skymet weather
-
ఈసారి వానలు తక్కువే.. కరువుకు 20 శాతం ఛాన్స్! ఇబ్బందులు తప్పవు
న్యూఢిల్లీ: దేశంలో ఈ ఏడాది సాధారణ కంటే తక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రైవేట్ వాతావరణ అంచనాల ఏజెన్సీ ‘స్కైమెట్ వెదర్’ సోమవారం ప్రకటించింది. లా నినా, ఎల్‌నినో ప్రభావంతో కరువు సంభవించడానికి 20 శాతం అవకాశాలు ఉన్నట్లు వెల్లడించింది. వరుసగా గత నాలుగేళ్లుగా దేశంలో సాధారణం, అంతకంటే ఎక్కువ వర్షాలు పడ్డాయి. ఈసారి సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైతే ప్రధానంగా వ్యవసాయ రంగంలో ఇబ్బందులు తప్పవు. పంటల ఉత్పత్తి పడిపోతుంది. తద్వారా ఆహార ధాన్యాల ధరలు పెరుగుతాయి. చదవండి: ఆప్‌కు జాతీయ హోదా.. ఆ మూడు పార్టీలకు షాక్ -
చల్లని కబురు; జూన్ 4న కేరళకు రుతుపవనాలు
సాక్షి, న్యూఢిల్లీ : భానుడి ప్రతాపంతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు చల్లని కబురు అందింది. జూన్ 4న రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని జూన్ 29 నాటికి దేశ రాజధాని ఢిల్లీకి చేరుతాయని ప్రైవేట్ వాతావరణ కేంద్రం స్కైమెట్ అంచనా వేసింది. ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని స్కైమెట్ పేర్కొంది. అండమాన్ నికోబార్ దీవుల మీదుగా రుతపవనాలు ఈనెల 22న ప్రవేశించి కేరళ దిశగా కదులుతాయని వాటి పురోగమనం మందకొడిగా ఉండటంతో ఈ ఏడాది దేశంలో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. దేశంలోని నాలుగు ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం కురుస్తుందని, తూర్పు, ఈశాన్య, మధ్య భారత ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసింది. జూన్ 4కు అటూ ఇటుగా రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని పేర్కొంది. -
ఎల్‌నినో ప్రమాదంతో తక్కువ వర్షాలు: స్కైమెట్
వ్యవసాయం కీలకమైన భారత ఆర్థిక వ్యవస్థకు, అన్నదాతలకు నిజంగా బ్యాడ్ న్యూస్. ప్రయివేట్ రంగ సంస్థ స్కైమెట్ వర్షపాతానికి సంబంధించిన నిరాశాజనక అంచనాలను బుధవారం విడుదల చేసింది. ఈ ఏడాది సాధారణ వర్షపాతం సాధారణం తక్కువ నమోదవుతుందని తెలిపింది. సగటుకంటే అధికం లేదా అధిక వర్షపాతానికి అవకాశాలు కనిపించడంలేదంటూ ముందస్తు వాతావరణ అంచనాల్లో స్కైమెట్ పేర్కొంది. 2019 సంవత్సరంలో సాధారణం కంటే అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం 55 శాతం ఉందని తెలిపింది. అంతేకాదు కరువు సంభవించే అవకాశాలు 15 శాతం ఉన్నాయంటూ సంచలన అంచనాలను వెల్లడించింది. ఎల్పీఏ వర్షపాతం జూన్‌లో 77 శాతం, 91 శాతం, ఆగస్టులో 102 శాతం, సెప్టెంబరులో 99 శాతంగా వుంటుందని అంచనా వేసింది.ఎల్‌నినో పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని అభిప్రాయపడింది. ఎల్పీఏ 96-104 శాతం మధ్య రుతుపవనాలు సాధారణమైనవిగా భావిస్తారు. ముఖ్యంగా వర్షాకాలమైన (జూన్ -సెప్టెంబరు) నాలుగునెలల కాల వ్యవధిలో చాలా తక్కువ వర్షపాతం ఉంటుందని తెలిపింది. అధిక లేదా సాధారణ వర్షపాతం అన్న ఊసేలేదని వ్యాఖ్యానించింది. లాంగ్ పీరియడ్ రేంజ్(ఎల్పీఏ)లో రుతుపవనాల ప్రభావం 93 శాతం ఉంటుందని ఆ సంస్థ అంచనా వేసింది. వర్షపాతం 90 నుంచి 95 శాతం ఉందంటే, అది సాధారణం కంటే తక్కువే. 1951 నుంచి 2000వరకు ఎల్పీఏ సగటున 89 సెంటీమీటర్లు ఉందని స్కైమెట్ సీఈవో జతిన్ సింగ్ తెలిపారు. ముఖ్యంగా మహారాష్ట్ర బాగా ప్రభావితం కానుందన్నారు. అయితే భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఏప్రిల్ మధ్యలో అంచనాలను ప్రకటించనున్నది. మరోవైపు వేసవి పొడవునా ఎల్‌నినో కొనసాగుతున్నందున వచ్చే వానాకాలంలో వర్షాలు కురిసే అవకాశం 60శాతమేనని అమెరికా వాతావరణశాఖ ఇటీవల హెచ్చరించింది. దీని ప్రభావం భారత్‌పైనా ఉంటుందని తెలిపింది. El Nino reason for below normal Monsoon https://t.co/exF7cAGVAG — SkymetWeather (@SkymetWeather) April 3, 2019 -
అంచనాలు తగ్గించనున్న ఐఎండీ
న్యూఢిల్లీ: ఆగస్టు, సెప్టెంబర్ మాసాలకు రుతుపవనాలపై తన అంచనాలను భారత వాతావరణ విభాగం(ఐఎండీ) తగ్గించే అవకాశం ఉంది. ఫలితంగా ఈ సీజన్ మొత్తానికి అంచనాలు దిగివచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదవుతుందని ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ ఇప్పటికే అంచనాలను కుదించిన సంగతి తెలిసిందే. దీర్ఘకాలిక సగటు(ఎల్పీఏ)ని 92 శాతంగా సవరించింది. ఎల్పీఏ 96–104 శాతం మధ్య ఉంటే, ఆ పరిస్థితిని సాధారణ వర్షపాతంగా భావిస్తారు. ఈ సీజన్లో 100 శాతం ఎల్పీఏతో వర్షాలు పడతాయని ఏప్రిల్‌లో ఐఎండీ అంచనా వేసిన సంగతి తెలిసిందే. -
కేరళను తాకిన రుతుపవనాలు
సాక్షి, న్యూఢిల్లీ : మండే ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు చల్లని కబురు అందింది. నైరుతి రుతుపవనాలు సోమవారం కేరళను తాకాయని ప్రైవేట్ వాతావరణ ఏజెన్సీ స్కైమెట్ తెలిపింది. కేరళ తీరాన్ని రుతుపవనాలు తాకాయని స్కైమెట్ పేర్కొనగా మే 29న రుతుపవనాలు ప్రవేశిస్తాయని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) పేర్కొంది. రానున్న 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు కేరళను తాకుతాయని ఐఎండీ వెల్లడించింది. కేరళలో రుతుపవనాల రాకకు సానుకూల వాతావరణం నెలకొందని, ఈ ఏడాది వర్షాకాలం ఆరంభమైందని స్కైమెట్ సీఈఓ జతిన్ సింగ్ చెప్పారు. నైరుతి రుతుపవనాలు కేరళను తాకిన అనంతరం దక్షిణ అరేబియా సముద్రం, తమిళనాడు, బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ నికోబార్ దీవుల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. రానున్న 24 గంటల్లో రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని ఐఎండీ అడిషనల్ డైరెక్టర్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు. -
28న కేరళకు నైరుతి రుతుపవనాలు: స్కైమెట్
న్యూఢిల్లీ: నైరుతి రుతుపవనాలు ఈ నెల 28న కేరళ తీరాన్ని తాకుతాయని ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ శనివారం ప్రకటించింది. సాధారణంగా అయితే అవి జూన్ 1న కేరళకు చేరాలి. అంటే ఈసారి నాలుగు రోజుల ముందే వస్తున్నాయన్న మాట. రుతుపవనాలు మే 20న అండమాన్ నికోబార్ దీవులకు, 24న శ్రీలంకకు చేరుతాయని స్కైమెట్ అంచనావే సింది. ఈ ఏడాది సాధారణ వర్షపాతమే కురుస్తుందని భారత వాతావరణ సంస్థ, స్కైమెట్ ఇదివరకే అంచనా వేసిన సంగతి తెలిసిందే. -
ఈసారి వర్షపాతం తక్కువే
-
సాధారణం కంటే ఎక్కువ వర్షాలు
హైదరాబాద్: ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు మే 29న కేరళ తీరాన్ని తాకుతాయని, దేశవ్యాప్తంగా సాధారణం కంటే కొంచెం ఎక్కువ మోతాదులో వర్షాలు పడతాయని వాతావరణ అధ్యయన సంస్థ స్కైమెట్ స్పష్టం చేసింది. దీర్ఘకాలిక సగటు కంటే అయిదు శాతం ఎక్కువగా వానలు కురుస్తాయని, మరో ఐదు శాతం ఎక్కువ వర్షాలకు 20 శాతం వరకూ అవకాశముందని స్కైమెట్ అంచనా వేసింది. మే నెల 17వ తేదీకల్లా అండమాన్ సముద్రాన్ని చేరుకునే రుతుపవన మేఘాలు ఆ తరువాత 12 రోజులకు కేరళ తీరాన్ని తాకుతాయని స్కైమెట్ వాతావరణ నిపుణులు పల్వట్ మహేశ్ 'సాక్షి'కి తెలిపారు. రెండేళ్ల వర్షాభావానికి కారణమైన ఎల్ నినో ప్రభావం ఇప్పటికే తగ్గుముఖం పట్టగా, వచ్చే నెలకు సున్నా స్థాయికి చేరుకోనుంది. దీంతో ఈ ఏడాది రుతుపవనాలకు మార్గం సుగమమైనట్లు ఆయన తెలిపారు. జూన్ 6వ తేదీకల్లా తెలంగాణ, 12వ తేదీకి ముంబైలను తాకుతాయని, జూలై పన్నెండు నాటికి దేశవ్యాప్తంగా విస్తరించే అవకాశముందని ఆయన వివరించారు. మరోవైపు తూర్పువైపున కూడా రుతుపవనాలు చురుకుగా కదులుతాయని, జూన్ పదవ తేదీకల్లా కోల్‌కతాను తాకే అవకాశముందని చెప్పారు. రుతుపవనాలు దేశానికి ఇరువైపుల నుంచి నెమ్మదిగా ఎగబాకుతూ జూన్ నెలలో సాధారణ వర్షపాతం కంటే కొంచెం తక్కువ వర్షాలు కురిసినప్పటికీ జూలై, ఆగస్టుల్లో 110 శాతం మేరకు వానలు పడతాయని తెలిపారు. ఈ సీజన్లో తమిళనాడు, దక్షిణ కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల్లో కొంత తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని ఆయన చెప్పారు.