
న్యూఢిల్లీ: దేశంలో ఈ ఏడాది సాధారణ కంటే తక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రైవేట్ వాతావరణ అంచనాల ఏజెన్సీ ‘స్కైమెట్ వెదర్’ సోమవారం ప్రకటించింది. లా నినా, ఎల్‌నినో ప్రభావంతో కరువు సంభవించడానికి 20 శాతం అవకాశాలు ఉన్నట్లు వెల్లడించింది.
వరుసగా గత నాలుగేళ్లుగా దేశంలో సాధారణం, అంతకంటే ఎక్కువ వర్షాలు పడ్డాయి. ఈసారి సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైతే ప్రధానంగా వ్యవసాయ రంగంలో ఇబ్బందులు తప్పవు. పంటల ఉత్పత్తి పడిపోతుంది. తద్వారా ఆహార ధాన్యాల ధరలు పెరుగుతాయి.
చదవండి: ఆప్‌కు జాతీయ హోదా.. ఆ మూడు పార్టీలకు షాక్