Normal rainfall
-
ఎల్‌నినో ఉన్నప్పటికీ సాధారణ వర్షపాతం
న్యూఢిల్లీ: ఎల్‌నినో ప్రభావం ఉన్నప్పటికీ మొత్తమ్మీద సాధారణ వర్షపాతంతో ఈ సీజన్ ముగిసిందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) తెలిపింది. నాలుగు నెలల వర్షాకాలంలో దేశంలో దీర్ఘకాల సగటు వర్షపాతం 868.6 మిల్లీమీటర్లు కాగా, ఈసారి ఎల్‌నినో పరిస్థితులను నిలువరించే సానుకూల కారకాల ప్రభావంతో 820 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని, ఇది 94.4 శాతమని ఐఎండీ తెలిపింది. దీర్ఘకాలం సరాసరి వర్షపాతం 94–106 శాతం మధ్య నమోదైతే సాధారణ వర్షపాతంగానే పరిగణిస్తారు. వాతావరణ మార్పుల కారణంగా రుతుపవనాల్లో అస్థిరత ఏర్పడినట్లు ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర శనివారం మీడియాతో అన్నారు. దేశంలోని 36 వాతావరణ సబ్ డివిజన్లకుగాను మూడింటిలో అధిక వర్షపాతం, 26 సబ్ డివిజన్లలో సాధారణ, ఏడింట్లో లోటు వర్షపాతం నమోదైందని చెప్పారు. లోటు వర్షపాతం నమోదైన ప్రాంతాల్లో నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, జార్ఖండ్, బెంగాల్, బిహార్, యూపీలో కొంత భాగం, కర్ణాటక దక్షిణ ప్రాంతం, కేరళ ఉన్నాయన్నారు. అదేవిధంగా, దక్షిణాది రాష్ట్రాల్లో 8% లోటు వర్షపాతం నమోదైందని చెప్పారు. అరేబియా సముద్రం, హిందూ మహాసముద్ర జలాల ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసాలు (హిందూ మహా సముద్రం డైపోల్), గాల్లో మేఘాలు, వర్షాలు తూర్పు దిశగా కదిలే తీరు(మాడెన్–జులియన్ ఆసిలేషన్) ఈ దఫా రుతుపవనాలను ప్రభావితం చేశాయని మహాపాత్ర విశ్లేషించారు. ఈ రెండు పరిస్థితులు ఎన్ నినో ప్రభావాన్ని తగ్గించాయని వివరించారు. నైరుతి రుతు పవనాల సమయంలో ఏటా సాధారణంగా 13 వరకు అల్పపీడనాలు ఏర్పడుతుంటాయి, ఈసారి 15 అల్ప పీడనాలు ఏర్పడినప్పటికీ వాటి వృద్ధి సక్రమంగా లేదన్నారు. ఎల్‌నినో కారణంగానే 1901 తర్వాత అత్యంత వేడి మాసంగా ఈ ఏడాది ఆగస్ట్ రికార్డు సృష్టించిందన్నారు. నైరుతి రుతుపవనాల తిరోగమనం ఈసారి 8 రోజులు ఆలస్యంగా సెప్టెంబర్ 25వ తేదీన పశ్చిమ రాజస్తాన్ నుంచి ప్రారంభమయిన విషయం తెలిసిందే. -
ఆగస్ట్–సెప్టెంబర్ నెలల్లో సాధారణ వర్షాలు: వాతావరణ శాఖ
న్యూఢిల్లీ: దేశంలో వర్షాకాలం రెండో అర్ధభాగం(ఆగస్ట్–సెప్టెంబర్)లో సాధారణ వర్షాలే కురుస్తాయని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) సోమవారం తెలిపింది. జూలైలో దేశవ్యాప్తంగా అధిక వర్షాలు నమోదయ్యాయని పేర్కొంది. నైరుతి రుతుపవనాలపై ఎల్‌నినో పరిస్థితులు ప్రభావితం చేయలేకపోయాయని తెలిపింది. ఆగస్ట్, సెప్టెంబరు నెలల్లో సాధారణ వర్షపాతాన్ని అంచనా వేసినప్పటికీ, సాధారణ (422.8 మిల్లీమీటర్ల కంటే తక్కువగా (94 శాతం నుంచి 99 శాతం) కురిసే అవకాశాలున్నాయని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర మీడియాతో అన్నారు. జూన్‌లో సాధారణం కంటే 9% లోటు వర్షపాతం నమోదవగా, జూలై వచ్చే సరికి 13% అదనంగా వానలు పడ్డాయని చెప్పారు. అయితే, తూర్పు, ఈశాన్య భారతంలో 1901 తర్వాత మొదటిసారిగా అత్యల్ప వర్షపాతం 280.9 మిల్లీమీటర్లు నమోదైందని చెప్పారు. గత అయిదేళ్లలోనే అత్యధికంగా ఈసారి 1,113 భారీ వర్షపాతం ఘటనలు, 205 అత్యంత భారీ వర్షపాతం ఘటనలు జూలైలో నమోదయ్యాయని చెప్పారు. -
జూన్‌లో వర్షాభావం
న్యూఢిల్లీ: ఫసిఫిక్ మహాసముద్రంలో ఎల్‌నినో ఏర్పడినప్పటికీ వాయవ్య భారత్ మినహా మిగిలిన ప్రాంతాల్లో ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదవుతుందని కేంద్ర వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే జూన్ నెలలో చాలా ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులుంటాయని తెలిపింది. దక్షిణ కర్ణాటక, ఉత్తర తమిళనాడు, రాజస్తాన్, లద్దాఖ్ మినహా మిగిలిన ప్రాంతాల్లో జూన్ నెలలో వానలు అంతగా కురిసే అవకాశాల్లేవని అంచనా వేసింది. ఫసిఫిక్ మహా సముద్రం వేడెక్కడం ఇప్పటికే ప్రారంభమైందని మన రుతుపవనాలపై ప్రభావాన్ని చూపిస్తే ఎల్‌నినో పరిస్థితులు ఏర్పడే అవకాశం 90శాతం ఉందని కేంద్ర వాతావరణ శాఖ పర్యావరణ పర్యవేక్షణ అధ్యయన కేంద్రం చీఫ్ డి. శివానంద చెప్పారు. అయితే వానలు కురవడానికి అనుకూలమైన ఇండియన్ ఓషన్ డిపోల్ (ఐఓడీ) హిందూ మహాసముద్రంలో ఏర్పడడం వల్ల చాలా ప్రాంతాల్లో వర్షాలు పడతాయని తెలిపారు. మధ్య భారతదేశంపై ఎల్‌నినో ప్రభావాన్ని ఐఓడీ సమర్థంగా ఎదు ర్కోవడం వల్ల ఏడాది మొత్తమ్మీద సాధారణ వర్షపాతం కురుస్తుందని వివరించారు. -
ఎల్‌నినో ఉన్నా మంచి వానలే! భారత వాతావరణ శాఖ స్పందన ఇదే!
న్యూఢిల్లీ: భారత్‌లో వర్షాభావ పరిస్థితులకు కారణమయ్యే ‘ఎల్ నినో’ దాపురించే అవకాశాలు ఉన్నాసరే ఈ ఏడాది దేశంలో నైరుతి రుతుపవన వర్షపాతం సాధారణస్థాయిలో కొనసాగి వ్యవసా య రంగానికి మేలుచేకూర్చనుందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) మంగళవారం అంచనావేసింది. సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని ప్రైవేట్ వాతావరణ అంచనాల సంస్థ స్కైమేట్ సోమవారం ప్రకటించిన మరుసటి రోజే వాతావరణ శాఖ మరోలా అంచనాలు వెల్లడించడం గమనార్హం. భారత్‌లో వ్యవసాయం ప్రధానంగా వర్షాలపై ఆధారపడింది. మొత్తం పంట విస్తీర్ణంలో దాదాపు 52 శాతం భూభాగం వర్షాధారం. దేశ మొత్తం ఆహారోత్పత్తిలో 40 శాతం.. ఈ భూభాగంలో పండించే పంట నుంచే వస్తోంది. ఇది దేశ ఆహారభద్రతకు, ఆర్థిక సుస్థిరతకు కీలక భూమికగా మారింది. ఈ పరిస్థితుల్లో దేశంలో వర్షపాతం సాధారణంగా ఉంటుందని అంచనావేసి వ్యవసాయరంగానికి ఐఎండీ తీపికబురు మోసుకొచ్చింది. పసిఫిక్ మహాసముద్ర ఉపరితర జలాలు వేడెక్కితే ఎల్ నినో అంటారు. దీనివల్ల భారత్‌లో రుతుపవన గాలులు బలహీనమై పొడిబారి వర్షాభావం తలెత్తుతుంది. సగటు వానలు జూన్ నుంచి సెప్టెంబర్ దాకా నైరుతి సీజన్లో దాదాపుగా సుదీర్ఘకాల సగటు అయిన 87 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావచ్చని కేంద్ర భూ శాస్త్ర శాఖ కార్యదర్శి ఎం.రవిచంద్రన్ చెప్పారు. సాధారణం, అంతకు ఎక్కువ వానలు పడేందుకు 67 శాతం ఆస్కారముందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మహాపాత్ర అంచనావేశారు. ‘‘రెండో అర్ధభాగంపై ఏర్పడే ఎల్‌నినో ప్రభావం చూపొచ్చు. అంతమాత్రాన వర్షాభావం ఉంటుందని చెప్పలేం. ఎన్నోసార్లు ఎల్‌నినో వచ్చినా సాధారణ వర్షపాతం నమోదైంది’’ అని ఆయన వివరించారు. -
25 వరకు అరకొర వర్షాలే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల కదలికలు బలహీనంగానే కనిపిస్తున్నాయి. ఈ కారణంగా వచ్చే మూడు రోజుల పాటు అరకొర వర్షాలే పడతాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఈ నెల 24 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, సోమవారం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని, 25న మాత్రం రాష్ట్రంలోని కొన్నిచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. హైదరాబాద్ వాతా వరణ కేంద్రం కూడా ఇంచుమించు ఇదే సూచన చేసింది. ఉత్తర ఇంటీరియర్ ఒడిశా దాని పరిసర ప్రాంతాల్లో 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, ఇది ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశ వైపునకు వంగుతోందని, దీని కారణంగా సోమవారం కొన్నిచోట్ల అక్కడక్కడ ఉరుములు, ఈదురుగాలులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, మంగళవారం కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. -
తెలంగాణలో రేపు భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ఈ నెల 30నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. దీని ఫలితంగా శుక్ర, శనివారాల్లో కోస్తాలో భారీ వర్షాలు, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు వెల్లడించారు. -
రాష్ట్రంలో మూడు రోజులు తేలికపాటి వర్షాలు
సాక్షి, హైదరాబాద్ : ఉత్తర కోస్తాంధ్ర, పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అలాగే గల్ఫ్ ఆఫ్ మార్ట్ బాన్ నుంచి దక్షిణ కోమోరిన్, మాల్దీవుల ప్రాంతం వరకు షియర్ జోన్ ఏర్పడింది. దీంతో రాష్ట్రంలో ఆదివారం అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే సోమవారం ఒకటి రెండుచోట్ల భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ఇదిలా వుండగా శనివారం రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు కాస్త తగ్గాయి. అనేకచోట్ల ఆకాశం మేఘావృతమై ఉంది. నల్లగొండలో అత్యధికంగా 42 డిగ్రీలు నమోదు కాగా, ఆదిలాబాద్, ఖమ్మంల్లో 41 డిగ్రీలు, హైదరాబాద్‌లో 35 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. -
నైరుతి సాధారణమే
సాక్షి, హైదరాబాద్: ఈసారి నైరుతి రుతుపవనాలు ఆశాజనకంగా ఉంటాయని, సాధారణ వర్షపాతం నమోదవుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు ఈసారి ఎలా ఉంటాయన్న దానిపై మొదటి ముందస్తు అంచనాలను వాతావరణ కేంద్రం డైరెక్టర్ వై.కె.రెడ్డి సోమవారం వెల్లడించారు. జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య నైరుతి రుతుపవనాల కాలం ఉంటుందని, 50 ఏళ్ల సరాసరి అంచనాల ప్రకారం ఈసారి 96 శాతం వర్షపాతం రాష్ట్రంలో నమోదవుతుందని తెలిపారు. 96 శాతానికి అటుఇటుగా ఐదు శాతం తేడా ఉంటుందని ఆయన తెలిపారు. సాంకేతికంగా చూస్తే సాధారణానికి కాస్తంత తక్కువగానే నమోదవుతుందని అభిప్రాయపడ్డారు. వచ్చే జూన్ మొదటి వారంలో విడుదల చేయబోయే రెండో అంచనా నివేదిక ఇంకా స్పష్టంగా, ప్రాంతాల వారీగా ఉంటుందని, అప్పుడు కచ్చితమైన సమాచారం వస్తుందని చెప్పారు. దేశ వ్యాప్తంగా ఈసారి నైరుతి రుతుపవనాల ద్వారా పడే వర్షపాతం అన్ని ప్రాంతాల్లో సమానంగా ఉంటుందన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనూ ఇలాగే ఉంటుందన్నారు. దీనివల్ల రైతులకు ప్రయోజకరంగా ఉంటుందన్నారు. నైరుతిలో 717 మి.మీ.వర్షం.. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల ద్వారా సాధారణంగా 755 మిల్లీమీటర్ల (మి.మీ.) వర్షపాతం నమోదుకావాల్సి ఉందని, అయితే వచ్చే నైరుతి సీజన్లో 717 మి.మీ. వర్షం కురుస్తుందని వై.కె.రెడ్డి తెలిపారు. గతేడాది 97 శాతం వర్షపాతం నమోదవుతుందని అంచనా వేయగా, 91 శాతానికే పరిమితమైందని చెప్పారు. రాయలసీమలో ఏకంగా 37 శాతం లోటు కనిపించిందన్నారు. ఈ విషయంలో వాతావరణశాఖ సరిగా అంచనా వేయలేకపోయిందని అంగీకరించారు. ఈసారి నైరుతి రుతుపవనాలు తెలంగాణలో జూన్ 5–7 తేదీల మధ్య ప్రవేశిస్తాయని చెప్పారు. రాయలసీమలో 3–4 తేదీల మధ్య ప్రవేశించే అవకాశముందన్నారు. తమ వాతావరణ కేంద్రానికి చెందిన సబ్ డివిజన్లలో 60 శాతం చోట్ల వర్షాలు కురిస్తే రుతుపవనాలు వచ్చినట్లుగా ప్రకటిస్తామన్నారు. గాలులు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తే కూడా రుతుపవనాలుగా గుర్తిస్తామన్నారు. నైరుతి రుతుపవనాల కాలంలో ఆదిలాబాద్‌లో అత్యధికంగా 999 ఎంఎంలు వర్షపాతం నమోదవుతుందన్నారు. అత్యంత తక్కువగా మహబూబ్‌నగర్, గద్వాల జిల్లాల్లో నమోదవుతుందని అన్నారు. ఎల్‌నినో బలహీనం.. ఎలినినో, లానినోలపైనా వర్షాలు ఆధారపడి ఉంటాయని వై.కె.రెడ్డి తెలిపారు. అయితే ఒక్కోసారి వాటితో సంబంధం లేకుండా కూడా వర్షాలు వస్తాయని చెప్పారు. వచ్చే సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఎల్‌నినో మరింత బలహీనంగా ఉంటుందన్నారు. పసిఫిక్ మహా సముద్రంలో భూమధ్య రేఖ దగ్గర సముద్రంలో ఉష్ణోగ్రత సాధారణం కంటే 0.5 డిగ్రీలు అధికంగా ఉంటే దాన్ని ఎల్‌నినో అంటారు. అంతకంటే తక్కువగా ఉంటే దాన్ని లానినో అంటారు. ఎల్‌నినో ఉంటే వర్షాలు తక్కువగా కురుస్తాయని, లానినో వల్ల వర్షాలు అధికంగా కురుస్తాయన్నారు. వచ్చే వారం నుంచి ఎక్కువ ఎండలు.. రాష్ట్రంలో వచ్చే వారం నుంచి ఎండలు మరింత తీవ్రంగా ఉంటాయని వై.కె.రెడ్డి తెలిపారు. నైరుతి రుతుపవనాలు వచ్చే వరకు తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదవుతాయన్నారు. వారం తర్వాత ఉత్తర, తూర్పు తెలంగాణల్లో ఎండలు, వడగాడ్పుల తీవ్రత ఉంటుందన్నారు. -
నైరుతి సీజన్ ముగిసింది
న్యూఢిల్లీ: దేశంలో నైరుతి రుతుపవనాల సీజన్ ముగిసిందని వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా సగటున 9 శాతం లోటు వర్షపాతం నమోదయిందని వెల్లడించింది. బిహార్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్‌తో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్రమైన లోటు వర్షపాతం రికార్డయిందని పేర్కొంది. గతేడాదిలాగే ఈ సంవత్సరం కూడా నైరుతి రుతుపవనాలతో సగటు కన్నా తక్కువ వర్షమే కురిసిందని తెలిపింది. అనుకున్నదాని కంటే మూడు రోజులు ముందుగా కేరళలో మే 28న నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. శనివారం నుంచి వీటి నిష్క్రమణ ప్రారంభమైంది. నైరుతి రుతుపవనాలు వెళ్లిపోయినప్పటికీ దక్షిణాది రాష్ట్రాలతో పాటు మహారాష్ట్రలో అక్టోబర్ మొదటి వారంలో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఈసారి నైరుతి రుతుపననాల ప్రభావంతో దేశవ్యాప్తంగా 91 శాతం వర్షపాతం నమోదయిందనీ, ఇది అంచనా వేసిన దానికంటే తక్కువేనని వెల్లడించింది. తూర్పు, ఈశాన్య భారతంలో అత్యధిక లోటు వర్షపాతం నమోదుకాగా, సెంట్రల్ ఇండియా, వాయవ్య రాష్ట్రాలు లోటు వర్షపాతంలో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. నైరుతి రుతుపవనాల కారణంగా జూన్ నెలలో 95 శాతం, జూలైలో 94 శాతం, ఆగస్టులో 92 శాతం వర్షపాతం సంభవించింది. ఇక సెప్టెంబర్‌లో అయితే వర్షపాతం ఏకంగా 76 శాతానికి పడిపోయింది. -
నైరుతి రుతుపవనాల ఉపసంహరణ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: రాజస్థాన్, కచ్, ఉత్తర అరేబియా సముద్రంలోని పలు ప్రాంతాల నుంచి శనివారం నైరుతి రుతుపవనాల ఉపసంహరణ ప్రారంభమైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న రెండు మూడు రోజుల్లో రాజస్థాన్‌లో మిగిలిన ప్రాంతాలు సహా పంజాబ్, హరియాణా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తర అరేబియా సముద్రంలో కొన్ని ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాల ఉపసంహరణకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వివరించింది. నైరుతి సీజన్ మొదలైన జూన్ నుంచి సెప్టెంబర్ వరకు రాష్ట్రంలో సరాసరి సాధారణ వర్షపాతం నమోదైందని పేర్కొంది. సాధారణంగా ఈ కాలంలో తెలంగాణలో 754.7 మిల్లీమీటర్ల (ఎంఎం) వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 741.4 ఎంఎంలు రికార్డు అయినట్లు తెలిపింది. పది జిల్లాల్లో లోటు వర్షపాతం, ఐదు జిల్లాల్లో అధికం, మిగిలిన జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైందని వెల్లడించింది. మొత్తంగా నైరుతి రుతుపవనాలు ఆశాజనకంగానే ముగుస్తున్నట్లు పేర్కొంది. నేడు రాష్ట్రంలో వర్షాలు.. శ్రీలంక నుంచి ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకు ఏర్పడిన ఉపరితల ద్రోణి కారణంగా ఆదివారం రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి రాజారావు తెలిపారు. సోమవారం పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. -
నైరుతిలో సాధారణ వర్షపాతం
న్యూఢిల్లీ: నైరుతి రుతుపవనాల కాలంలో తూర్పు, ఈశాన్య రాష్ట్రాలు మినహా మిగతా దేశమంతటా సాధారణ వర్షపాతం నెలకొంటుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) బుధవారం వెల్లడించింది. దేశం మొత్తంగా చూసినప్పుడు గత కొన్నేళ్ల సరాసరి వర్షపాతంతో పోలిస్తే.. జూలై నెలలో 101 శాతం, ఆగస్టులో 94 శాతం వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ అంచనా వేసింది. ‘ఈ ఏడాది మొత్తం నైరుతి రుతుపవన కాలం (జూన్ నుంచి సెప్టెంబర్ వరకు)లో చూస్తే సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు అత్యధికంగా ఉన్నాయి. ఈ వర్షాకాలంలో సగటున 97 శాతం (4శాతం ఎక్కువ లేదా తక్కువ కావచ్చు) వర్షం కురుస్తుంది’ అని ఐఎండీ తెలిపింది. వచ్చే 48 గంటల్లో నైరుతి రుతుపవనాలు ఈశాన్య రాష్ట్రాలకు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయనీ, జూన్ 3 నాటికి దక్షిణ భారతంలోని అనేక ప్రాంతాల్లో, 6వ తేదీకి గోవా, మహారాష్ట్రల్లోనూ వర్షాలు మొదలవుతాయని వెల్లడించింది. ప్రాంతాలవారీగా చూసినప్పుడు సరాసరి వర్షపాతంతో పోలిస్తే వాయవ్య రాష్ట్రాల్లో వంద శాతం, మధ్య భారతంలో 99 శాతం, దక్షిణాది రాష్ట్రాల్లో 95 శాతం, తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో 93 శాతం వర్షపాతం నమోదవుతుందని పేర్కొంది. -
28న కేరళకు నైరుతి రుతుపవనాలు: స్కైమెట్
న్యూఢిల్లీ: నైరుతి రుతుపవనాలు ఈ నెల 28న కేరళ తీరాన్ని తాకుతాయని ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ శనివారం ప్రకటించింది. సాధారణంగా అయితే అవి జూన్ 1న కేరళకు చేరాలి. అంటే ఈసారి నాలుగు రోజుల ముందే వస్తున్నాయన్న మాట. రుతుపవనాలు మే 20న అండమాన్ నికోబార్ దీవులకు, 24న శ్రీలంకకు చేరుతాయని స్కైమెట్ అంచనావే సింది. ఈ ఏడాది సాధారణ వర్షపాతమే కురుస్తుందని భారత వాతావరణ సంస్థ, స్కైమెట్ ఇదివరకే అంచనా వేసిన సంగతి తెలిసిందే. -
వర్షపాతంపై చల్లటి కబురు
న్యూఢిల్లీ : భారత వాతావరణ విభాగం(ఐఎండీ) చల్లని కబురు చెప్పింది. ఈ ఏడాది కూడా భారత్‌లో సాధారణ వర్షపాతమే ఉంటుందని ఐఎండీ వెల్లడించింది. 97 శాతం సాధారణ వర్షపాతాన్ని అంచనావేస్తున్నట్టు ఐఎండీ డైరెక్టర్ జనరల్ కేజే రమేష్ పేర్కొన్నారు. అసలు ఈ ఏడాది తక్కువ వర్షపాతాల సూచనే లేదని తెలిపారు. నేడు నిర్వహించిన న్యూస్ కాన్ఫరెన్స్‌లో 2018 సంవత్సరానికి సంబంధించిన తొలి వాతావరణ అంచనాలను ఐఎండీ విడుదల చేసింది. గత రెండేళ్లలో భారత్‌లో మంచి వర్షాలు పడ్డాయని, మంచి పంటలు కూడా పండాయని, అదే స్థాయిలో ఈ ఏడాది కూడా వర్షాలు ఉండనున్నాయని రమేష్ చెప్పారు. మే చివరిలో లేదా జూన్ మొదటి వారంలో కేరళకు రుతుపవనాలు వస్తాయని, 45 రోజుల్లో అవి దేశమంతటా విస్తరిస్తాయని పేర్కొన్నారు. ఈసారి బలహీన లానినో ఉందని, ఇది కూడా న్యూట్రల్ కావొచ్చన్నారు. ఎల్‌నినోకు పూర్తిగా వ్యతిరేక లక్షణాలను లానినో కలిగి ఉంటుంది. సాధారణ వర్షపాతం కేవలం వ్యవసాయ వృద్ధిని పెంచడమే కాకుండా.. మొత్తం గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావాన్ని చూపనుందని ఐఎండీ తెలిపింది. ఇది బీజేపీ ప్రభుత్వానికి ఎంతో కీలకమని పలువురంటున్నారు. 2019లో సాధారణ ఎన్నికలు, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ, ప్రభుత్వానికి ఐఎండీ గుడ్‌న్యూస్ చెప్పినట్టుగా తెలుస్తోంది. దీర్ఘకాలిక సగటు వర్షపాతంతో పోలిస్తే 96 శాతం నుంచి 104 శాతం మధ్య వర్షపాతం నమోదైతే దాన్ని సాధారణం వర్షపాతంగా పేర్కొంటారు. 104 శాతం కన్నా ఎక్కువ పడితే అధిక వర్షపాతం అని, 96 శాతం కన్నా తక్కువ పడితే లోటు వర్షపాతంగా వ్యవహరిస్తారు. -
29 మండలాల్లో పెరగనే లేదు
20 మీటర్ల దిగువన భూగర్భ జలాలు.. నివేదిక విడుదల సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కురిసిన వర్షాలకు భూగర్భ జల మట్టాలు పెరిగినా 29 మండలాల్లో మాత్రం 20 మీటర్ల దిగువన లభ్యమవు తున్నారుు. ఇందులో మహబూబ్‌నగర్, రంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లోనే ఐదేసి మండలాల చొప్పున ఉన్నారుు. 10-20 మీటర్ల మధ్య జలాలున్న మండలాలు 101 ఉండగా, వీటిలో మహబూబ్‌నగర్‌లో 14, రంగారెడ్డిలో 11, కామారెడ్డిలో 10 మండలా లున్నారుు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నీటి మట్టాలపై భూగర్భ జల విభాగం నివేదిక మంగళవారం విడుదల చేసింది. అక్టోబర్‌లో సాధారణ వర్షపాతం 813 మిల్లీమీటర్లు కాగా, రాష్ట్రంలో 23 శాతం అధికంగా 999 మి.మీ. నమోదైనట్లు నివేదికలో పేర్కొంది. కరీంగనర్, ఆదిలా బాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాలో సాధారణ, మిగతా ఆరు జిల్లాలో అధిక వర్ష పాతం నమోదైందని తెలిపింది. హైదరాబా ద్లో 39 శాతం , నిజామాబాద్‌లో 33 శాతం అధికంగా వర్షపాతం నమోదైందని.. గతేడాది 11.27 మీటర్ల లోతున నీటి లభ్యతద ఉండగా అక్టోబర్‌లో 7.11 మీటర్లకు చేరిందని వివరించింది. -
73 మండలాల్లో వర్షాభావం
175 మండలాల్లో అధిక, 208 మండలాల్లో సాధారణ వర్షపాతం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఒకవైపు విరివిగా వర్షాలు కురుస్తున్నా... అవి అన్ని మండలాలనూ తాకడంలేదు. ఇంకా 73 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికా సంఘం (టీఎస్‌డీపీఎస్) శుక్రవారం విడుదల చేసిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యా యి. ఈ ఏడాది జూన్, జులై నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కంటే 16 శాతం అధిక వర్షపాతం నమోదైంది. జూన్‌లో 50 శాతం అధికం కాగా... జులైలో 3 శాతం లోటు రికార్డైంది. మూడు జిల్లాల్లో అధికం నమోదైంది. వాటిల్లో ఆదిలాబాద్ జిల్లాలో 36 శాతం, వరంగల్ 23శాతం,ఖమ్మం జిల్లాలో 20 శాతం అధిక వర్షపాతం నమోదైంది. మిగిలిన జిల్లాల్లో సాధారణ వర్షపాతమే. మొత్తం 459 మండలాలకు గాను 208 మండలాల్లో సాధారణ, 175 మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది. 73 మండలాల్లో వర్షాభావం నెలకొంది. అందులో మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో 17 మండలాల వంతున వర్షాభావంలో ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో 11, మెదక్‌లో 10, హైదరాబాద్‌లో 3, కరీంనగర్లో 8, ఖమ్మంలో 4, వరంగల్‌లో రెండు, నిజామాబాద్‌లో ఒక మండలంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. మూడు మండలాలు తీవ్ర కరువు పరిస్థితుల్లో ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా వంగూరులో 72 శాతం లోటు నమోదైంది. అలాగే నల్లగొండ జిల్లా మర్రిగూడలో 68 శాతం, చందంపేటలో 66 శాతం లోటు వర్షపాతం నమోదైంది. -
సన్నగిల్లిన సాగు
1167 హెక్టార్లకే పరిమితం అయిన వరి ఆశించిన స్థాయిలో కురవని వర్షాలు దిక్కుతోచని స్థితిలో రైతులు విజయనగరంఫోర్ట్: రబీలో వరి సాగు జిల్లాలో ప్రశ్నార్థకంగా మారింది. సాధారణ విస్తీర్ణంలో సగం కూడా వరి సాగు అవలేదు.గత ఏడాది కంటే ఈ ఏడాది సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. వేరుశెనగ,నువ్వులు పంటలదీ అదే పరిస్థితి. రైతులు ఖరీఫ్‌లో వరి పంటను ఎక్కువగా సాగు చేస్తారు. గత మూడేళ్లుగా రబీలో కూడా వరి సాగుకు ఆశక్తి చూపుతున్నారు. బోర్లు, బావులు ఉన్న ప్రాంతంలో వరి పంటను వేస్తారు. అదేవిధంగా పెద్ద పెద్ద చెరువుల్లో నీరు పుష్కలంగా ఉంటే రబీలో వరి పంటను వేస్తారు. కానీ గత ఏడాది సెప్టెంబర్ నెల తర్వాత జిల్లాలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. దీంతో చెరువులు, గుంతలు అడుగంటాయి. 1167 హెక్టార్లకే పరిమితమైన వరి పంట వరి సాధారణ విస్తీర్ణం 5577 హెక్టార్లు కాగా 1167 హెక్టార్లకే పరిమితం అయింది. సాధారణ విస్తీర్ణంలో సగం కూడా సాగవలేదు.గత ఏడాది రబీలో వరి సాధారణ విస్తీర్ణం 5242 హెక్టార్లు కాగా 5357 హెక్టార్లలో సాగైంది. రాలనిచినుకు గత ఏడాది సెప్టెంబర్ నెల సన్నగిల్లిన సాగు తర్వాత జిల్లాలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు, దీంతో చెరువులు, గుంతల్లో నీరు అడుగుంటింది. నీరు లేకపోవడంతో రైతులు వరిపంటను సాగు చేయడానికి ఆసక్తి చూపలేదు. ఆక్టోబర్ నెల సాధారణ వర్షపాతం 167.9మీ.మీ కాగా 51.5 మి.మీ నమోదైంది. నవంబర్ నెల సాధారణ వర్షపాతం73.3 మి.మీ కాగా 43.7 మి.మీ నమోదైంది. డిసెంబర్ నెల సాధారణ వర్షపాతం 4.6 మీ.మీ కాగా 3.9 మీ.మీ నమోదైంది. జనవరి నెల సాధారణ వర్షపాతం 9.9 మి.మీ కాగా 0.6 మి.మీ నమోదైంది. ఎండుతున్న పంటలుచెరువుల్లో నీరు లేకపోవడంవల్ల ఇప్పటికే సాగులో ఉన్న కూరగాయలు, నువ్వు, చోడి, వేరుశెనగ వంటి పంటలు ఎండుతు న్నాయి. దీంతో పంటలను ఏవిధంగా కాపాడుకోవాలో తెలియక రైతులు మధనపడుతున్నారు. మిరప, టమాటో, బెండ, చోడి పంటలను కాపాడుకోవడానికి రైతులు ట్యాంకర్లు, కావిళ్లతో నీటిని తెచ్చితడుపుతున్నారు. బావుల్లో కూడా నీరు తక్కువగా ఉండడంతో దిక్కుతోచని స్థితిలో రైతులు ఉన్నారు. పంటలు వేయడం మానుకున్నాను. గత ఏడాది చెరువులో నీరు ఉండడం వల్ల చోడి పంటను వేశాను. ఈఏడాది వేయాలనుకున్నాను. కానీ చెరువులో నీరు లేకపోవడంతో వేయలేదు. 10 సెంట్లలో మిరప పంట వేశాను. పూత రాకముందే చెరువు అడుగంటడంతో దూర ప్రాంతం నుంచి నీటిని కావిడితో తెచ్చి తడుపుతున్నాను.ఎస్.రామునాయుడు, రైతు, పెదవేమలి -
కరువు మేఘం
జిల్లాలో కరువు కమ్ముకొస్తోంది.. సాగు భూములు బోసిపోతున్నాయి.. ఖరీఫ్ మొదలై రెండు నెలలు కావస్తున్నా వర్షం జాడ లేదు. ఆకాశంకేసి చూడడం తప్ప అన్నదాతకు పాలుపోవడం లేదు. మరోవైపు వ్యవసాయ కూలీల పరిస్థితి దయనీయంగా ఉంది. పనుల్లేక పట్టణాల బాట పడుతున్నారు. దారి చూపాల్సిన ప్రభుత్వం మిన్నకుండిపోతోంది. ఈ ఏడాది సాగు సంకటంగా మారింది. సాక్షి ప్రతినిధి, గుంటూరు: జిల్లాలోని 30 మండలాల్లో ఇప్పటివరకు సాధారణ వర్షపాతం నమోదు కాలేదు. పల్నాడులోని రైతులు, సామాన్య ప్రజలపై వర్షాభావ పరిస్థితులు తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. జూలైలో 142.1 మి.మీ వర్షపాతం నమోదు కావాల్సి ఉంటే 112.1 మి.మీ తక్కువగా వర్షపాతం నమోదైంది. వర్షాలు కురుస్తాయనే నమ్మకంతో పత్తి సాగుచేసిన రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వినుకొండ, మాచర్ల, గురజాల నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి తీవ్రంగా ఉన్నది. ఇక్కడ 1.20 లక్షల హెక్టార్ల సాగు విస్తీర్ణం ఉంటే 30 వేల హెక్టార్లలో పత్తిని సాగు చేశారు. నెల గడిచినా పదునైన వర్షం కురవక పోవడంతో మొలకెత్తిన మొక్కల్లో పెరుగుదల లేక గిడసబారిపోతున్నాయి. మొక్కలను రక్షించుకునేందుకు ట్రాక్టర్ల సహాయంతో దూరప్రాంతాల నుంచి సాగునీటిని రవాణా చేస్తున్నారు. కొందరు రైతులు విత్తని విత్తనాలను తిరిగి షాపుల్లో అమ్ముకుంటున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రెండునెలలు గడిచినా సాగు నీరు లేక భూములు బోసిగా కనిపిస్తున్నాయి. పనుల్లేక అల్లాడుతున్న వ్యవసాయ కార్మికులు ఓ వైపు వర్షాభావం.. మరోవైపు సాగర్ కుడి కాలువ నుంచి నీరు విడుదల కాకపోవటంతో పంట పొలాలన్నీ ఖాళీగానే ఉన్నాయి. దీంతో పంట పొలాలపై ఆధారపడే కూలీలు పనులు కూడా దొరకక అల్లాడిపోతున్నారు. మాచర్ల, వినుకొండ, బొల్లాపల్లి, శావల్యాపురం, ఈపూరు లాంటి మండలాల్లోని వ్యవసాయ కార్మికులు పనుల కోసం ఎగబడుగున్నారు. ఒకో మండలం నుంచి వెయ్యి నుంచి 1,500 వరకు ఉపాధి కూలీ పనుల కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు తాగునీటి కోసం అల్లాడిపోతున్నారు. నీటి ఎద్దడి వలన పశువులను నీరున్న ప్రాంతాలకు తరలిస్తున్నారు. సాగర్‌నీరు లేక, సకాలంలో వ ర్షాలు పడక రైతులకు మళ్లీ గడ్డుకాలం వచ్చినట్లు కనిపిస్తుంది. ఈనెలలో మిరప నాట్లు ప్రారంభం కావాల్సి ఉండగా ఇప్పటికీ రైతులు వేసి చూసే దోరణిలో ఉన్నారు. దీనికి తోడు భూగర్భ జలాలు కూడా అడుగంటడంతో బోర్ల కింద సాగు చేసిన పత్తి పంట కూడా ఎండిపోతుంది. దీంతో ఈ ఏడాది రైతులు కరువుతో సహజీవనం చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. డెల్టాలో పెరుగుతున్న ఖర్చులు.. డెల్టాలో వరి పంటను సాగు చేస్తున్న రైతులకు ఖర్చులు పెరిగిపోతున్నాయి. 4.18 లక్షల ఎకరాల్లో వరి సాధారణ విస్తీర్ణం ఉంటే ఇప్పటివరకు 1.20 ఎకరాల్లో వరి నాట్లు పడ్డాయి. కొందరు రైతులు బోర్ల సహాయంతో నారుమడులు పోస్తే, మిగిలిన రైతులు విత్తనం ఎదజల్లే విధానం ద్వారా వరిని సాగు చేస్తున్నారు. వర్షాలు కురవకపోవడంతో నాటిన వరిని కాపాడుకునేందుకు డీజిల్ ఇంజిన్ల ద్వారా సాగునీటిని సరఫరా చేస్తున్నారు. ఆగస్టులో వర్షాలు కురుస్తాయనే ఆశతో డెల్టా రైతులు ఉన్నారు. కరువు లేదట : పరిస్థితులు ఇలా ఉంటే జిల్లాలో కరువు లేవని జిల్లా యంత్రాంగం చెబుతోంది. శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశపు హాలులో నిర్వహించిన సమీక్షలో జిల్లాలో కరువు పరిస్థితులు లేవని, పంటలను కాపాడుకునేందుకు డ్రిప్ ఇరిగేష్ను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. -
సీమాంధ్రలో చెదురుమదురు వర్షాలు
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ అంతటా నైరుతి రుతుపవనాలు విస్తరించాలంటే నాలుగైదు రోజులు పట్టే అవకాశం ఉందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం బుధవారం వెల్లడించింది. కోస్తాంధ్ర, రాయలసీమలో చెదురుమదురు వర్షాలు పడతాయని తెలిపింది. అలాగే తెలంగాణలో అక్కడక్కడా ఉరుములుతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని పేర్కొంది. అయితే అనంతపురం, కర్ణాటకలోని బళ్లారి, చెన్నై నగారాన్ని నైరుతి రుతుపవనాలు తాకాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. -
ఈ ఏడాది సాధారణ వర్షపాతం..
రాయలసీమలో స్వల్ప తగ్గుదల న్యూఢిల్లీ: ఈ ఏడాది దేశ వ్యాప్తంగా సాధారణ వర్షపాతం నమోదవనుండగా, రాయలసీమలో స్వల్ప తగ్గుదల ఉండనుంది. అసోచామ్ - స్కైమెట్ వాతావరణ నివేదికలో ఈ మేరకు వెల్లడైంది. అకాల వర్షాల వల్ల రబీ పంట నష్టం కొనసాగుతుందని, ఉత్తర భారత్‌లో ఏప్రిల్ తొలి వారంలో వర్షాలు పడే అవకాశముందని నివేదికలో పేర్కొన్నారు. రాయలసీమతోపాటు హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హరియాణా, ఉత్తరాఖండ్, దక్షిణ లోతట్టు కర్ణాటక, ఉత్తర తమిళనాడు, ఈశాన్య ప్రాంతాల్లో వర్షపాతంలో స్వల్ప తగ్గుదల నమోదవుతుందని తెలిపారు. సాగవుతున్న మొత్తంలో వర్షాలపై ఆధారపడి సాగు చేస్తున్న భూమి 60 శాతం ఉంది. -
రబీ రందీ..
ఆదిలాబాద్ : ఈ ఏడాది వర్షాభావంతో జిల్లాలోని జలాశయాలు అడుగంటాయి. గతేడాది ఇదే సమయానికి నిండుకుండలను తలపించిన ప్రాజెక్టులు ప్రస్తుతం డెడ్‌స్టోరేజీకి చేరువలో ఉన్నాయి. కాలువ మట్టానికి కూడా నీళ్లు లేక ఆయకట్టుకు నీళ్లంద ని పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురువలేదు. రబీలో ప్రాజెక్టుల కింద సాగుపై ఆశలు పెట్టుకున్న రైతులు ఆందోళకు గురవుతున్నారు. జూన్ 1 నుంచి ఇప్పటివరకు జిల్లా సాధారణ వర్షపాతం 1088.6 మిల్లీ మీటర్లు కాగా కేవలం 734.9 మిల్లీ మీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. దీంతో ఈ ఏడాది -33 శాతం వర్షాభావ పరిస్థితి నెలకొంది. ఖరీఫ్ పంటల పరంగా ప్రధానంగా పత్తి, సోయా, వరి దిగుబడులు అమాంతంగా పడిపోయి రైతన్నలు తీవ్ర దిగాలులో ఉన్నారు. నిరాశే.. గతేడాది భారీ వర్షాలతో లక్షల క్యూసెక్కుల నీటిని ప్రా జెక్టు గేట్లు ఎత్తి దిగువకు వదిలారు. ఈ ఏడాది పరిస్థితి భిన్నంగా ఉంది. సాధారణ వర్షపాతం కూడా నమోదు కాకపోవడంతో ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రధానంగా ఎస్సారెస్పీ, కడెం, స్వర్ణ నీటి మట్టాలు అడుగంటాయి. శ్రీరాంసాగర్ నుంచి సరస్వతీ కాలువ కింద నిర్మల్, లక్ష్మణచాంద, మామడ, ఖానాపూర్‌లో సుమారు 35 వేల ఆయకట్టు ఉంది. రబీలో సరస్వతీ ఆయకట్టుకు నీరందించలేమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. స్వర్ణ కింద సారంగాపూర్, నిర్మల్ మండలాల్లో 8,945 ఎకరాల ఆయకట్టు ఉంది. రబీలో స్వర్ణ నుంచి నీళ్లందించడం సాధ్యం కాద ని తేల్చిచెపుతున్నారు. కడెం ప్రాజెక్టు కింద జన్నారం, కడెం, లక్సెట్టిపేట, దండేపల్లి, మంచిర్యాల మండలాల్లో 68,158 ఎకరాల ఆ యకట్టు ఉంది. ప్రధానంగా వరి సాగు చేస్తారు. ఈ ఏడాది కడెంలో నీటి సామర్థ్యం ఆందోళన కలిగిస్తోంది. సాగునీరు అందేది కష్టంగా నే కనిపిస్తోంది. సాత్నాల కింద జైనథ్, బేల, ఆదిలాబాద్ మండలాల్లోని 24 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఖరీఫ్‌లో 14 వేల ఎకరాల వరకు నీరందుతుంది. టేల్ ఎండ్ వరకు నీరందని పరిస్థితి ఉంది. కేవలం ఖరీఫ్ పంటలకు మాత్రమే సాత్నాల సాగు నీరందిస్తుంది. రబీ పంటలు అంతంత మాత్రంగానే ఉండడంతో సాత్నాల నుంచి నీటి విడుదల లేదు. మత్తడివాగు కింద తాంసి, తలమడుగులోని 8,500 ఎకరాల ఆయకట్టుకు ఖరీఫ్‌లో మాత్రమే నీరందుతుంది. -
‘ఉపాధి’ ఎండమావే!
తీవ్ర దుర్భిక్షంతో 57 మండలాల్లో ఖరీఫ్ పంటలకు నష్టం సేద్యం పడకేయడంతో గ్రామాల్లో ఉపాధి దొరకని దుస్థితి ఉపాధిహామీ కింద పని కల్పించడంలో సర్కారు వైఫల్యం పొట్టచేత పట్టుకుని నగరాలకు వలస వెళ్తున్న గ్రామీణులు వరుసగా ఐదో ఏటా జిల్లాను కరవు కాటేసింది. దుర్భిక్షంతో సేద్యం పడకేసింది. రైతులే కూలీలుగా మారిపోవడంతో పల్లెల్లో పని దొరకని దుస్థితి నెలకొంది. ఉన్న ఊళ్లో చేతినిండా ఉపాధి కల్పించి.. వలసల నివారణకు చేసిన ఉపాధి చట్టాన్ని ప్రభుత్వం అపహాస్యం చేస్తోంది. ఉపాధిహామీ పథకం కింద పని కల్పించకపోవడంతో రెక్కాడితేగానీ డొక్కాడని రైతులు, రైతు కూలీలు పొట్ట చేత పట్టుకుని సుదూర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. ఇదీ మన జిల్లా గ్రామీణ చిత్రం..! సాక్షి ప్రతినిధి, తిరుపతి/బి.కొత్తకోట: జిల్లా లో పశ్చిమ మండలాలపై నైరుతి రుతుపవనాల ప్రభావం.. తూర్పు మండలాలపై ఈశాన్య రుతుపవనాల ప్రభావం అధికంగా ఉంటుంది. ఏడాదికి జిల్లాలో 918.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. కానీ.. గత నాలుగేళ్లుగా వ్యవసాయాన్ని దుర్భిక్షం కాటేసింది. ఈ ఏడాది కోటి ఆశలతో ఖరీఫ్ పంటలను సాగుచేసిన రైతులను వరుణుడు చిన్నచూపు చూశాడు. నైరుతి రుతుపవనాల ప్రభావం వల్ల జిల్లాలో 439.4 మిమీల వర్షం కురవాల్సి ఉండగా.. కేవలం 217.4 మీమీల వర్షం కురిసింది. సాధారణ వర్షపాతం కంటే 38 శాతం తక్కువ నమోదైనట్లు స్పష్టమవుతోంది. నైరుతి రుతుపవనాలపై ఆధారపడి ఖరీఫ్‌లో 1.38 లక్షల హెక్టార్లలో సాగుచేసిన వేరుశెనగ పంట ఎండిపోయింది. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో భూగర్భజలమట్టం 17.68 మీటర్లకు పడిపోయింది. భూగర్భజలమట్టం పడిపోవడంతో 60 వేలకుపైగా బోరుబావులు ఎండిపోయాయి. అటు మెట్ట భూముల్లోనూ.. ఇటు బోరు బావుల కింద సాగుచేసిన ఆరు తడి పంటలు ఎండిపోవడంతో ఖరీఫ్ రైతులను నట్టేట ముంచింది. ఇక ఈశాన్య రుతుపవనాల ప్రభావం వల్ల జిల్లాలో 395.4 మీమీల వర్షపాతం నమోదవ్వాలి. ఇప్పటికి 105.7 మిమీ. కురిసింది. నైరుతి, ఈశాన్య రుతపవనాల ప్రభావం వల్ల ఇప్పటికి 545.1 మిమీల వర్షం కురవాల్సి ఉండగా.. 317.5 మిమీలు కురిసింది. అంటే.. సాధారణ వర్షపాతం కన్నా 42 శాతం తక్కువ కురిసినట్లు స్పష్టమవుతోంది. వర్షపాతం.. పంటల పరిస్థితిని ఆధారంగా తీసుకుంటే జిల్లాలో 57 మండలాల్లో కరవు పరిస్థితులు నెలకొన్న ట్లు అధికారవర్గాలు స్పష్టీకరిస్తున్నాయి. ఖరీఫ్ పంట లు నష్టాల దిగుబడులను మిగల్చడంతో రబీ సాగు పై రైతులు ఆసక్తి చూపడం లేదు. రబీలో జిల్లాలో 59,970 హెక్టార్లలో పంటలు సాగుచేయాల్సి ఉండ గా.. ఇప్పటికి కేవలం 883 హెక్టార్లలోనే పంటలు సాగుచేయడమే అందుకు తార్కాణం. ఊళ్లకు ఊళ్లు ఖాళీ.. వర్షాభావ పరిస్థితుల వల్ల వ్యవసాయం పడకేయడంతో పల్లెల్లో చేయడానికి పని దొరకని దుస్థితి నెలకొంది. రైతులే కూలీలుగా మారడంతో రైతు కూలీల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. రెక్కాడితేగానీ డొక్కాడని కూలీలతోపాటూ రైతులూ వలసబాట పట్టారు. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ముంబై, నాగ్‌పూర్ వంటి పట్టణాలకు వలస వెళ్తున్నారు. తంబళ్లపల్లె, మదనపల్లె, పీలేరు, పుంగనూరు, పలమనేరు, కుప్పం నియోజకవర్గాల్లో ఊళ్లకు ఊళ్లు ఖాళీ అయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తోన్న కుప్పం నియోజకవర్గంలో అత్యధిక సంఖ్యలో రైతులు, రైతు కూలీలు వలస వెళ్లారు. కొందరైతే ముసలివాళ్లను, పిల్లలను ఇళ్లల్లో ఉంచి.. భార్యాభర్తలు ఇద్దరూ వలస వెళ్లారు. మరి కొందరైతే ఇంటికి తాళం వేసి.. కుటుంబం మొత్తం వలస వెళ్లారు. వలసలతో గ్రామాలన్నీ బోసిపోయాయి. కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది. ఆలనాపాలనా లేక వృద్ధులు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏదీ ఉపాధి హామీ..? ఉన్న ఊళ్లో చేతినిండా పని కల్పించడం కోసం 2005లో కేంద్రం ఉపాధి చట్టాన్ని చేసింది. ఆ చట్టం అమల్లో భాగంగా జిల్లాలో ఏప్రిల్ 2, 2006న ఉపాధిహామీ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ పథకం కింద 66 మండలాల్లోని 1,380 పంచాయతీల్లో 11,580 గ్రామాల్లోని 6.38 లక్షల మందికి జాబ్‌కార్డులు జారీ చేశారు. ఇందులో 5.07 లక్షల మంది సభ్యులతో శ్రమ శక్తి సంఘాలను ఏర్పాటుచేశారు. ఏడాదికి గరిష్టంగా వంద పని దినాలు కల్పించాలని నిర్ణయించారు. పని కల్పించమని అడిగిన వారంలోగా పని కల్పించకపోతే సంబంధిత జాబ్‌కార్డ్ లబ్ధిదారునికి పరిహారం చెల్లించేలా నిబంధన పెట్టారు. కానీ.. ఈ పథకాన్ని ప్రభుత్వం నిర్యీర్యం చేస్తోంది. అడిగిన తక్షణమే పని కల్పించకుండా.. వేతనాలు చెల్లించకుండా ఉపాధిహామీ పథకాన్ని నీరుగార్చుతున్నారు. ఉపాధిహామీ పథకం కింద పని చేసిన కూలీలకు చెల్లించాల్సిన వేతన బకాయిలు రూ.13 కోట్లకు చేరుకోవడమే అందుకు తార్కాణం. ఈ ఏడాది ఇప్పటిదాకా ఒక్కో కుటుంబానికి సగటున 48.95 పని దినాలు కల్పించారు. వంద రోజులు పని దినాలు కేవలం 22,492 మందికి మాత్రమే కల్పించడం గమనార్హం. ఉపాధిహామీ కింద పని కల్పించకపోవడంతో రైతులు, రైతు కూలీలు కన్నతల్లి వంటి ఉన్న ఊళ్లను వదిలి వలస వెళ్తోండటం గమనార్హం. వంద రోజులు పని కల్పించలేని ప్రభుత్వం.. కరవు నేపథ్యంలో ఉపాధిహామీ పని దినాలను 150కి పెంచాలని ఇటీవల లేఖరాయడం కొసమెరుపు. పనిలేక ఖాళీగా ఉన్నాం మా ఊళ్లో వీరాంజనేయ, అమరేశ్వర గ్రూపుల్లో 27 మంది కూలీలు కరువు పనులకు వెళ్లేవాళ్లము. జూన్ నెల లో చెరువులో మట్టి పనులు చేసినాం. అప్పటి నుంచి పనుల్లేక ఇళ్లకాడ ఖాళీ గా ఉండాము. కరువు పనికి పోదామని ఉన్నా పనులు చేయమని చెప్పే వాళ్లే లేరు. ఆఫీసర్లు గూడా వచ్చి కరువు పనులు చేసుకోమని ఎవ రూ చెప్పలే. ఈసారి పంటలు పండకపోయా. ఇట్లే ఉంటే బెంగళూరుకు వెళ్లిపోవాల్సిందే. -వేమనారాయణ, ఉపాధి కూలీ, గజ్జెలవారిపల్లి ఇంతవరకు బిల్లులేదు ఈ ఏడాది జూన్‌లో మా గ్రూపులోని 12 మంది కూలీలు కలసి కొత్తచెరువులో మట్టి తవ్వే పనికిపోయాం. పొలాలకు తోలిన 300 ట్రాక్టర్ల మట్టిని చల్లాం. సగం బిల్లులు మాత్రం ఇచ్చారు. ఇంకా రూ.20 వేలు ఇవ్వాలి. పోస్టాఫీసుకు పోతే మా అకౌంట్లో బిల్లులు పడలేదంటున్నారు. -రమణ, ఉపాధి కూలీ, గజ్జెలవారిపల్లె -
కరువు కోరల్లో తెలంగాణ!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో సాధారణ వర్షపాతం నమోదైనా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, విదర్భ, మరాట్వాడా, తూర్పు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, పంజాబ్, చండీగఢ్, జమ్మూ కాశ్మీర్ తదితర ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు కలవరపెడుతున్నాయి. తెలంగాణలో జూన్ 1వతేదీ నుంచి ఆగస్టు 20వతేదీ మధ్య కాలంలో సాధారణ వర్షపాతం కంటే 55 శాతం తక్కువగా నమోదైంది. ఇక ఏపీకి సంబంధించి కోస్తాంధ్రలో మైనస్ 35 శాతం, రాయలసీమలో మైనస్ 28 శాతం వర్షపాతం నమోదైంది. 2 వారాల్లో వానలు పడకుంటే కష్టమే.. తెలంగాణలో మొక్కజొన్న, వేరుశనగ పంటలపై రైతుల ఆశలు ఆవిరయ్యాయి. వరి పొలాలు నీళ్లు లేక బీళ్లలా మారాయి. వర్షాభావ పరిస్థితులకు తోడు కరెంటు కోతలు కరువును తలపిస్తున్నాయి. ఆగస్టు 14వ తేదీ నుంచి 22వ తేదీ వరకు తెలంగాణలో సాధారణ వర్షపాతం కంటే 86 శాతం తక్కువగా నమోదవడం గమనార్హం. 50.33 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా కేవలం 7.3 మి.మీ. వర్షం మాత్రమే కురిసింది. ఇదే పరిస్థితి మరో రెండు వారాలు కొనసాగితే తెలంగాణ ప్రాంతం కరువుతో విలవిల్లాడే ప్రమాదం పొంచి ఉంది. ఆగస్టు 27వ తేదీ తరువాత తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు పడవచ్చని మాత్రం తెలిపింది. 580 మండలాల్లో కరువు ఛాయలు హైదరాబాద్: ఏపీలో ఉన్న 664 మండలాలకు గాను 580 మండలాల్లో కరువు ఛాయలు నెలకొన్నాయని మంత్రి నిమ్మకాయల చిన రాజప్ప వెల్లడించారు. శనివారం శాసనమండలి జీరో అవర్‌లో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఉప ముఖ్యమంత్రి సమాధానం ఇచ్చారు. ఆగస్టు 31వ తేదీ నాటికి తగినంత వర్షం రాకపోతే అనంతపురం, వైఎస్ఆర్, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, చిత్తూరు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లోని 2.89 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ప్రత్యామ్నాయ పంటల సాగు చేసేందుకు ప్రత్యేకంగా ప్రణాళికను సిద్ధం చేసినట్లు తెలిపారు. -
నీళ్లు కరువు.. గుండె‘చెరువు’
మేడ్చల్ రూరల్ : ఖరీఫ్ సీజన్లో సాధారణ వర్షాలు కూడా కురవకపోవడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు గడిచినా ఇప్పటి వరకు చిరుజల్లులు తప్ప పూర్తి నేల తడిచింది లేదు. వరుణిడి కోసం ఎదురుచూసిన రైతులు బోరుబావుల వద్ద ఉన్న నీటితో వరి పంట వేసుకున్నారు. దీనికీ అంతంత మాత్రమే నీళ్లు అందుతున్నాయని, వర్షాలు కురవకపోతే భవిష్యత్‌లో ఈ పంటలు కూడా పండే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం మొక్కజొన్న సాగుకు సరిపడే వర్షం కూడా కురవలేదని, ఏనాడు ఇంత గడ్డు పరిస్థితి ఎదురవలేదని అంటున్నారు. విత్తన సమయం ముగుస్తుండడంతో రైతులు భవిష్యత్‌పై ఆశలు వదులుకుని ప్రత్యామ్నాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నారు. నిండని చెరువులు... అడపాదడపా కురిసిన చిరుజల్లులకు చెరువుల్లోకి నీళ్లు చేరలేదు. మండలంలోని అన్ని గ్రామాల్లో ఎండిపోయి వెలవెలబోతున్నాయి. చెరువుల్లో నీరు లేక భూగర్భజలాలు అడుగంటిపోయి బోరుబావుల్లో నీటిశాతం తగ్గిపోయింది. ఈ వర్షాకాలంలోని జూన్‌లో 123.5 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతానికిగాను కేవలం16.4 మిల్లీమీటర్ల వర్షం కురవగా, జూలైలో 224 మి.మీ బదులు 68.2 మి.మీ వర్షపాతం నమోదైంది. ఈనెల 8వ తేదీ వరకు 14.6 మి.మీ వర్షపాతం మాత్రమే నమోదైంది. వారం రోజులుగా కురిసిన ముసుర్లకు బోరుబావుల వద్ద కొద్దిపాటి పంట సాగు చేపడుతున్నా, ఆలస్యం కావడంతో సగం దిగుబడే వచ్చే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. పంటల సంగతి ఎలా ఉన్న కరువు ఇలానే కొనసాగితే ఇబ్బందులు తప్పవని జనం ఆందోళన చెందుతున్నారు. చేయూతనందించాలి.. కరువుతో గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్న రైతులకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపించి ఆదుకోవాలి. పది మందికి అన్నం పెట్టే రైతు పంట సాగు చేయలేక ఇతర పనుల్లోకి కూలీలుగా వెళ్లే పరిస్థితులు వచ్చాయి. అధికారులు, శాస్త్రవేత్తలు గ్రామాల్లో పర్యటించి రైతులకు చేయూతనందించాలి. - సత్యనారాయణ, సోమారం -
ముసురు వానలే..
50 శాతం లోటు వర్షపాతం రెండు మండలాల్లోనే సాధారణం 35 మండలాల్లో లోటు 20 మండలాల్లో అత్యల్పం వర్షాకాలం మొదలైన నెలరోజుల తర్వాత అల్పపీడనం పుణ్యమాని ముసురు మురిపించింది. జిల్లాలో మూడు రోజులుగా చినుకులు సవ్వడి చేస్తున్నా గట్టి వర్షాలు పడకపోవడం నిరాశపర్చింది. ఆకాశం పూర్తిగా మేఘావృతమైనప్పటికీ అంతలోనే మబ్బులు తేలిపోవడం ఆందోళనకు గురిచేసింది. తేలికపాటి వానలతో ఇప్పటికే నాటిన విత్తనాలకు ప్రాణం పోసినట్లయింది. అయితే ఆశించిన వర్షపాతం నమోదు కాకపోవడం వల్ల అరకలు ముందుకు సాగే పరిస్థితి లేదు. ఇప్పటికీ అన్నదాతలు పూర్తిస్థాయిలో పొలం పనుల్లో నిమగ్నం కాలేదు. వరినార్లకు ఊరటనిచ్చే వర్షాల కోసం రైతులకు ఎదురుచూపులు తప్పడంలేదు. - కరీంనగర్ అగ్రికల్చర్ కరీంనగర్ అగ్రికల్చర్: జిల్లావ్యాప్తంగా జూలైలో ఇప్పటివరకు సాధారణ వర్షపాతం 92.2 మిల్లీమీటర్లు కాగా, 55 మిల్లీమీటర్ల మాత్రమే నమోదయింది. గతేడాది ఇదే సమయానికి 103 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జూన్‌లో సాధారణ వర్షపాతం 153 మిల్లీమీటర్లకు గాను 78.7 మిల్లీమీటర్లుగా రికార్డయింది. జూన్, జూలై మాసాల్లో సాధారణ వర్షపాతం 270.8 మిల్లీమీటర్లు కాగా, ఇప్పటివరకు 136.7 మిల్లీమీటర్లే కురిసింది. జిల్లావ్యాప్తంగా సగటున 50 శాతం లోటు వర్షపాతం నమోదయింది. జిల్లాలో 57 మండలాలకు గాను 35 మండలాల్లో లోటు వర్షపాతం ఉంది. 20 మండలాల్లో అత్యల్ప వర్షపాతం నమోదయింది. సారంగాపూర్, చొప్పదండి మండలాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదయినట్టు అధికారిక నివేదికలు వెల్లడిస్తున్నాయి. సారంగాపూర్‌లో 273 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతానికి 310.4, చొప్పదండిలో 260.1కి గాను 253.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. లోటు వర్షపాతం మండలాలు.. కమాన్‌పూర్, పెగడపల్లి. గంగాధర. హుస్నాబాద్, జూలపల్లి, మెట్పల్లి, భీమదేవరపల్లి, గొల్లపల్లి, జగిత్యాల, కథలాపూర్, శ్రీరాంపూర్, కోరుట్ల, కరీంనగర్, మంథని, మల్యాల, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, ధర్మపురి, ఓదెల, జమ్మికుంట, వీణవంక, కోహెడ, ధర్మారం, సైదాపూర్, ముత్తారం, ఎల్కతుర్తి, కాటారం, మహాముత్తారం, రామడుగు, ఎలిగేడు, మల్హర్, బెజ్జంకి మండలాల్లో లోటు వర్షపాతం నమోదయింది. అత్యల్ప వర్షపాతం మండలాలు.. రాయికల్, సుల్తానాబాద్, కేశవపట్నం, మేడిపల్లి, సిరిసిల్ల, రామగుండం, చందుర్తి, ఇల్లంతకుంట, తిమ్మాపూర్, ఎల్లారెడ్డిపేట, వెల్గటూర్, వేములవాడ, మహదేవపూర్, బోయినిపల్లి, చిగురుమామిడి, కొడిమ్యాల, మానకొండూర్, కోనరావుపేట, ముస్తాబాద్, గంభీరావుపేట మండలాల్లో అత్యల్ప వర్షపాతం రికార్డయింది. రెండు రోజుల్లో 5.1 మిల్లీమీటర్లు.. జిల్లాలో ఆదివారం నుంచి సోమవారం ఉదయం 8గంటల వరకు 40 మండలాల్లో వర్షం కురిసింది. జిల్లావ్యాప్తంగా సగటున 5.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. అత్యధికంగా మహాముత్తారం మండలంలో 33.6 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. మహదేవపూర్‌లో 18.4, మల్యాల 18.2, కాటారం 14.6, ముత్తారం 13.4, రాయికల్ 13, మేడిపల్లి, తిమ్మాపూర్ 12.2, కమాన్‌పూర్ 10.6, మల్హర్ 9.3, మంథని, పెద్దపల్లి 8.2, కోరుట్ల 8, కాల్వశ్రీరాంపూర్ 7.6, రామగుండంలో 7.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. మిగిలిన మండలాల్లో మోస్తరుగా జల్లులు పడ్డాయి.