కొనసాగించగా, మిగతా వారిని పూర్తిగా మీడియాకు దూరంపెట్టారు
► ఒక ఏడు రోజుల తర్వాత వారి పనిభారం, ఉద్యోగంలో సంతృప్తి, మానసిక ఆరోగ్యం, ఒత్తిడి స్థాయిలు, పని పట్ల అంకితభావం, మీడియాకు ఎందుకు అతుక్కుపోవాల్సి వస్తోంది? వంటి ప్రశ్నలడిగి విశ్లేíÙంచారు.
► దైనందిన జీవితంలో కోల్పోయిన భావోద్వే గాలను ‘సోషల్ మీడియా’ ద్వారానైనా పొందేందుకు కొందరు వాటికి అతుక్కుపోయారని అధ్యయనం అభిప్రాయపడింది
► కొందరు మెరుగైన ఉద్యోగం కోసం లింక్డ్‌ఇన్ వంటి వేదికను ఆశ్రయించారు.
► వాస్తవిక ప్రపంచం నుంచి తప్పించుకునేందుకు కొందరు సోషల్ నెట్‌వర్క్‌ను ఆశ్రయిస్తున్నారు. ఇవిలాగే కొనసాగితే ప్రతికూల ప్రభావం చూపుతాయని అధ్యయనం హెచ్చరించింది.
‘సామాజిక’ దూరంతో మానసిక ఆరోగ్యం, ఉద్యోగ తృప్తి
Published Mon, Dec 18 2023 4:43 AM | Last Updated on Mon, Dec 18 2023 4:43 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment