
న్యూఢిల్లీ: నైరుతి రుతుపవనాలు ఈ నెల 28న కేరళ తీరాన్ని తాకుతాయని ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ శనివారం ప్రకటించింది. సాధారణంగా అయితే అవి జూన్ 1న కేరళకు చేరాలి. అంటే ఈసారి నాలుగు రోజుల ముందే వస్తున్నాయన్న మాట. రుతుపవనాలు మే 20న అండమాన్ నికోబార్ దీవులకు, 24న శ్రీలంకకు చేరుతాయని స్కైమెట్ అంచనావే సింది. ఈ ఏడాది సాధారణ వర్షపాతమే కురుస్తుందని భారత వాతావరణ సంస్థ, స్కైమెట్ ఇదివరకే అంచనా వేసిన సంగతి తెలిసిందే.