1167 హెక్టార్లకే పరిమితం అయిన వరి
ఆశించిన స్థాయిలో కురవని వర్షాలు
దిక్కుతోచని స్థితిలో రైతులు
విజయనగరంఫోర్ట్: రబీలో వరి సాగు జిల్లాలో ప్రశ్నార్థకంగా మారింది. సాధారణ విస్తీర్ణంలో సగం కూడా వరి సాగు అవలేదు.గత ఏడాది కంటే ఈ ఏడాది సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. వేరుశెనగ,నువ్వులు పంటలదీ అదే పరిస్థితి. రైతులు ఖరీఫ్‌లో వరి పంటను ఎక్కువగా సాగు చేస్తారు. గత మూడేళ్లుగా రబీలో కూడా వరి సాగుకు ఆశక్తి చూపుతున్నారు. బోర్లు, బావులు ఉన్న ప్రాంతంలో వరి పంటను వేస్తారు. అదేవిధంగా పెద్ద పెద్ద చెరువుల్లో నీరు పుష్కలంగా ఉంటే రబీలో వరి పంటను వేస్తారు. కానీ గత ఏడాది సెప్టెంబర్ నెల తర్వాత జిల్లాలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. దీంతో చెరువులు, గుంతలు అడుగంటాయి.
1167 హెక్టార్లకే పరిమితమైన వరి పంట వరి సాధారణ విస్తీర్ణం 5577 హెక్టార్లు కాగా 1167 హెక్టార్లకే పరిమితం అయింది. సాధారణ విస్తీర్ణంలో సగం కూడా సాగవలేదు.గత ఏడాది రబీలో వరి సాధారణ విస్తీర్ణం 5242 హెక్టార్లు కాగా 5357 హెక్టార్లలో సాగైంది. రాలనిచినుకు గత ఏడాది సెప్టెంబర్ నెల సన్నగిల్లిన సాగు తర్వాత జిల్లాలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు, దీంతో చెరువులు, గుంతల్లో నీరు అడుగుంటింది. నీరు లేకపోవడంతో రైతులు వరిపంటను సాగు చేయడానికి ఆసక్తి చూపలేదు. ఆక్టోబర్ నెల సాధారణ వర్షపాతం 167.9మీ.మీ కాగా 51.5 మి.మీ నమోదైంది. నవంబర్ నెల సాధారణ వర్షపాతం73.3 మి.మీ కాగా 43.7 మి.మీ నమోదైంది. డిసెంబర్ నెల సాధారణ వర్షపాతం 4.6 మీ.మీ కాగా 3.9 మీ.మీ నమోదైంది. జనవరి నెల సాధారణ వర్షపాతం 9.9 మి.మీ కాగా 0.6 మి.మీ నమోదైంది.
ఎండుతున్న పంటలుచెరువుల్లో నీరు లేకపోవడంవల్ల ఇప్పటికే సాగులో ఉన్న కూరగాయలు, నువ్వు, చోడి, వేరుశెనగ వంటి పంటలు ఎండుతు న్నాయి. దీంతో పంటలను ఏవిధంగా కాపాడుకోవాలో తెలియక రైతులు మధనపడుతున్నారు. మిరప, టమాటో, బెండ, చోడి పంటలను కాపాడుకోవడానికి రైతులు ట్యాంకర్లు, కావిళ్లతో నీటిని తెచ్చితడుపుతున్నారు. బావుల్లో కూడా నీరు తక్కువగా ఉండడంతో దిక్కుతోచని స్థితిలో రైతులు ఉన్నారు. పంటలు వేయడం మానుకున్నాను.
గత ఏడాది చెరువులో నీరు ఉండడం వల్ల చోడి పంటను వేశాను. ఈఏడాది వేయాలనుకున్నాను. కానీ చెరువులో నీరు లేకపోవడంతో వేయలేదు. 10 సెంట్లలో మిరప పంట వేశాను. పూత రాకముందే చెరువు అడుగంటడంతో దూర ప్రాంతం నుంచి నీటిని కావిడితో తెచ్చి తడుపుతున్నాను.ఎస్.రామునాయుడు, రైతు, పెదవేమలి
సన్నగిల్లిన సాగు
Published Fri, Feb 5 2016 1:39 AM | Last Updated on Sun, Sep 3 2017 4:57 PM
Advertisement
Advertisement