job satisfaction
-
ఆడుతు పాడుతూ పనిచేస్తుంటే..
సాక్షి, హైదరాబాద్: దేశంలోని పనిప్రదేశాల్లో స్నేహాలు ఉద్యోగులకు 49 శాతం ఎక్కువ జాబ్ శాటిస్ఫాక్షన్ను అందిస్తున్నాయని ది పవర్ ఆఫ్ సోషలైజేషన్ పేరిట జరిగిన తాజా సర్వే వెల్లడించింది. సంస్థల ఉత్పాదకత పెరుగుదల, దీర్ఘకాలిక విజయాల సాధనకు సైతం ఇవి దోహదపడుతున్నాయని తెలిపింది. అదే సమయంలో సహచరులతో స్నేహంచేయని మరో 49 శాతం మంది భారత ఉద్యోగులు తాము ఒంటరిగా ఉన్నామని కుమిలిపోతున్నట్లు పేర్కొంది. భారత్ సహా 21 దేశాల్లో పనిచేస్తున్న వివిధ రంగాల్లోని ఉద్యోగుల ఆఫీసు స్నేహాలపై ఫుడ్ అండ్ ఫెసిలిటీ సర్వీసెస్ సంస్థ కంపాస్ గ్రూప్ ఇండియా, మింటెల్ అనే సంస్థతో కలిసి చేపట్టిన అధ్యయనంలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఆఫీసుల్లో లంచ్ లేదా టిఫిన్ చేసే వేళలు లేదా కలిసి టీ, ఇతర పానియాలు సేవించే సమయాల్లో చోటుచేసుకొనే సంభాషణల వల్ల ఉద్యోగుల మధ్య సంబంధాలు బలోపేతం అవుతున్నాయని సర్వే గుర్తించింది.అదేవిధంగా సంబంధిత సంస్థల వ్యూహాత్మక లక్ష్యాల సాధనకు ఉద్యోగులను అనుసంధానం చేయడంలో ఇవి ముఖ్యపాత్ర పోషిస్తున్నట్లు తేల్చింది. మరోవైపు ఒంటరితనానికి లోనవుతున్న ఉద్యోగులు సామాజికంగా కనెక్ట్ అయిన వారితో పోలిస్తే రెట్టింపు సిక్ లీవ్‌లు తీసుకుంటున్నారని.. ఇది సంస్థల ఖర్చులు, ఉత్పాదకతపై నేరుగా ప్రభావం చూపుతోందని సర్వేలో వెల్లడైంది.వెల్లడైన అంశాలు ఇవీ..⇒ ఆఫీసుల్లో సామాజిక కార్యక్రమాలు ఉద్యోగుల సంతోషాన్ని 50% పెంచుతున్నాయి.⇒ భోజన వేళల్లో సహోద్యోగులతో సంభాషణలు సంబంధాలను బలోపేతం చేస్తున్నాయని సర్వేలో పాల్గొన్న వారిలో 75% మంది ఉద్యోగులు అభిప్రాయపడ్డారు.⇒ సహోద్యోగులతో క్రమం తప్పకుండా సంభాషించే 44% మంది ఉద్యోగులు తమకు ఆఫీసులో కనీసం ఒక మంచి స్నేహితుడు ఉన్నాడని నమ్ముతున్నారు.⇒ సామాజికంగా కనెక్ట్ అయిన 38% మంది ఉద్యోగుల మధ్య బంధం ధృడంగా ఉంది.⇒ ఆఫీసుల్లో సామాజిక సంబంధాలు లేని వారు 10 శాతమే.⇒ క్యాంటీన్లలో 58%, భోజన విరామ సమయాల్లో 67% సామాజికీకరణ జరుగుతోంది.⇒ సామాజిక కలయికల సందర్భంగా 71% మంది ఉద్యోగులు తమ సంస్థ గురించి సానుకూల ప్రచారం చేస్తున్నారు. ఇది బలమైన ఎంప్లాయర్ నెట్ ప్రమోటర్ స్కోర్ ను సృష్టిస్తుంది.⇒ కార్యాలయంలో స్నేహితులుగా ఉన్న 41% మంది ఉద్యోగులు బలమైన భావనను ఆస్వాదిస్తున్నారు.⇒ సామాజిక సంబంధాలు లేని కార్యాలయాల్లో ఉద్యోగుల మధ్య సహకార రేటు 12 శాతమే.సమస్యల పరిష్కారంలో యాజమాన్యాలకు ఇదో కొత్త దృక్పథం..ఉద్యోగులు, ఉత్పాదకత వంటి అంశాలకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో సర్వే ఫలితాలు సంస్థల యాజమాన్యాలకు కొత్త దృక్పథాన్ని అందిస్తాయి. సహోద్యోగులతో స్నేహంగా మెలిగే 42% మంది ఉద్యోగులు తమ సంస్థ వ్యూహం, లక్ష్యాలను స్పష్టంగా అర్థం చేసుకుంటున్నారు. సామాజిక సంబంధాలు లేని కార్యాలయాల్లో కేవలం 19% మంది ఉద్యోగులే తమ సంస్థలతో కనెక్ట్ అయినట్లు భావిస్తున్నారు. ఇది సంస్థలకు తీవ్రమైన వ్యాపార ప్రమాదంగా మారుతోంది.– వికాస్ చావ్లా, కంపాస్ గ్రూప్ ఇండియా ఎండీ -
‘సామాజిక’ దూరంతో మానసిక ఆరోగ్యం, ఉద్యోగ తృప్తి
న్యూఢిల్లీ: అస్తమానం వాట్సాప్, ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో మునిగిపోయేకంటే కాస్తంత సేపు వాటిని పక్కనబెడితే మానసిక ఆరోగ్యంతోపాటు ఉద్యోగంలో సంతృప్తి పెరుగుతాయని తాజా అధ్యయనం ఒకటి తేల్చి చెప్పింది. జర్మనీలోని ప్రఖ్యాత రూహర్–యూనివర్సిటీ బూచమ్, జర్మనీ మానసిక ఆరోగ్య కేంద్రం నిర్వహించిన అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ► సామాజిక మాధ్యమాల్లో గడిపేవారు తమ ఉద్యోగంపై దృష్టిపెట్టలేకపోతున్నారు. వీరు ఒక 30 నిమిషాలు సోషల్ మీడియా వాడకాన్ని తగ్గిస్తే మానసిక ఆర్యోగం మెరుగవడంతోపాటు వృత్తిజీవితం పట్ల సంతృప్తి వ్యక్తంచేస్తున్నారు ► సోషల్‌మీడియాలో ఆన్లైన్లో లేనపుడు ఏదో మిస్ అవుతున్నామే అనే భావన ఈ 30 నిమిషాల దూరం తర్వాత తగ్గిందట ► ఇంతకాలం సోషల్ మీడియాలో గడుపుతూనే పని చేసిన వాళ్లు అతిగా పనిచేశామని భావించేవారట. 30 నిమిషాలు సోషల్‌మీడియా పక్కనబెడితే ‘అతిపని’ భావన కొంచెం తగ్గిందట ► పని మధ్యలో వదిలేసి వాట్సాప్, ఫేస్బుక్ చూసేవాళ్లు తిరిగి పని మీద పూర్తి ఫోకస్ చేయలేకపోతున్నారు. దీంతో పనిలో చక్కని ఫలితాలు అందుకోలేకపోతున్నారు ► రోజుకు కనీసం 35 నిమిషాలు సోషల్‌మీడియాలో గడిపేవారిపై అధ్యయనం చేశారు ► అధ్యయనంలో భాగంగా సగం మంది పాత అలవాట్లనే కొనసాగించగా, మిగతా వారిని పూర్తిగా మీడియాకు దూరంపెట్టారు ► ఒక ఏడు రోజుల తర్వాత వారి పనిభారం, ఉద్యోగంలో సంతృప్తి, మానసిక ఆరోగ్యం, ఒత్తిడి స్థాయిలు, పని పట్ల అంకితభావం, మీడియాకు ఎందుకు అతుక్కుపోవాల్సి వస్తోంది? వంటి ప్రశ్నలడిగి విశ్లేíÙంచారు. ► దైనందిన జీవితంలో కోల్పోయిన భావోద్వే గాలను ‘సోషల్ మీడియా’ ద్వారానైనా పొందేందుకు కొందరు వాటికి అతుక్కుపోయారని అధ్యయనం అభిప్రాయపడింది ► కొందరు మెరుగైన ఉద్యోగం కోసం లింక్డ్ఇన్ వంటి వేదికను ఆశ్రయించారు. ► వాస్తవిక ప్రపంచం నుంచి తప్పించుకునేందుకు కొందరు సోషల్ నెట్‌వర్క్‌ను ఆశ్రయిస్తున్నారు. ఇవిలాగే కొనసాగితే ప్రతికూల ప్రభావం చూపుతాయని అధ్యయనం హెచ్చరించింది. -
బాస్.. సంతృప్తిగా ఉంది
- డీఆర్వో హేమసాగర్ - నేడు ఉద్యోగ విరమణ అనంతపురం అర్బన్: ‘‘బాస్... ఈ జిల్లాలో పనిచేయడం చాలా సంతృప్తిగా ఉంది...’’ అని డీఆర్ఓ పి.హెచ్.హేమసాగర్ అన్నారు. మూడేళ్లపాటు ఇక్కడ డీఆర్ఓగా విధులు నిర్వర్తించిన ఆయన ఆదివారం ఉద్యోగ విరమణ చేయనున్నారు. ప్రతి ఒక్కరినీ చెప్పండి ‘బాస్’ అంటూ నవ్వుతూ పలకరించడం ఆయన నైజం. ఉద్యోగ విమరణ చేస్తున్న సందర్భంగా సాక్షితో ఆయన మాట్లాడారు. ‘‘మాది కర్నూలు జిల్లా. 1984–85లో ఉద్యోగంలో చేరాను. 2002లో డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతి లభించింది. కడపలో మూడున్నర సంవత్సరాల పాటు సంక్షేమ కార్పొరేషన్ల జనరల్ మేనేజర్‌గా పనిచేశాను. ఆ తరువాత హైదరాబాద్‌లో ఆరు నెలలు పనిచేశాను. కర్నూలు జిల్లాలో డీఆర్ఓగా పనిచేశాను. 2013 జూన్ 3న జిల్లాలో డీఆర్ఓగా బాధ్యతలు స్వీకరించాను. అనంతపురం జిల్లాలో పనిచేయడం, మూడేళ్లపాటు ఇక్కడి ప్రజలకు సేవ అందించడంలో ఎంతో సంతోషం, సంతృప్తిని ఇచ్చింది.’’ అన్నారు. ఆయన ఇక్కడ బాధ్యతలు చేపట్టిన ఆరు నెలలకు సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వేత్తున ఎగిసింది. ఆ క్రమంలో ఉద్యోగ వర్గాలకు ఆయన ప్రాతినిథ్యం వహించి ఉద్యమాన్ని ముందుకు నడిపారు. నేడు సన్మాన సభ డీఆర్ఓ పీహెచ్ హేమసాగర్ ఉద్యోగ విరమణ సందర్భంగా ఆయనకు ఉద్యోగులు సన్మాన సభ ఏర్పాటు చేశారు. కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో ఆదివారం సాయంత్రం 5 గంటలకు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కలెక్టర్ కోన శశిధర్, జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మికాంతం, జేసీ–2 సయ్యద్ ఖాజామొహిద్దీన్, ఇతర శాఖల జిల్లా అధికారులు, ఉద్యోగులు పాల్గొననున్నారు.