అంధత్వ రహిత సమాజానికి ముందుకు రావాలి | blind people less society | Sakshi
Sakshi News home page

అంధత్వ రహిత సమాజానికి ముందుకు రావాలి

Aug 28 2016 10:34 PM | Updated on Apr 3 2019 4:04 PM

అంధత్వ రహిత సమాజానికి ముందుకు రావాలి - Sakshi

అంధత్వ రహిత సమాజానికి ముందుకు రావాలి

కృష్ణ ఐ బ్యాంక్‌కు నేత్రదానం చేస్తూ ప్రమాణపత్రాలపై సంతకాలు చేయడమే కాకుండా వేదికపై ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా వీరబాబు, గోపీత్రినాథ్‌లు మాట్లాడుతూ నేత్రదానంపై ప్రతీ ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని అన్నారు. నేత్రదానంపై ఎటువంటి అపోహలు పెట్టుకోకుండా తాను చనిపోతూ మరో ఇద్దరికి కంటి చూపు ప్రసాదించాలని పిలుపునిచ్చారు. అలాగే మోటేపల్లి జనార్ధన్‌రావు, తోట గోపీ

ఆదివెలమ సంక్షేమ సంఘం పిలుపు
నేత్రదానం చేస్తున్నట్టు ప్రమాణ స్వీకారం
కిర్లంపూడి : అంధత్వ రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆదివెలమ సంక్షేమ సంఘం నాయకులు మోటేపల్లి వీరభద్రరావు (వీరబాబు), తోట గోపీత్రినాథ్‌లు పిలుపునిచ్చారు. సంఘం ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక పద్మనాభ ఫంక్షన్‌ హాలులో జరిగిన కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులతో పాటు ఆదివెలమ కులానికి చెందిన సుమారు 50 మందితో బాదం బాలకృష్ణ ఐ బ్యాంక్‌కు నేత్రదానం చేస్తూ ప్రమాణపత్రాలపై సంతకాలు చేయడమే కాకుండా వేదికపై ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా వీరబాబు, గోపీత్రినాథ్‌లు మాట్లాడుతూ నేత్రదానంపై ప్రతీ ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని అన్నారు. నేత్రదానంపై ఎటువంటి అపోహలు పెట్టుకోకుండా తాను చనిపోతూ మరో ఇద్దరికి కంటి చూపు ప్రసాదించాలని పిలుపునిచ్చారు. అలాగే మోటేపల్లి జనార్ధన్‌రావు, తోట గోపీత్రినా«ద్‌లు తమ మరణానంతరం తమ దేహాలను కాకినాడ రంగరాయ మెడికల్‌ కళాశాలకు అప్పగిస్తూ వీలునామా రాయనున్నట్టు తెలియజేశారు. నేత్రదానం చేస్తూ ప్రమాణం చేసిన వారిలో నానిశెట్టి శివరామకృష్ణ, మాదిరెడ్డి శ్రీరామ్‌కుమార్, రూపాదేవి, వాణీ విజయలక్ష్మి, మోటేపల్లి వీరభద్రరావు, నానిశెట్టి నారాయణరావు, తోట నాగమోహిని, కోకా సరోజినీదేవి, అరవ సుదర్శనరావు, మోటేపల్లి జనార్దనరావు తదితరులు ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement